ఆడ్వాణీకి పుష్పగుచ్ఛమిస్తున్న కోవింద్
విపక్షాలకు గట్టి దెబ్బ.. నేడు ఉమ్మడి అభ్యర్థి ఎంపిక కోసం విపక్షాల భేటీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో తమ తరఫున ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాలని యత్నిస్తున్న విపక్షాల ఐక్యతకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు తాము మద్దతిస్తున్నట్లు జేడీయూ ప్రతినిధి కేసీ త్యాగి బుధవారం ప్రకటించారు. విపక్ష అభ్యర్థి ఎంపికపై గురువారం జరిగే విపక్షాల సమావేశానికి తాము హాజరు కాబోవడం లేదని చెప్పారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి తమ మద్దతు ఒక విడి అంశం మాత్రమేనని స్పష్టం చేశారు. దీనివల్ల మిగతా విషయాల్లో విపక్షాల ఐక్యత యత్నాలకు విఘాతం కలగదని, బీజేపీపై పోరులో విపక్షాలతో కలసి ఉంటామన్నారు. కోవింద్‌కు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు జేడీ యూ ప్రజాప్రతినిధులకు పార్టీ చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ చెప్పారని పార్టీ ఎమ్మెల్యే రత్నేశ్ సాదా వెల్లడించారు. ‘కోవింద్ మంచి వ్యక్తి కనుక జేడీయూ మద్దతిస్తుందని ఆయన మాకు చెప్పారు. సమావేశంలో పాల్గొన్న 60 మంది ఎమ్మెల్యేలు సీఎం అభిప్రాయంతో ఏకీభవించారు’ అని తెలిపారు. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షం కోవింద్‌కు పోటీగా అభ్యర్థిని పెడితే జేడీ యూ మద్దతివ్వదని నితీశ్ చెప్పినట్లు తెలుస్తోంది.
సోనియాతో మీరా భేటీ: ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై గురువారం విపక్షాల భేటీ జరగనున్న నేపథ్యంలో లోక్‌సభ మాజీస్పీకర్ మీరా కుమార్ కాంగ్రెస్ చీఫ్ సోనియాతో సమావేశమయ్యారు. దీంతో విపక్షాల అభ్యర్థిగా మీరానే ప్రకటిస్తారని ఊహాగా నాలు వెలువడ్డాయి. కోవింద్‌కు జేడీయూ మద్దతు ప్రకటించడంతో విపక్షాలను ఐక్యంగా ఉంచేందుకు కాంగ్రెస్, ఇతర విపక్షాల నేతలు మంతనాలు సాగిం చారు. మిగతా విపక్షాల నిర్ణయమే తమ నిర్ణయమని ఆర్జేడీ చీఫ్ లాలూ చెప్పారు. మరోపక్క.. కోవింద్ బీజేపీ అగ్రనేతలైన అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీలను కలుసుకున్నారు. కోవింద్‌కు తమిళనాడు సీఎం పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే(అమ్మ) వర్గం మద్దతు ప్రకటించింది.