
సీఎం వైఎస్ జగన్ నాలుగో విడత ‘నేతన్న నేస్తం’ నిధులను విడుదల చేయడంపై హర్షం వ్యక్తంచేస్తూ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో శుక్రవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ధర్మవరం: సీఎం వైఎస్ జగన్ నాలుగో విడత ‘నేతన్న నేస్తం’ నిధులను విడుదల చేయడంపై హర్షం వ్యక్తంచేస్తూ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో శుక్రవారం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వేలాది మంది చేనేత కార్మికులు తరలివచ్చారు. పట్టణంలోని కదిరిగేట్ వద్ద ఉన్న నేతన్న విగ్రహానికి పూలమాలలు వేశారు.
ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ నేతన్న నేస్తం పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 80,546 మంది నేతన్నలకు రూ.193.31 కోట్లను ఖాతాల్లో జమ చేయడం గొప్ప విషయమన్నారు. జిల్లాలో 15,981 మంది కార్మికులకు రూ.38.35 కోట్ల లబ్ధి చేకూరిందని చెప్పారు. చేనేతకు పూర్వ వైభవం జగనన్నతో సాధ్యమవుతోందన్నారు.
ఇదీ చదవండి: Andhra Pradesh: ప్లాస్టిక్ బ్యానర్లు బ్యాన్