సాక్షి, వనపర్తి : చేనేత కార్మికులు తీసుకున్న రుణాలను మిగతా రుణాలతో సంబంధం లేకుండా మాఫీ చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆయన శుక్రవారం వనపర్తి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చేనేత కార్మికులకు కొత్తకోటలో డిజైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
చేనేత కార్మికులు తయారుచేసిన వస్త్రాలను టెస్కో ద్వారా కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇందుకోసం 70 కోట్ల రూపాయల్ని కేటాయించామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత వస్త్రాల ఆన్‌లైన్ మార్కెటింగ్‌కు శ్రీకారం చుడుతున్నామని కేటీఆర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment