ponnam prabhakr
-
కేసీఆర్ మాటలు ఏమయ్యాయి : పొన్నం
సాక్షి, సిద్దిపేట : కుర్చీ వేసుకుని గౌరవెల్లి ప్రాజెక్ట్‌ను పూర్తిచేస్తానన్న సీఎం కేసీఆర్ మాటలు ఏమయ్యాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కుట్రలో భాగంగానే గౌరవెల్లి ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేసి సిద్దిపేట నియోజకవర్గానికి నీళ్లు తీసుకుపోయేందుకే రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్ పూర్తి చేశారని ధ్వజమెత్తారు. మంత్రి హరీష్ రావు కేటీఆర్‌లు సంబరాలు చేసుకుంటే.. ఈ ప్రాంత ప్రజలు మీకు శవ యాత్రలు చేయాలా అని అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో నిప్పులు చెరిగారు. గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టులను కాలపరిమితితో తొందరగా పూర్తి చేయకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ప్రాజెక్టులు పూర్తి చేసేంతవరకు నిర్వాసితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పొన్నం హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు పూర్తి చేస్తే తామే కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తామని పొన్నం ప్రభాకర్ అన్నారు. -
గాంధీని అవమానించిన వారిపై చర్యలు: పొన్నం
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని హిందూ మహాసభ కార్యకర్తలు గాంధీ విగ్రహాన్ని అవమానించినా ఇంతవరకు మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణమని, వెంటనే నింది తులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గత నెల 30న గాంధీ విగ్రహాన్ని హిందూ మహాసభ కార్యకర్తలు అవమానపర్చినందుకు నిరసనగా సోమవారం గాంధీభవన్‌లో నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ గాంధీ విగ్రహానికి జరిగిన అవమానం భారత జాతికి జరిగిన అవమానమని అన్నారు. గాంధీ విగ్రహంపై దాడితోనే హిందూ మహాసభ బీజేపీ అనుబంధ సంఘమని తేలిపోయిందని అన్నారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, ఉపాధ్యక్షుడు కుమార్‌రావు, మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కోర్టుల్లో పోరాడతాం
ప్రస్తుత ఎన్నికల్లో ఈవీఎంలలో జరిగిన మోసాలు, ఎన్నికల అధికారుల తీరుపై పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్ తెలిపారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. రిట ర్నింగ్ అధికారులు, పోలీసులు కుమ్మక్కయ్యి పోలింగ్ ఏజెంట్లను కూడా సెంటర్లలోకి రానివ్వకుండా టీఆర్ఎస్కు సహకరించారన్నారు. ఎన్నికల సంఘం, టీఆర్ఎస్ కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. ‘బ్రింగ్ బ్యాక్ పేపర్ బ్యాలెట్’ఉద్యమం హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తామన్నారు. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోనూ పోరాడతామన్నారు. -
కేసీఆర్ బంధువుల పథకంగా ‘రైతుబంధు’
చందుర్తి(వేములవాడ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు పథకం కేసీఆర్ బంధువుల పథకంగా మారిందని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్ విమర్శించారు. చందుర్తి మండలం కట్టలింగంపేట, మల్యాల, చందుర్తి, మర్రిగడ్డ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ సమావేశాలు బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పొన్నం ప్రభాకర్‌గౌడ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు పథకంతో సమాన్య రైతులకన్నా భూస్వాములకే ప్రయోజనం చేకూరిందన్నారు. రెక్కల కష్టాన్ని నమ్ముకున్న రైతులకు ఒరిగిందేమి లేదన్నారు. రాష్ట్ర ఆవిర్భావ విషయమై సోనియాగాంధీని సీఎం కేసీఆర్ విమర్శించడం సరికాదన్నారు. తెలంగాణను తామే తెచ్చామని ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్ చెప్పుకుంటే ప్రజలు బొందపెడతారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ప్రగతిభవన్, కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో బందీగా మారిందన్నారు. కేంద్రం లో నరేంద్రమోదీకి అధికారమిస్తే పెద్దనోట్లురద్దు చేసి పేదప్రజలను నిండా ముంచారని తెలిపారు. ఇప్పటి వరకు ఎంతమొత్తంలో నల్లధనం వెలికితీశారో లెక్కచెప్పాలని డిమాండ్ చేశా రు. కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని జోష్యం చెప్పారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని 200 గ్రామాల్లో ఇప్పటి వరకు పర్యటించానని తెలిపారు. ఏ ఒక్క గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన లబ్ధిదారులకు పక్కనే మరోగది నిర్మించుకునేందుకు రూ.లక్ష ఇస్తామన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, మహిళ సంఘానికి రూ.లక్ష ఉచితంగా ఇస్తామన్నారు. ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్, టీపీసీసీ సభ్యులు ఏనుగు మనోహర్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ముకిడే చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ ఇన్చార్జి నాగం కుమార్, జిల్లా నాయకులు చిలుక అంజిబాబు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు పొద్దుపొడుపు లింగారెడ్డి, వేములవాడ బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ముస్కు పద్మ తదితరులు పాల్గొన్నారు. -
‘చెప్పుతో కొట్టమన్నా బుద్ధి రావడం లేదు’
సాక్షి, హైదరాబాద్ : చర్చల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులను అవమానించిందని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తమ సమస్యల గురించి వివరించడానికి వచ్చిన నేతలు, ఉద్యోగులను ప్రగతిభవన్ బయటే ఆపి అహంకార పూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు. పీఆర్సీ కమిటీ, బదిలీలపై గడువు పెంపు తప్ప ఉద్యోగుల మేలు కోసం సీఎం కేసీఆర్ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గతంలో ఉన్న ట్రిబ్యునల్‌ను కేసీఆర్ సర్కార్ ఎందుకు రద్దు చేసిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇచ్చింది మూడు శాతమే... నాలుగేళ్లుగా కేసీఆర్ సర్కార్ ఉద్యోగుల గురించి పట్టించుకోవడం లేదని పొన్నం విమర్శించారు. రోశయ్య సీఎంగా ఉన్నపుడే ఉద్యోగులకు 39 శాతం ఫిట్మెంట్ ఇస్తే.. అంతకంటే కేవలం మూడు శాతం పెంచి గొప్పలు చెప్పుకోవడం తప్ప కొత్తగా చేసిందేమీలేదని ఎద్దేవా చేశారు. అయినా ఈ విషయంలో కేసీఆర్‌ను, కేటీఆర్‌ను అని ఏం లాభం లేదని.. దీనికంతటికీ ఉద్యోగ సంఘం నేతలే పరోక్ష కారణమని ఆరోపించారు. చెంచాగిరి చేయడం వల్లే.. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగ సంఘం నేతలు ఎమ్మెల్యే టికెట్ల కోసమే ప్రభుత్వానికి చెంచాగిరి చేస్తున్నారని పొన్నం ఆరోపించారు. ఎక్కువగా మాట్లాడేవారిని చెప్పుతో కొట్టాలంటూ కేటీఆర్ మాట్లాడినా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బూతులు తిడుతున్నా వారికి బుద్ధి రావడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు కేసీఆర్ తాబేదార్లుగా మారడం వల్ల ఆంధ్రాలో నాలుగో తరగతి ఉద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారంటూ ఆయన విమర్శించారు. -
ఆయన కంటి, పంటి ఆపరేషన్లకు ఢిల్లీకి..
సాక్షి,కరీంనగర్ : కంటి, పంటి ఆపరేషన్లకు తప్ప ఢిల్లీకి పోని కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలేం చేస్తాడని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ఆయన శుక్రవారం విలేకరులు సమావేశంలో మాట్లాడుతూ.. విభజన హక్కుల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు టీఆర్ఎస్ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో రాజీనామాలే అన్నింటికి పరిష్కారమన్న పార్టీ ఇప్పుడెందుకు రాజీనామా చేయడం లేదని పొన్నం సూటిగా ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు కావడంతోనే ఎంపీలు నోరు మెదపడం లేదని, కేంద్రంతో పోరాడే దమ్ము ధ్యైర్యం లేకుంటే మహిళా కాంగ్రెస్ నేతలు పంపిన చీరలు, గాజులు వేసుకొని ఝాన్సీ లక్ష్మిభాయి స్ఫూర్తితో పోరాడాలని హితవు పలికారు. టెక్స్ టైల్ క్లస్టర్ కోసం కేంద్రంపై పోరాటానికి కాంగ్రెస్‌తో పాటు టీఆర్ఎస్ నేతలు కలిసి రావాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు. ముస్లిం రిజర్వేషన్లు పెంచలేమని కేంద్రం స్పష్టంగా చెప్పిందని, ఇప్పడు రాష్ట్ర ప్రభుత్వ వైఖరేమిటో చెప్పాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ అయినా, ఆయన కొడుకు, అల్లుడు, కూతురు వచ్చి కరీంనగర్ ఎంపీగా పోటీచేసినా తాను ఆహ్వానిస్తానని, ప్రత్యర్థి ఎవరున్నా ఎదుర్కొని విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
ఏఐసీసీ కమిటీలో పొన్నంకు చోటు
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించిన రాజ కీయ సబ్‌కమిటీలో చోటు కల్పించారు. ఎ.కె.ఆంటోని అధ్యక్షతన నియమించిన ఏఐసీసీ ప్లీనరీ సమావేశాల కమిటీలో అన్ని రాష్ట్రాల నుంచి 25మంది సభ్యులుండగా, అందులో పొన్నంకు అవకాశం కల్పిం చారు. మాజీ ప్రధాని మన్మోహన్ అధ్యక్ష తన నియమించిన డ్రాఫ్ట్ కమిటీలోనూ పొన్నంకు అవకాశం వచ్చింది. కాగా కీలక కమిటీల్లో రాష్ట్రానికి గుర్తింపు లభించడం పట్ల పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. -
టీఆర్ఎస్ ఎంపీలు చవటలు, దద్దమ్మలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను అవమానించే విధంగా ప్రధాని మోదీ మాట్లాడినా కనీసం నోరెత్తకుండా ఉన్న టీఆర్ఎస్ ఎంపీలు చవటలు, దద్దమ్మలని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. వారికి గాజులు, పసుపు, కుంకుమ పంపే రోజులు దగ్గర పడ్డాయని ఆరోపించారు. శనివారం గాంధీభవన్‌లో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ఎంపీలకు మాట్లాడటం చేతగాకపోతే రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చోవాలన్నారు. తన ప్రసంగం చివర్లో ‘జై ఆంధ్ర’ అన్న ఎంపీ కవితను చూసి తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని పొన్నం ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కలిసిన తర్వాత దేశంలోనే రాష్ట్రం నంబర్‌వన్ అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ, తెలంగాణ ఆకాంక్షలను మోదీ కించపరుస్తుంటే టీఆర్ఎస్ ఎంపీలు మౌనంగా ఉండటం సిగ్గుచేటన్నారు. -
కేసీఆర్, పవన్ ఒప్పందాన్ని బయటపెట్టాలి
కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య కుదిరిన చీకటి రహస్య ఒప్పందాన్ని బయటపెట్టాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకించడమే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌నే తాట తీస్తా అన్న పవన్ పర్యటనకు ఎర్ర తివాచీలు పరచడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాడిన జేఏసీ చైర్మన్ కోదండరాం, పార్లమెంట్లో బిల్లును ఆమోదింపజేసిన మాజీ స్పీకర్ మీరాకుమార్‌లు రాష్ట్రంలో పర్యటిస్తే ఆంక్షలు విధించిన ముఖ్యమంత్రి.. పవన్‌పై అమిత ప్రేమ చూపించడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. 2009లో ప్రమాదం జరిగితే ఎనిమిదేళ్ల తరువాత మొక్కులు చెల్లించడానికి వస్తున్నానని పవన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పలు సమస్యలపై ఆందోళన చేస్తున్న ఆయనకు నాలుగేళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని వచ్చిన సంకేతాలతోనే పవన్ లాంటి వారిని తెలంగాణలో తిప్పుకుంటూ ప్రజలను గందరగోళంలో పడేయడానికి ప్రభుత్వం కుట్రలకు తెరలేపుతోందని ఆరోపించారు. -
సీడ్ కంపెనీలతో ప్రభుత్వం కుమ్మక్కైంది
హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వం జీవో 182 తో 40 శాతం విత్తనాల ధరలను పెంచడం దారుణం. సీడ్ కంపెనీలతో ప్రభుత్వం కుమ్మక్కయింది. రైతులకు మద్దతు ధర పెంచరు.. కానీ సీడ్ ధరలు పెంచుతారా..? ప్రభుత్వం విత్తన చట్టాన్ని ఎందుకు పక్కన పెట్టింది..? రైతులు పంటలు కాల్చుకుంటుంటే సర్కార్‌కు కనబడటం లేదా..? కేసీఆర్ చెప్పిన మార్కెట్ స్థిరీకరణ నిధి ఎటుపోయింది..? మంత్రులకు చీము నెత్తురుంటే తక్షణమే రైతులను ఆదుకోవాలి. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్‌కి కనబడటం లేదా..? ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తప్పక తగులుతుందని’’ అన్నారు.