
ఊహాగానాల్లో ఉత్తమ్: కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌తో కలసిపోయినట్టుగా టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఊహాగానాలతో మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఒక ప్రకటనలో విమర్శించారు. టీఆర్‌ఎస్, ఎంఐఎంతో కలసి అధికార దాహాన్ని తీర్చుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఎద్దేవా చేశారు. పతనమవుతున్న కాంగ్రెస్‌ను చూసి దిక్కుతోచక ఉత్తమ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పొత్తులు పెట్టుకునే కాంగ్రెస్ నేతలు గురివింద గింజల్లాగా నీతులు మాట్లాడుతున్నారని అన్నారు.