
సాక్షి, సిద్దిపేట : కుర్చీ వేసుకుని గౌరవెల్లి ప్రాజెక్ట్‌ను పూర్తిచేస్తానన్న సీఎం కేసీఆర్ మాటలు ఏమయ్యాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కుట్రలో భాగంగానే గౌరవెల్లి ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేసి సిద్దిపేట నియోజకవర్గానికి నీళ్లు తీసుకుపోయేందుకే రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్ పూర్తి చేశారని ధ్వజమెత్తారు. మంత్రి హరీష్ రావు కేటీఆర్‌లు సంబరాలు చేసుకుంటే.. ఈ ప్రాంత ప్రజలు మీకు శవ యాత్రలు చేయాలా అని అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో నిప్పులు చెరిగారు.
గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టులను కాలపరిమితితో తొందరగా పూర్తి చేయకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ప్రాజెక్టులు పూర్తి చేసేంతవరకు నిర్వాసితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పొన్నం హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు పూర్తి చేస్తే తామే కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తామని పొన్నం ప్రభాకర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment