
పొన్నం ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించిన రాజ కీయ సబ్‌కమిటీలో చోటు కల్పించారు. ఎ.కె.ఆంటోని అధ్యక్షతన నియమించిన ఏఐసీసీ ప్లీనరీ సమావేశాల కమిటీలో అన్ని రాష్ట్రాల నుంచి 25మంది సభ్యులుండగా, అందులో పొన్నంకు అవకాశం కల్పిం చారు. మాజీ ప్రధాని మన్మోహన్ అధ్యక్ష తన నియమించిన డ్రాఫ్ట్ కమిటీలోనూ పొన్నంకు అవకాశం వచ్చింది. కాగా కీలక కమిటీల్లో రాష్ట్రానికి గుర్తింపు లభించడం పట్ల పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment