రామ్‌నాథ్‌ గెలుపు ఖాయం: లక్ష్మణ్‌ | bjp leader k.laxman slams congress over president elections | Sakshi
Sakshi News home page

రామ్‌నాథ్‌ గెలుపు ఖాయం: లక్ష్మణ్‌

Jul 4 2017 1:17 PM | Updated on Mar 29 2019 9:31 PM

రామ్‌నాథ్‌ కోవింద్‌ గెలుపు ఖాయమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌: రామ్‌నాథ్‌ కోవింద్‌ను అన్ని పార్టీలు బలపరుస్తున్నందున ఆయన గెలుపు ఖాయమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. రామ్‌నాథ్‌ పేద కుటుంబానికి చెందిన వారు. ఆయన దళిత మేధావి.. రాజ్యాంగం పట్ల ఆయనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. విపక్షాలు పోటీ పెట్టాలి కాబట్టి పెడుతున్నాయన్నారు. రాష్ట్రపతి పదవికి ఆయన వన్నె తెస్తారన్నారు.
 
దళిత అభ్యర్థిపై దళిత అభ్యర్థినే పోటీకి పెట్టకూడదు.. కానీ యూపీఏ పక్షాలు దళిత అభ్యర్థినే పెట్టడంలో ఆంతర్యం ఏమిటో తెలీదని అన్నారు. గతంలో నీలం సంజీవరెడ్డిని బరిలో పెట్టినట్టు పెట్టి ఓడగొట్టారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో చీలికలు ఉన్నాయన్నారు. తన ఇంట్లో వివాహం కారణంగా రామ్‌నాధ్‌ కోవింద్‌తో భేటీలో తమ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పాల్గొనలేకపోయారన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement