‘బీజేపీ వారిద్దరికి వ్యతిరేకం ’
హైదరాబాద్: బీజేపీ భారత దేశ ప్రజలను కులాలు, మతాల పరంగా విడదీస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి విమర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సిద్ధాంతం భిన్నత్వంలో ఏకత్వమని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులు, ముస్లింల మీద దాడులు పెరిగాయన్నారు. దళితులకు, మైనార్టీలకు బీజేపీ వ్యతిరేకమని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి కూడా అదేవిధమైన భావాలు ఉన్నాయన్నారు.
కోవింద్ రాష్ట్రపతి అయితే దేశంలో అశాంతి పెరుగుతుందని హెచ్చరించారు. రైతులకు రుణమాఫీ చేయడం ఫ్యాషన్ అయిందని వెంకయ్య వాఖ్యలు చేయడం రైతుల్పి అవమాన పరచడమేనని అన్నారు. అంతరాత్మ ప్రబోధం మేరకు రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయానలి ఎమ్మెల్యేలను కోరారు. రాష్ట్రపతి ఎన్నికలు రెండు భిన్న సిద్ధాంతాల పోరుగా అభివర్ణించారు.