![Telangana Cabinet Meeting On June 21st Discuss On Runa Mafi](/styles/webp/s3/article_images/2024/06/19/rvanth.jpg.webp?itok=8qJtvyCO)
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఆగస్టు 15లోగా రైతు పంట రుణాల మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. ప్రధానంగా ఇదే అంశంపై క్యాబినెట్‌లో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
రుణమాఫీకి సుమారు రూ.30వేల కోట్లు, రైతుభరోసాకు మరో రూ.7వేల కోట్లు అవసరమవడంతో.. నిధుల సేకరణ ఎలా అనే అంశంపైనా మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రుణమాఫీతోపాటు, అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పన, పంటల బీమాతో పాటు పలు అంశాలపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment