‘తప్పు మాది కాదు.. సీఎంలిద్దరిదీ’ | bjp leader k.laxman slams kcr and chandrababu over high court bifurcation | Sakshi
Sakshi News home page

‘తప్పు మాది కాదు.. సీఎంలిద్దరిదీ’

Published Thu, Jun 30 2016 11:59 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

bjp leader k.laxman slams kcr and chandrababu over high court bifurcation

హైదరాబాద్: హైకోర్టు విభజన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిష్కారం చేసుకోవాల్సిన అంశంకాగా కేంద్ర ప్రభుత్వంపై నింద వేయటం సరికాదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. అమరావతికి కేసీఆర్, చండీయాగానికి చంద్రబాబు వెళ్లారు కదా...అప్పుడెందుకు హైకోర్టు విషయం వారు మాట్లాడుకోలేదని ప్రశ్నించారు. రెండు ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే నాటకాలాడుతున్నాయని తప్పుపట్టారు.

ఏపీ హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం రూ.100 కోట్లు కేటాయించిందని లక్ష్మణ్ గుర్తు చేశారు. ప్రతి అంశాన్నీసెంటిమెంట్ పేరుతో రాజకీయం చేసే పరిస్థితి మానుకోవాలని అధికార టీఆర్‌ఎస్‌కు హితవు పలికారు. న్యాయవాదుల ఆందోళనకు తమ పార్టీ మద్దతు ప్రకటిస్తోందన్నారు. గవర్నర్ జోక్యం చేసుకుని ఈ సమస్యకు పరిష్కారాన్ని, ఆప్షన్ల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని కోరారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement