chenetha workers
-
నేతన్నలకు ఎల్లప్పుడూ సీఎం జగన్ అండగా ఉంటారు
-
జగనన్న కరెక్ట్ టైమ్ కి వచ్చిండు..చేనేత అన్న కామెంట్
-
పోచంపల్లి ఇక్కత్‌కళ ఎంతో అద్భుతం! : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
సాక్షి, యాదాద్రి: పోచంపల్లి ఇక్కత్‌కళ ఎంతో అద్భుతంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొనియాడారు. బుధవారం ఆమె భూదాన్‌పోచంపల్లిని సందర్శించారు. మొదట ఆమె శ్రీరంజన్ సిల్క్ వీవ్స్ యూనిట్‌ను సందర్శించి దారం నుంచి వస్త్రం తయారయ్యే ప్రక్రియలను స్వయంగా పరిశీలించారు. కూకున్స్ నుంచి సింగిల్ యారన్ దారం తయారీ, దారాన్ని డబులింగ్, ట్విస్టింగ్, వార్పింగ్, వెప్టింగ్ చేసి చివరకు 2ప్లే దారాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నారు. పట్టుగూళ్ల నుంచి ముడి పట్టును తీసి, మేలు రకమైన పట్టుదారం తయారు చేయడం, దాని నుంచి పడుగు, పేకలను రూపొందించి రంగులద్ది, టై అండ్ డైలో డిజైన్లను రూపొందించడం, ఆసు యంత్రపై చిటికిపోసి పలు రకాల డిజైన్లతో చీరలు తయారు చేయడం తదితర విషయాలను శ్రీరంజన్ వీవ్స్ యజమాని ఎన్నం శివకుమార్ రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్రపతి స్పందిస్తూ.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో టస్సార్ సిల్క్‌ను వినియోగిస్తారని, కానీ మల్బరీ సిల్క్ నాణ్యత బాగుందని తన స్వరాష్ట్రమైన ఒడిశాలో కూడా మల్టీ హ్యాండ్లూమ్ యూనిట్లు నెలకొల్పేందుకు తన పర్యటన ఎంతో దోహదపడిందని అభిప్రాయపడ్డారు. థీమ్ పెవిలియన్‌లో పర్యటన.. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెవిలియన్ థీమ్‌లో చేనేతకు సంబంధించిన పలు వస్త్రాల తయారీపై చేనేత కళాకారులు రాష్ట్రపతికి వివరించారు. పుట్టపాకకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు.. నూనెలో దారాన్ని నానబెట్టి ప్రాసెసింగ్ చేసి తేలియారుమాల్ వస్త్రాన్ని తయారు చేసే విధానాన్ని వివరించారు. తేలియా రుమాల్‌కు జియోగ్రాఫికల్ ఇండికేషన్ లభించిందని చెప్పారు. భూదాన్‌పోచంపల్లి డబుల్ ఇక్కత్ చీరలు, గద్వాల సిల్క్ చీరలు, వరంగల్ రామప్ప చీర, భూపాలపల్లి టస్సర్ చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరల గురించి చేనేత జౌళిశాఖ డీడీ అరుణ్‌కుమార్ వివరించారు. నారాయణపేట సిల్క్, కాటన్ చీరలు, వరంగల్ దుర్రీస్ తివాచీలు, 14వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్యంలో ఔరంగాబాద్‌లో నేసిన హిమ్రా చీరల (అప్పట్లో రాయల్ ఫ్యామిలీలకు బహుమతిగా ఇచ్చేవారు) గురించి జౌళిశాఖ డీడీ వెంకటేశం రాష్ట్రపతికి వివరించారు. ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు ఇక్కత్ వస్త్రాలు, గద్వాల చీరలు, గొల్లభామ చీరల కోసం ఏర్పాటు చేసిన స్టాల్‌ను రాష్ట్రపతి సందర్శించారు. చేనేత కళాకారులు ఆమెకు ఆయా వస్త్రాల తయారీ గురించి చెప్పారు. ఆన్లైన్ మార్కెటింగ్‌లో వస్త్రాల అమ్మకం గురించి సాయిని భరత్, ఎన్జీఓ సుధ రాష్ట్రపతికి వివరించారు. పడుగు, పేకల కోసం వినియోగించే 30 చరఖా (రాట్నం)లను మహిళలు తిప్పుతుండగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వాటిని పరిశీలించారు. చరఖా పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన మగ్గంపై నేత తీరును పరిశీలించారు. పద్మశ్రీ చింతకింది మల్లేషం రూపొందించిన ఆసు యంత్రాన్ని పరిశీలించి దాని పనితనాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శ్రీరంజన్ వీవ్స్ మల్టీ యూనిట్లో పనిచేస్తున్న చేనేత కార్మికుల వద్దకు వెళ్లి ఒక్కొక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఎన్ని సంవత్సరాలుగా మగ్గం పనిచేస్తున్నారని, ఈ వృత్తి వల్ల నెలకు ఎంత కూలి లభిస్తుందని అడిగి తెలుసుకున్నారు. ఒడిశా చేనేత కళాకారులను తాము మెహర్ అని పిలుచుకుంటున్నామని చెప్పారు. ఇక్కడి చేనేత కళాకారుల నేత నైపుణ్యం గొప్పగా ఉందని కొనియాడారు. అనంతరం చేనేత కార్మికులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ సందర్భంగా శ్రీరంజన్ వీవ్స్ యజమాని ఎన్నం శివకుమార్ దంపతులు రాష్ట్రపతికి సంబల్పురి డిజైన్ కలిగిన పోచంపల్లి ఇక్కత్ చీర, పోచంపల్లి డబుల్ ఇక్కత్ చీరను అందజేశారు. రాష్ట్రపతి వెంట రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్క, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ సెక్రటరీ రచన సాహు, రాష్ట్ర చేనేత జౌళి శాఖ డైరెక్టర్ అలుగు వర్షిణి, భువనగిరి కలెక్టర్ హనుమంత్ కె.జెండగే ఉన్నారు. పోచంపల్లిలో రెండు గంటలు గడిపిన రాష్ట్రపతి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భూదాన్‌పోచంపల్లిలో రెండుగంటల పాటు గడిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక చాపర్‌లో పోచంపల్లికి చేరుకున్నారు. శ్రీరంజన్ వీవ్స్ యూనిట్లో 20 నిమిషాల పాటు వీవింగ్, ట్విస్టింగ్ ప్రక్రియలను పరిశీలించారు. 10.55 గంటలకు బాలాజీ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన థీమ్ పెవిలియన్‌ను సందర్శించారు. అనంతరం గాంఽధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చరఖా రూమ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా భూదానోద్యమ పిత ఆచార్య వినోబాభావే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం భూదానోద్యమ చరిత్ర ఫొటో గ్యాలరీని తిలకించారు. అక్కడి నుంచి 11.30 గంటలకు సభావేదిక వద్దకు చేరుకున్నారు. చేనేత కార్మికులచే సన్మానం పొందారు. 12.15 గంటలకు రాష్ట్రపతి చేనేత కార్మికులనుద్దేశించి పది నిమిషాలు మాట్లాడారు. అనంతరం 12.30 గంటలకు హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. 12.40 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఇవి కూడా చదవండి: ఎన్నికల సంఘం కసరత్తులో.. సమరానికి ఇంకొంత సమయం! -
కళల కల‘నేత’
సాక్షి, అమరావతి: ‘‘పట్టు వస్త్రంపై ప్రధాని మోదీ ధ్యానముద్ర.. వాల్ హ్యాంగింగ్ వస్త్రంపై సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న నిలువెత్తు చిత్రం.. పట్టు చీరపై శ్రీరామకోటి, రామాయణ పాత్రలు.. ఇదంతా ఓ చేనేత కార్మికుడి కళల కలబోత’’. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన జూటూరి నాగరాజు.. చేనేతలో నైపుణ్యానికి సాంకేతికతను జోడించి అద్భుతాలు సాధిస్తున్నాడు. చేనేతలో ఆకట్టుకునేలా నాగరాజు ఆవిష్కరించిన వాటిల్లో కొన్ని.. ► ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ అందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రాన్ని పట్టు వస్త్రంపై ఎంతో ఆకర్షణీయంగా రూపొందించి.. ఆ వస్త్రాన్ని ‘నేతన్న నేస్తం’ పథకం ప్రారంభ సభలో సీఎం వైఎస్ జగన్‌కు, చేనేత, జౌళి శాఖ కమిషనర్‌కు అందజేశాడు. ► బాపట్ల వైఎస్సార్సీపీ నేతల కోరిక మేరకు నవరత్న పథకాల పేర్లు, చిత్రాలతో కూడిన రెండు మీటర్ల పొడవైన పట్టు శాలువాను నాలుగు రోజుల స్వల్ప వ్యవధిలోనే నేసి ఇచ్చాడు. పాదయాత్రలో వైఎస్ జగన్ నడిచి వస్తున్న చిత్రాన్ని సైతం అద్భుతంగా నేశాడు. ► జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించిన పోటీల్లో అవార్డును సాధించాడు. ► ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ (తెలంగాణ) ఫొటోతో పాటు ఆయన కుటుంబ సభ్యుల చిత్రాలను కూడా పట్టు వస్త్రంపై నేసి ఇచ్చాడు. ► లేపాక్షి మందిరములో చెక్కిన వందలాది శిల్పాలను అచ్చుగుద్దినట్టు చేనేత మగ్గం ద్వారా పట్టు చీరలో నేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. థాయ్‌లాండ్ సంస్కృతికి చెందిన చిహ్నాలు, చార్మినార్, తాజ్‌మహాల్‌ను సైతం పట్టు చీరలపై నేసి ప్రతిభకు పట్టం కట్టాడు. ► 2017 ఫిబ్రవరిలో ఇస్రో 104 రాకెట్లను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించడాన్ని ఆదర్శంగా తీసుకొని ఇస్రో శాటిలైట్ శారీని చేనేత మగ్గంపై తయారు చేశాడు. విజయవాడలో జరిగిన ఎగ్జిబిషన్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆ శాటిలైట్ శారీని చూసి నాగరాజును అభినందించారు. ► గుంటూరు జిల్లా మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి చిత్రం, గాలిగోపురం, తెలుగు అక్షరాలు వచ్చే విధంగా చేనేత మగ్గంపై తయారు చేసి ఔరా అన్పించాడు. ఆధునికత జోడించాను మా తాత, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన చేనేతకు ఆదరణ తగ్గిన తరుణంలో దానికి ఆధునికత జోడించి పోటీ ప్రపంచంలో నిలదొక్కుకున్నాను. డిగ్రీ చదివాను. 25 ఏళ్లుగా చేనేతపైనే ఆధారపడ్డాను. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని చేనేతలో కొత్త డిజైన్లు ఆవిష్కరిస్తున్నాను. నా ఉత్పత్తులు పలు దేశాలకు, దేశంలోని ప్రముఖ నగరాలకు ఎగుమతి చేస్తున్నాను. కంప్యూటర్ ద్వారా ఆధునిక డిజైన్లను ముద్రించి మగ్గంలోని జకార్డ్, తదితర ఆధునిక పరికరాల సాయంతో వస్త్రాలను నేస్తున్నాను. అనేక పోటీల్లో బహుమతులు సాధించాను. –జూటూరి నాగరాజు, ధర్మవరం చేనేత కార్మికుడు -
నేతన్నల భారీ బైక్ ర్యాలీ
ధర్మవరం: సీఎం వైఎస్ జగన్ నాలుగో విడత ‘నేతన్న నేస్తం’ నిధులను విడుదల చేయడంపై హర్షం వ్యక్తంచేస్తూ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో శుక్రవారం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వేలాది మంది చేనేత కార్మికులు తరలివచ్చారు. పట్టణంలోని కదిరిగేట్ వద్ద ఉన్న నేతన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ నేతన్న నేస్తం పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 80,546 మంది నేతన్నలకు రూ.193.31 కోట్లను ఖాతాల్లో జమ చేయడం గొప్ప విషయమన్నారు. జిల్లాలో 15,981 మంది కార్మికులకు రూ.38.35 కోట్ల లబ్ధి చేకూరిందని చెప్పారు. చేనేతకు పూర్వ వైభవం జగనన్నతో సాధ్యమవుతోందన్నారు. ఇదీ చదవండి: Andhra Pradesh: ప్లాస్టిక్ బ్యానర్లు బ్యాన్ -
చేనేతల కళత: ఇక్కత్ ఇక్కట్లు.. గొల్లభామ గొల్లు
శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, సాక్షి, ప్రత్యేక ప్రతినిధి తరతరాల వృత్తిపై మమకారం.. వదులుకోలేని, కొనసాగించలేని దైన్యం. మూరెడు బట్ట నేసినా.. జానెడు పొట్ట నిండని దౌర్భాగ్యం. అరకొర సాయం మినహా ప్రఖ్యాతిగాంచిన కళలు బతికి ‘బట్ట’ కట్టేలా కొరవడిన ప్రోత్సాహం..వెరసి చేనేత మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆరు తరాలుగా వస్తోన్న అరుదైన చేనేత రంగుల కళ, కళ్ల ముందే చెదిరిపోతోంది. తెలంగాణాలో రెండు దశాబ్దాల క్రితం లక్ష మగ్గాలపై పడుగూ, పేకలతో అద్భుతాలు సృష్టించి అబ్బుర పరిచిన నేతన్నల సంఖ్య ఇప్పుడు ఇరవై రెండువేలకు పడిపోయిందంటేనే పరిస్థితి అర్ధమవుతోంది. మార్కెట్‌తో పోటీ పడే స్థితి లేక, నేసిన బట్టకు ధర గిట్టుబాటు కాక ఇతర ఉపాధి అవకాశాలను చూసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకరు, ఇద్దరు తప్ప కొత్త తరం ఈ వృత్తి వైపే కన్నెత్తి చూడటం లేదు. దీంతో చేనేతకు సంబంధించి ఇదే చివరి తరం అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నైపుణ్యం ఉన్నా.. చేయూత సరిపోక యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, నారాయణపేట, గద్వాల, జనగామ జిల్లాల్లో చేనేత కళాకారులు తమ నైపుణ్యంతో గుప్పిట్లో పట్టే చీరలను సైతం నేసి ఔరా అనిపించారు. నూలు దారాలకు రబ్బర్ ట్యూబ్‌ను బిగించి (టై), సహజ రంగులద్ది (డై) మగ్గాలపై 3,384 పోగుల పడుగు (పొడవు), 17,000 పోగుల పేక (వెడల్పు)తో నేసిన ‘పోచంపల్లి ఇక్కత్’ పట్టుచీర ఇప్పటికీ ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. తలపై పాలకుండతో వయ్యారి నడకలకు తమ పోగులతో ప్రాణం పోసి గొల్లభామ బ్రాండ్‌తో మార్కెట్లో మగువలను ఆకట్టుకుంది సిద్దిపేట నేతన్న కళ. దశాబ్దాల క్రితమే అంతరించిన పీతాంబరి పట్టుకు సైతం సిద్దిపేట కళాకారులు మళ్లీ ప్రాణం పోశారు. జకాడ మగ్గంపై వెండి జరీ ఉపయోగించి నేయటం పీతాంబరం ప్రత్యేకత. చీర అంచులు, డిజైన్లకు ప్రత్యేక పోగులను వాడుతారు. ఈ చీర ధర రూ.30 నుండి రూ.40 వేల వరకు ఉంటుంది. చేనేత కళాకారులు తమ మేథోసంపత్తితో రూపొందిస్తున్న ఇలాంటి చీరల డిజైన్లకు.. చేనేత రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయలేని వైఫల్యంతో, కొందరు వారం వ్యవధిలో నకళ్లు తయారు చేస్తున్నారు. పవర్‌లూమ్స్‌పై ప్రింట్ చేసి చేనేత బ్రాండ్‌గా తక్కువ ధరలతో మార్కెట్లోకి వదులుతున్నారు. ఈ ప్రింటెడ్ చీరలతో పోటీ పడలేక నేత చీర చతికిల పడుతోంది. దీనికి తోడు పోటీ ప్రపంచంలో మారుతున్న అభిరుచులకు అనుగుణంగా డిజైన్లు రూపొందించే శక్తి, సామర్థ్యాలు సహకార సంఘాలు, మాస్టర్ వీవర్లకు ఉండటం లేదు. మరోవైపు తమదైన శైలిలో రూపొందించిన వస్త్రాలను మార్కెట్ చేసుకోవటంలో వారు విఫలమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొద్దిమేర వస్త్ర ఉత్పత్తులు కొనుగోలు చేయడంతో పాటు కార్మికులకు పొదుపు, భద్రతా పథకం అమలు చేస్తూ రసాయనాలపై సబ్సిడీలు ఇస్తున్నా అవి ఏ మూలకు సరిపోవడం లేదు. పోటీని తట్టుకునేలా పాతవారితో పాటు కొత్త తరం వారికి తగిన శిక్షణ ఇవ్వడంతో పాటు, అంతరించే పోయే పరిస్థితుల్లో ఉన్న కళలను కాపాడేలా అనేక రూపాల్లో మరిన్ని ప్రోత్సాహకాలు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కింకర్తవ్యం ఏమిటి? ►ఐదేళ్లుగా ఎన్నికలు లేని, ఐదు మాసాలుగా కొనుగోళ్లు చేయని చేనేత సహకార సంఘాలన్నింటిలో కార్యాచరణ ప్రారంభించి రాజకీయాలకు సంబంధం లేకుండా మగ్గం నేసే వారికి సభ్యత్వం ఇవ్వాలి. సహకార సంఘాలకు కార్పొరేట్ హంగులద్ది ప్రతి నెలా తప్పనిసరిగా వస్త్రాలను కొనుగోలు చేయాలి ►మాస్టర్ వీవర్లకు ఆర్థిక పరిపుష్టినిచ్చేలా ప్యాకేజీలు ప్రకటించాలి. పరిశోధన, అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలి. ►నూలు, రంగులు, రసాయనాలపై ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీని పెంచాలి. మాల్స్, షాపింగ్ కాంప్లెక్సుల్లో చేనేత షోరూమ్‌లను తప్పనిసరి చేయాలి. ►ఇళ్లల్లో మగ్గం నేసే కార్మికులకు గృహ విద్యుత్ వినియోగంలో సబ్సిడీ ఇవ్వాలి. చేనేత బీమా వయో పరిమితి పెంచాలి. ►చేనేత వస్త్ర ఉత్పత్తులన్నింటిపై నకిలీకి తావులేకుండా ప్రత్యేక హోలోగ్రామ్ ముద్రించాలి. 1985 చేనేత రిజర్వేషన్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. ►ప్రస్తుతం చేష్టలుడిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎన్ఫోర్స్మెంట్ను పటిష్టం చేసి నకిలీ ఉత్పత్తులు అమ్ముతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ►అన్ని రకాల చేనేత వస్త్రాలపై జీఎస్టీని తొలగించాలి. చేనేత వస్త్రాలు ఆరోగ్యానికి మంచిదని, తెలంగాణ ఖ్యాతికి నిదర్శనమనే ప్రచారాన్ని విస్తృతంగా చేయాలి. ►ప్రభుత్వం ఇస్తున్న కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కానుకల్లో చేనేత పట్టుచీర, ధోవతిని చేర్చాలి. బతుకమ్మ చీరల్లోనూ కొంత వాటా చేనేతకు కేటాయించాలి. రిజర్వేషన్ చట్టం ఏం చెబుతోంది చేనేత రిజర్వేన్ చట్టం 1985 ప్రకారం.. 11 రకాల ఉత్పత్తులు..అంటే కాటన్.. పట్టు చీరలు, ధోతి, టవల్స్, లుంగీలు, బెడ్‌షీట్స్, జంపఖానాలు, డ్రెస్ మెటీరియల్, బ్యారక్ బ్లాంకెట్స్, ఉన్ని శాలువలు, మఫ్లర్లు, చద్దర్లు పూర్తిగా చేనేత (కొన్ని మినహాయింపులతో) ద్వారానే ఉత్పత్తి చేయాలి. పవర్‌లూమ్స్ నిబంధనలు ఉల్లంఘించి ఉత్పత్తి, విక్రయాలు చేస్తే.. క్రిమినల్ చర్యలు చేపట్టి జరిమానాతో పాటు జైలుశిక్ష సైతం విధించవచ్చు. సంఘం సామగ్రి, పని ఇవ్వడం లేదు నేను చేనేత సహకార సంఘంలో ఎప్పటి నుండో సభ్యుడిని. కానీ సంఘం.. సామగ్రి, పని ఇవ్వడం లేదు. నాకు నేత తప్ప మరో పని రాదు. అందుకే ఓ మాస్టర్ వీవర్ వద్ద కూలీ పని చేస్తున్న. పోచంపల్లి నేత ఖ్యాతి క్రమంగా మసకబారుతోంది. కొత్తతరం రావడం లేదు. కళ్ల ముందే అరుదైన కళ కనుమరుగవుతుంటే బాధగా ఉంది. –చిట్టి ఐలయ్య, నేత కార్మికుడు, పోచంపల్లి తక్షణ కార్యాచరణ అవసరం చేనేత ఒక వృత్తి కాదు నాగరికత. అందులో పోచంపల్లి చేనేత కళ దేశంలోనే మరీ ప్రత్యేకమైనది. ప్రస్తుత పరిస్థితిలో మార్పు రాకుంటే అతి త్వరలో చేనేత కళ కనుమరుగు కావడం ఖాయం. ముందు తరాలకు అందించడం, మన ప్రత్యేకతను ప్రపంచవ్యాప్తం చేయాలంటే తక్షణ కార్యాచరణ అవసరం. కొత్త టెక్నాలజీ, డిజైన్లు, మార్కెటింగ్ అంశాలపై శిక్షణ ఇవ్వాలి. మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాలి. – చింతకింది మల్లేశం, ఆసు యంత్రం రూపకర్త ఇదే చివరి తరం అనుకుంటున్న చేనేత మాతోనే అంతం అయ్యేలా ఉంది. కొత్త తరం రాకపోతే గొప్ప కళను సమాజం కోల్పోతుంది. పొద్దంతా చీర నేస్తే రోజుకు రూ.200 నుంచి రూ.220 కూలీయే లభిస్తోంది. ఏదైనా షాప్‌లో పనికి వెళ్తే కనీసం రోజుకు రూ 300 ఇస్తున్నారు. నేను 53 ఏళ్లుగా మగ్గం నేస్తున్నా. వేరే పనికి వెళ్లలేక ఈ వృత్తిలో కొనసాగుతున్న. నాకు ఇప్పుడు 65 ఏళ్లు.. ప్రభుత్వం అమలు చేస్తున్న చేనేత బీమా వర్తించడం లేదు. చేనేత బీమాకు వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ అమలు చేయాలి. – గంజి లింగం, లింగారెడ్డిపల్లి, సిద్దిపేట పీతాంబరానికి ‘ప్రాణం’ పోశారు తుమ్మ గాలయ్య సిద్దిపేటకు చెందిన చేనేత కార్మికుడు. అధికారులు చెప్పారని కనుమరుగైన పీతాంబరం పట్టు చీరకు పునర్వైభవం తెచ్చే దిశగా కృషి చేశాడు. ఇతర నేత కార్మికులతో కలిసి అనేక వ్యయ ప్రయాసలతో 270 వరకు పీతాంబరం పట్టు చీరలు నేశాడు. ప్రభుత్వం, టీఎస్సీఓ 60 చీరలను కొనుగోలు చేయగా మరో 60 వరకు చీరలు ప్రైవేటులో విక్రయించాడు. అయితే తగిన ప్రచారం లేకపోవడంతో పూర్తిస్థాయిలో చీరలు అమ్మలేకపోయాడు. ఇంకా 150 చీరల వరకు స్టాక్ ఉంది. భారీ పెట్టుబడితో నేసిన వస్త్రాల నిల్వ చూస్తుంటే నిద్ర పట్టడం లేదని, ప్రభుత్వం స్పందించి త్వరగా కొనుగోలు చేయకపోతే, భవిష్యత్తులో పీతాంబరం వెరైటీని తీసుకురాలేమని అంటున్నాడు. – తుమ్మ గాలయ్య, చేనేత కార్మికుడు, సిద్దిపేట పోచంపల్లికి.. కొత్త హంగులద్దాలని ఉంది ప్రపంచ ఖ్యాతి ఉన్న పోచంపల్లి చేనేతకు కొత్తహంగులు అద్దాలని ఉంది. అనేక ఉన్నత ఉద్యోగాలను వదులుకుని చేనేత పనినే ఎంచుకున్నా. సొంత ఖర్చులతో అనేక ప్రయోగాలు, కొత్త డిజైన్లు రూపొందించి మార్కెట్ చేస్తున్నా. అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రభుత్వానికి చేనేతను బతికించే ప్రతిపాదన ఇచ్చా.. ఏమవుతుందో చూడాలి. –సాయిని భరత్, పీహెచ్డీ స్కాలర్, పోచంపల్లి నావంతుగా.. నా నియోజకవర్గంలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కానుకలతో పాటు నా వంతుగా వధూవరులకు పోచంపల్లి చేనేత పట్టుచీర, జాకెట్, పంచె, టవల్ సొంత ఖర్చులతో ఇస్తున్నా. నేతన్నను ప్రోత్సహించే దిశగా నా వంతు ప్రయత్నం ఇది. – పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి -
నేతన్నలకు చంద్రబాబు 50 పైసలైనా ఇచ్చారా?: జోగి రమేష్
సాక్షి, అమరావతి: ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. నేతన్నలకు చంద్రబాబు 50 పైసలైనా ఇచ్చారా అని సూటిగా ప్రశ్నించారు. బీసీల తలరాత మార్చిన నాయకుడు సీఎం జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. మంత్రుల్లో బీసీలకు పెద్దపీట వేశారని, 4 రాజ్యసభ సీట్లలో 2 బీసీలకు ఇచ్చారని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఏమీ తెలియని వాళ్లని వేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. రైతులు, వైద్య రంగం నుంచి వ్యక్తులను పీసీబీలో వేస్తే తప్పా అని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చేసే మంచి పనులకు రాక్షసుల్లా ఎందుకు అడ్డు పడుతున్నారని ప్రజలు అడుగుతున్నారని అన్నారు. కేంద్రం చేసిన అప్పుల గురించి మాత్రం మాట్లాడరని, గతంలో పసుపు కుంకుమ కోసం చంద్రబాబు ఇతర శాఖల, కార్పొరేషన్ల నిధులు వాడారని మండిపడ్డారు. -
'నేతన్న నేస్తం'తో ఆగిన ఆత్మహత్యలు: సజ్జల
-
తెలంగాణాలో చేనేత కార్మికులకు న్యాయం జరగలేదు : కోదండరాం
-
ఉరవకొండలో టీడీపీ ప్రలోభాల పర్వం
-
మహా నేత... జన నేత
సాక్షి, శ్రీకాకుళం : పడుగు.. పేకలా అల్లుకున్న బంధం వారిది. నిజానికి వాళ్లు కార్మికులు కాదు.. కళాకారులు. చితికిపోయిన చేనేత రంగం వారి బతుకుల్ని ఛిద్రం చేసింది. చేనేత కార్మికులంటూ ప్రభుత్వాలు వారిని చులకన చేశాయి. ‘ఆదుకోండి బాబూ’ అంటున్నా ఆకలి కేకలు సర్కారు చెవిన పడటం లేదు. వారి బతుకులు బాగుపడటం లేదు. ‘ఆ దేవుడు (వైఎస్ రాజశేఖరరెడ్డి) మా కట్టాలు తెల్సుకున్నాడు. సేనేత పని తప్ప మాకేమీ సేతగాదు. ఈ పని కూడెట్టడం నేదు. రోజంతా కట్టపడ్డా యాభై, అరవై కూడా రావటం నేదు. మా బాధలన్నీ ఇన్న వైఎస్ బాబు పింఛనీ వయసు 65 నుంచి 50 ఏల్లకి తగ్గించాడు. మాలాటోళ్లందరికీ పింఛనీలిచ్చి పున్నుం గట్టుకున్నాడు. సెంద్రబాబొచ్చి ఇంట్లో ఇద్దరికి పెన్షన్లుంటే ఈల్లేదని ఒకరికి తీసేశాడు. వైఎస్‌లాగా అతని కొడుకు జగన్‌బాబే కనపడతన్నాడు. ఆయన అధికారంలోకొత్తే ఇంట్లో ఎంతమంది ముసలోళ్లున్నా పింఛనీలిత్తానని సెప్పాడు. తండ్రిలాగే మాట తప్పడు. ఆ బాబు ముఖ్యమంత్రి ఎప్పుడవుతాడా.. మా కట్టాలెప్పుడు గట్టెక్కుతాయా అని ఎదురు సూత్తనామయ్యా..!’ అని సిక్కోలు చేనేత కార్మికులు ముక్తకంఠంతో చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు, బొంతలకోడూరు గ్రామాలను ‘సాక్షి’ సందర్శించింది. బొంతలకోడూరులో వృత్తినే దైవంగా నమ్ముకుని.. కూలిపోయే ఇంట్లో ఒంటరిగా బతుకీడుస్తున్న 85 ఏళ్ల బొల్ల జగన్నాథమ్మ రోజంతా కష్టపడితే వచ్చేది 20 రూపాయలే. ఈ వయసులో ఇంత కష్టమేంటమ్మా.. అని అడిగితే ‘గాంధీ మహాత్ముడు సృష్టించిన ఈ రాట్నమే నాకు ఇంకా బతుకునిస్తోంది బాబూ’ అని సమాధానం ఇచ్చింది. ఇంతలో అక్కడకు ఓ పదిమంది వయసు మళ్లిన చేనేత కళాకారులు చేరుకున్నారు. వారిని కదిలిస్తే.. ‘ఈ ఐదేళ్లలో మమ్మల్ని సెంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు పెన్షను వయసు 65 నుంచి 50కి తగ్గించి పుణ్యం గట్టుకున్నారు. మా శరీరం సహకరించకపోయినా ఆ దేవుడు దయవల్లే 50 ఏళ్లకే పెన్షన్లు అందుకుంటున్నాం’ అని పోలిశెట్టి రాంబాబు (80) చెప్పాడు. ‘జగన్ వత్తే భార్యాభర్తలిద్దరికీ పెన్షనిత్తాడంట. తెలుగుదేశం ప్రభుత్వంలో మొగుడికో, పెళ్లానికో ఒక్కరికే ఇత్తన్నారు. నా పెన్షన్ పీకేశారు’ అని సాంబశివరావు అనే కార్మికుడు చెప్పారు. తండ్రిలాగే జగన్ ఇచ్చిన మాట తప్పడని అంటున్నారు. జగన్ బాబు త్వరగా సీఎం అయితే చేనేతల బతుకులు మారతాయన్న నమ్మకం ఉంది. పెన్షన్లు అందరికీ వస్తాయి’ అని మరికొందరు చేనేత కార్మికులు తమ నమ్మకాన్ని వెల్లడించారు. - బొల్లం కోటేశ్వరరావు, సాక్షి, శ్రీకాకుళం -
చేనేతకు ఆ'ధార'మేదీ..?
నిర్వీర్యమైన చేనేత రంగానికి పూర్వ వైభవం తెస్తామని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం చేనేత రంగం పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. నాలుగేళ్ల క్రితం ఇచ్చిన చేనేత రుణమాఫీ సక్రమంగా నేటికీ చాలామందికి అమలు చేయకపోగా చివరకు ఆప్కోకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా దగాకోరు విధానాన్ని అవలంబిస్తోంది. టీడీపీ ప్రభుత్వ తీరుతో చేనేతల పరిస్థితి దయనీయంగా మారింది. సాక్షి, చీరాల(ప్రకాశం): చేనేతల స్థితిగతులు నానాటికీ దిగజారుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో చేనేతల సంక్షేమం గాలిలో దీపంలా మారింది. జిల్లాలో 33,184 వేల మగ్గాల వరకు ఉండగా 24 వేల చేనేత కుటుంబాల వారు ఉన్నారు. చేనేత రంగంపై లక్షా అరవై వేల మంది చేనేతలు పరోక్షంగా ఆధారపడ్డారు. జిల్లాలో 70కి పైగా ఆప్కో సొసైటీలు ఉండగా ఒక్క చీరాలలోనే 50 వరకు ఈ సంఘాలు పని చేస్తున్నాయి. జిల్లాలో చేనేత వస్త్రాల ఉత్పత్తి నెలకు రూ.7 కోట్ల వరకు ఉన్నప్పటికీ అమ్మకాలు లేకపోవడంతో మాస్టర్ వీవర్ల వద్ద నిల్వలు భారీగా పేరుకుపోయాయి. ఒక్కో మాస్టర్‌వీవర్ వద్ద పది నుంచి ఇరవై లక్షలు విలువ చేసే చేనేత వస్త్రాలు నిల్వ ఉన్నాయని సమాచారం. వస్త్రాల ఉత్పత్తి పెరిగిపోతుండటం, కొనుగోళ్లు లేకపోవడం, ఆప్కో చేయూత అందించకపోవడంతో మాస్టర్‌వీవర్లు తమ వద్ద పనిచేసే చేనేత కార్మికులకు పని కూడా కల్పించక పూట గడుపుకోవడం కోసం అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తుందని కార్మికులు వాపోతున్నారు. కొరవడిన ప్రభుత్వ ప్రోత్సాహం జిల్లాలో తయారయ్యే జరీకోట, గద్వాల్, అస్సాంపట్టు, కుప్పటం వంటి చేనేత వస్త్రాలకు రాష్ట్రంలోని విజయవాడ, హైదరాబాద్, గుంటూరు తదితర ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. అందమైన చీరలను నేసేందుకు వినియోగించే పట్టు, జరీ తదితర నూలును ముంబాయి, సూరత్ నుంచి దిగుమతి చేసుకుంటారు. పెట్టుబడులు పెట్టి వస్త్రాలు తయారు చేయిస్తున్నప్పటికీ కొనుగోళ్లు లేక, ప్రభుత్వం ప్రోత్సాహకం ఇవ్వకపోవడం, ఆప్కో మాత్రం కనీస చర్యలు చేపట్టకపోవడంతో నేతన్నల పరిస్థితి కడు దయనీయంగా మారింది. చేనేతలను అన్ని విధాలా ఆదుకోవడంతో పాటు వారికి కావాల్సిన అన్ని రకాల ముడిసరుకులు, రంగు, నూలు, రసాయనాలు సబ్సిడీపై అందజేసి చేనేత వస్త్రాలను అమ్మకాలు చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని హామీలు ఇచ్చిన టీడీపీ ప్రభుత్వ హామీలు బుట్ట దాఖలయ్యాయి. ఉత్పత్తిదారుల వద్ద నిల్వలు ఉన్న చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాల్సిన ఆప్కో కనీసం ప్రత్యేక చర్యలను, కొనుగోళ్లకు సంబంధించి ఎటువంటి సూచనలు తీసుకోకపోవడం వల్ల నిల్వలు పేరుకుపోతూనే ఉన్నాయి. కనీస వేతన చట్టానికీ కరువే... కనీస వేతన చట్టం ప్రకారం ఒక కార్మికుడికి రోజుకు రూ.206 చెల్లించాల్సి ఉంటుంది. కానీ చేనేత కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారంగా కూడా కూలీలు అందడం లేదు. అయితే చేనేత మగ్గాలపై పీస్ వర్క్ చేస్తున్నారనే కారణంతో కూలీ ధరలు పరిగణించలేమని కార్మికశాఖ చేతులెత్తేసింది. దీంతో హోటల్లో పని చేసే స్వీపర్ల కంటే చేనేత కార్మికుడికి కూలీ తక్కువ. కనీస వేతన చట్టాన్ని అమలు చేసినా కార్మికులకు ప్రయోజనం ఉంటుంది. చేనేత “రిజర్వేషన్’కు చెల్లుచీటి: పరిశ్రమల ధాటికి ఈ రంగం కొట్టుకుపోయి, కార్మికులు రోడ్డున పడుతారన్న ఉద్దేశంతో 22 రకాల వస్త్రాలను చేనేత రంగానికి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసింది. పవర్లూమ్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం దానిని 1985లో 22 రకాలను కాస్త 11 రకాలకు కుదించింది. అయితే ఈ 11 రకాల వస్త్రాలు తయారు చేస్తే పూట గడుస్తుందని భావించిన కార్మికులు అందుకు అంగీకరించారు. చీరలు, లుంగీలు, పంచెలు, చేతిరూమాలు వంటివి తయారు చేస్తూ లక్షల మంది చేనేత రంగంపై ఆధారపడి ఉన్నారు. అయితే ప్రస్తుతం చేనేత రిజర్వేషన్ చట్టానికి పూర్తిగా తూట్లు పడటంతో మగ్గాలు మూలనపడుతున్నాయి. చేనేత రంగానికి కేటాయించిన 11 రకాల రిజర్వేషన్లను మరమగ్గాలపైనే తయారవుతున్నాయి. చేనేత వస్త్రాల మాటున జరుగుతున్న ఈ అక్రమ దందాను ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. ఊహల్లోనే..ఉచిత విద్యుత్ హామీ టీడీపీ ప్రభత్వుం ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీ అమలైతే ఒక్కో చేనేత కుటుంబానికి నెలకు 100 యూనిట్లలోపు బిల్లు రూ.300 మినహాయింపు కలుగుతుంది. గృహ అవసరాలు, చేనేతలకు ఒకే శ్లాబు అమలులో ఉండగా వ్యాపార సముదాయాలు, బహుళ అంతస్తుల వారికి మరొక శ్లాబు ప్రకారం రేట్లను విద్యుత్‌శాఖ నిర్ణయించింది. అయితే జిల్లాలో కేవలం 7500 కుటుంబాలకు మాత్రమే ఉచిత విద్యుత్ అర్హులుగా చేసేలా చేనేతశాఖ అధికారులు సర్వే పూర్తిచేసి నివేదికలను ప్రభుత్వానికి అందించారు. కానీ పథకం మాత్రం అమలుకాకపోవడంపై నేతన్నలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. చెయ్యిచ్చిన బాబు..చేయూత నిచ్చిన మహానేత వైఎస్ఆర్ సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న చేనేత రంగానికి 9 ఏళ్లు పరిపాలించిన చంద్రబాబు చేయూతనివ్వకపోగా చేతివృత్తులకు కాలం చెల్లిందని, ఆ వృత్తిని వదలి మరమగ్గాలవైపు వెళ్లండని ఉచిత సలహా ఒకటి పడేశారు. రాష్ట్రంలో ఉన్న నూలు మిల్లులు అన్నీ మూసివేశారు. కార్మికులకు ఉపాధి దెబ్బతినడంతో పాటు, చేనేత కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి నూలు కొనుగోలు చేయాల్సిరావడం ప్రస్తుతం పెను భారంగా మారింది. చంద్రబాబు పాలనలో వందల సంఖ్యలో చేనేత ఆత్మహత్యలు జరిగాయంటే చేనేత కార్మికుల పరిస్థితి ఏస్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. అదే వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చేనేత రంగానికి చేయూతనిచ్చారు. రైతులకు మాదిరిగా చేనేతలకు రూ.312 కోట్లు రుణమాఫీ చేశారు. అప్పటి వరకు చిలపనూలుపై ఉన్న 9.25 ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేసి కార్మికులపై భారాన్ని తగ్గించారు. రంగు, రసాయనాలు, చిలపనూలుపై 10 శాతం సబ్సిడీ అవకాశం కల్పించారు. ఏరాష్ట్రంలో లేని విధంగా చేనేత కార్మికులకు 50 సంవత్సరాలకే పింఛన్ సౌకర్యం కల్పించారు. బలహీనంగా ఉన్న ఆప్కోకు నిధులు కేటాయించి పటిష్టపరిచారు. ఇదిలా ఉంటే మూడున్నరేళ్లపాటు ముఖ్యమంత్రిగా పాలించిన కిరణ్ చేనేతలకు ప్రత్యేక పరపతి బ్యాంకు ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చకుండానే పదవి నుంచి దిగివెళ్లారు. రుణాలకు మొండికేస్తున్న బ్యాంకర్లు చేనేతలకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. చీరాల ప్రాంతంలో కార్మికులకు ప్రభుత్వం ఎనిమిది వందల మందికి పైగా అర్టిజన్ క్రెడిట్ కార్డులను మంజూరు చేసింది. కానీ వాటి ద్వారా బ్యాంకర్లు రుణాలు ఇవ్వడంలేదు. వ్యక్తిగత రుణాలు తిరిగి చెల్లించరనే ఉద్దేశంతో బ్యాంకర్లు కార్మికులకు రుణాలు ఇవ్వడంలేదు. ఈ కార్డుల ద్వారా రుణాలు తీసుకున్నట్లయితే ప్రభుత్వం నాలుగు శాతం రాయితీ ఇస్తుంది. బ్యాంకర్ల మొండి వైఖరి కారణంగా చేనేత రుణాలు అందని ద్రాక్షపండులా మారాయి. చేనేతలను ఆదుకోవాలి జిల్లాలో రోజురోజుకూ పేరుకుపోతున్న చేనేత వస్త్రాలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కోట్ల రూపాయల చేనేత వస్త్రాల నిల్వలను దశల వారీగానైనా ఆప్కో కొనుగోలు చేసేలా ప్రభుత్వం కృషి చేయాలి. కొనుగోళ్లు నిలిచిపోవడంతో కార్మికులకు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. చేనేతలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తేనే నేతన్నల అభివృద్ధి. - పడవల లక్ష్మణస్వామి, చేనేత కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
బతుకు చిక్కు!
చేనేత రంగానికి చేయూతనివ్వాల్సిన ప్రభుత్వం సంక్షేమ పథకాల్లోనూ కోత విధిస్తోంది. ఒక్కొక్కటిగా ఎత్తివేస్తూ నేతన్నలను వీధిన పడేస్తోంది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పట్టుచీరలకు పుట్టినిల్లయిన అనంత చేనేత ప్రభుత్వ తాజా చర్యలతో కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ముడిపట్టు రాయితీని అప్పుడప్పుడూ అందజేస్తున్నా.. తాజాగా సిల్క్ యార్న్ డిపోలను ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేయడం ఆందోళన కలిగిస్తోంది. అనంతపురం సప్తగిరి సర్కిల్ : సెరిఫెడ్ ఎక్సే్జీలుగా పని చేస్తున్న యార్న్ డిపోలు రెండు నెలలుగా మూతపడ్డాయి. వీటి నిర్వహణ ప్రభుత్వానికి ఆదాయ వనరు కాకపోవడం వల్లే వీటిని మూతవేసినట్లు తెలుస్తోంది. క్రమంగా ఎత్తేసే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని నేతన్నలు వాపోతున్నారు. ఎన్‌హెచ్‌డీసీ(నేషనల్ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ స్కీం) కింద నిర్వహించే ఈ సిల్క్ యార్న్ డిపోల ద్వారా చేనేత కార్మికులు కొనుగోలు చేసే ముడిపట్టుపై ఆ రోజు ఉన్న ధరపై(5కిలోల వరకు) 10 శాతం రాయితీ ఇచ్చేవారు. ఉదాహరణకు.. ముడిరేషం ధర కిలో రూ. 4వేలు ఉంటే అందులో పదిశాతం రాయితీ అంటే రూ.400 చొప్పున 5 కిలోలకు రూ.2వేల వరకు రాయితీ అందుతుంది. చేనేతకు ఆసరాగా ఉండాలనే తలంపుతో.. రాష్ట్ర వ్యాప్తంగా పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో సిల్క్ యార్న్ డిపోలను, ఎక్సే్చంజీలను ఏర్పాటు చేశారు. ధర్మవరంలో సిల్క్ ఎక్సే్చంజీని, ప్రయోగశాలను కూడా నెలకొల్పారు. ఇక జిల్లాలో చేనేతలు ఉన్న ప్రాంతాల్లో ఉరవకొండ, రాయదుర్గం, తాడిపత్రి, హిందూపురం పట్టణాల్లో ముడిరేషం కొనుగోలుకు ఇబ్బందులు లేకుండా సబ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సిల్క్ యార్న్, నాణ్యమైన ముడిరేషం అందజేసేవారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సెరిఫైడ్ చినాంబరి సిల్క్ ఎక్సే్చంజీలను ఏర్పాటు చేసి సిల్కు వస్త్రాలను కూడా కొనుగోలు చేశారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి వ్యవహరిస్తున్న సమయంలో సెరిఫెడ్ శంకు చక్రాలు కలిగిన శేష వస్త్రాలను కొనుగోలు చేసి, ఆర్డర్ ద్వారా సిల్కు వీవర్స్‌కు ఉపాధి చూపించారు. ప్రస్తుతం సెరిఫైడ్ క్రయ విక్రయాలు పూర్తిస్థాయిలో తగ్గిపోయాయి. ఇదే సమయంలో ప్రభుత్వం గత రెండు నెలలుగా సిల్కు యార్న్ డిపోలను అనధికారికంగా మూసివేసింది. ఈ కారణంగా ఉరవకొండలోని గవిమఠం, ఇతర ప్రాంతాల్లోని ప్రైవేటు వ్యక్తుల ఇళ్లలో పట్టు రాయితీ, లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆందోళనలో చేనేతలు సిల్క్‌యార్న్ డిపోలు మూతపడటంతో చేనేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉన్న ముడిరేషం ధరలకు ఈ యార్న్ డిపోలలో కొనుగోలు చేస్తే ఎంతో కొంత ఆసరాగా ఉండేది. దీనికి తోడు నాణ్యమైన పట్టు అందేది. అయితే ఈ సెరిఫెడ్ వ్యవస్థ్థ నిర్వీర్యం కావడంతో నేతన్నల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉరవకొండలో సెరిఫెడ్ కార్యాలయం మూత ఉరవకొండ పట్టణం గుంతకల్లు రోడ్డులోని సెరిఫెడ్ కార్యాలయాన్ని గత ఏప్రిల్ 3వ తేదీన ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మూసేశారు. దీనికితోడు జిల్లాలోని ధర్మవరం, తాడిపత్రి, యాడికి తదితర ప్రాంతాల్లో సెరిఫెడ్ కార్యాలయాలు మూతపడ్డాయి. చంద్రబాబు ప్రభుత్వం ప్రయివేట్ సిల్క్ ట్రేడర్స్‌కు కొమ్ముకాస్తూ సెరిఫైడ్ కార్యాలయాలను మూసివేసినట్లు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చేనేత రుణాల్ని మాఫీ చేస్తాం : కేటీఆర్
సాక్షి, వనపర్తి : చేనేత కార్మికులు తీసుకున్న రుణాలను మిగతా రుణాలతో సంబంధం లేకుండా మాఫీ చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆయన శుక్రవారం వనపర్తి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చేనేత కార్మికులకు కొత్తకోటలో డిజైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. చేనేత కార్మికులు తయారుచేసిన వస్త్రాలను టెస్కో ద్వారా కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇందుకోసం 70 కోట్ల రూపాయల్ని కేటాయించామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత వస్త్రాల ఆన్లైన్ మార్కెటింగ్‌కు శ్రీకారం చుడుతున్నామని కేటీఆర్ తెలిపారు. -
కార్మికులూ.. త్రిఫ్ట్ పథకంలో చేరండి
సిరిసిల్ల: ప్రతీనేత కార్మికుడు త్రిఫ్ట్ పథకంలో చేరాలని, కుటుంబాలకు పొదుపు అలవాటు చేయించాలని సామాజిక కార్యకర్త వేముల మార్కండేయులు కోరారు. పట్టణంలోని మరమగ్గాల సాంచాల మధ్య కార్మికులకు త్రిప్ట్ పథకంపై ఆదివారం అవగాహన కల్పించారు. కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2018 నుంచి త్రిప్ట్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. కార్మికులు తమ నెలవారి సంపాదనలో 8శాతం బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని, మరో 8 శాతం ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇలా.. నెలకు రూ.800 జమ చేస్తే.. మరో రూ.800 ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. మూడేళ్ల తర్వాత రూ.75 వేల వరకు కార్మికుడికి అందుతుందని వివరించారు. -
నేతన్నలకు గవర్నర్ నరసింహన్ భరోసా
సాక్షి, యాదాద్రి : చేనేత కార్మికులకు అన్ని ప్రభుత్వ పథకాల్లో సబ్సిడీ అమలయ్యేలా చూస్తానని నేతన్నలకు గవర్నర్ నరసింహన్ హామీ ఇచ్చారు. యాదాద్రి జిల్లా పోచంపల్లిలోని చేనేత మ్యూజియంలో గవర్నర్ బుధవారం చేనేత సంఘాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేనేత ఉత్నత్తులకు మార్కెటింగ్ ఇంకా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నేతన్నలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించేలా చర్యలు చేపడతానన్నారు. చెనేత కార్మికులకు జియో టాగ్ నంబర్ కల్పిస్తామన్నారు. నిఫ్ట్ విద్యార్థులకు వివిధ చేనేత డిజైన్లపై పోచంపల్లిలో శిక్షణ ఇప్పించాల్సిందిగా అధికారులకు సూచించారు. గురుకుల పాఠశాలను సందర్శించిన గవర్నర్ చౌటుప్పల్ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను,దండు మల్కాపురం గ్రామంలో మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మేల్యే ప్రభాకర్ రెడ్డితో కలిసి గవర్నర్ సందర్శించారు. -
చేనేతకు చేయూత ఏదీ?
-
గుంటూరులో చేనేత కార్మికుల మౌనదీక్ష
-
చేనేతల క్లస్టర్‌కు గ్రహణం వీడదా!
సిద్దవటం: రు.సమీకత సామూహిక అభివద్ధి పథకం (చేనేత క్లస్టర్) 5 సవంత్సరాల క్రితం మూత పడింది. నిర్వహణ లోపం, అధికారుల నిర్లక్ష్యధోరణి ఇతర కారణాలు పథకం అమలుకు శాపంగా మారాయి. దీంతో క్లస్టర్ పునరుద్ధరణకు నోచుకోలేదు. ఈ పథకం అమలు చేస్తే తమ కష్టాలు తీరతాయని చేనేత కార్మికులు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. నూతన కార్య వర్గం అయినా చొరవ తీసుకొని క్లస్టర్ భవనంను తెరిపిస్తే తమ జీవితాల్లో వెలుగు నిండుతాయని చేనేత కార్మికులు ఆశ పడుతున్నారు. అయితే నూతన కార్యవర్గం ఏర్పడి ఏడాదికి పైగా కావస్తున్నా క్లస్టర్ భవనం తెరుచుకోలేదు. చేనేత క్లస్టర్‌ను 23 మార్చి 2010లో ప్రారంభించారు. చాలా కాలం కిందట ఏర్పాటైన క్లస్టర్ పాలక వర్గం కమిటీ పదవీ కాలం 4సంవత్సరాల క్రితం ముగిసింది. రూ. కోట్లు ఖర్చు ఎవరికి ప్రయోజనం: సిద్దవటం మండలం లోని మాధవరం–1 గ్రామంలోనిర్మించిన చేనేత క్లస్టర్ భవనం ఉప్పరపల్లె, మాధవరం1,2,3,వార్డులు, మాధవరం–1 పరిసర ప్రాంతాల చేనేత కార్మికులకు వరంగా నిలుస్తుందనుకున్న చేనేత క్లస్టర్ భవనం ప్రారంభమైన కొన్నాల్లకే మూత పడింది. ఇక్కడి క్లస్టర్ ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం నిధులు రూ.2కోట్లు మంజూరు చేయించారు. రూ. 1.70 కోట్లు ఖర్చు చేసి రెండు భారీ భవనాలను నిర్మించారు. ఒకటి మౌళిక వసతి కల్పనకు, మరొకటి అధునాతన యంత్రాలు, పరికరాల కోసం డైయింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. వీటిలో షోరూమ్, అధికారి గది, సమావేశపు హాలు, మగ్గాలు, ఆస్మాలు, వైండింగ్, నాణ్యత సూచించే ల్యాబ్, రంగుల అద్దకం, తదితర యంత్రాలు, పరికరాల సదుపాయాలు కల్పించారు. అవి ప్రస్తుతం తుప్పుపట్టి ఉపయోగానికి పనికి రాకుండా పోయాయి. చేనేత క్లస్టర్ భవనాలకు రక్షణ లేక అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. భవనాల కిటికీల అద్దాలను కొందరు ఆకతాయిలు పగులగొట్టారు. అధునాతన యంత్రాలు, పరికరాలతో ఏర్పడిన ఈ క్లస్టర్లో కొత్త డిజైన్లతో వస్త్రాలు నేయవచ్చునని, నూలు, జరీ,పట్టు, తక్కువ ధరలకే లభిస్తాయని, నేసిన వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం, తమకు అవసరమయ్యే సదుపాయాలన్నీ ఇక్కడ లభిస్తాయని ఆశపడ్డారు. కార్మికులకు ఉపయోగపడకుండా మాత పడటంతో తమ కష్టాలు తీరేదెలా! అని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.