byke rally
-
నేతన్నల భారీ బైక్ ర్యాలీ
ధర్మవరం: సీఎం వైఎస్ జగన్ నాలుగో విడత ‘నేతన్న నేస్తం’ నిధులను విడుదల చేయడంపై హర్షం వ్యక్తంచేస్తూ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో శుక్రవారం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వేలాది మంది చేనేత కార్మికులు తరలివచ్చారు. పట్టణంలోని కదిరిగేట్ వద్ద ఉన్న నేతన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ నేతన్న నేస్తం పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 80,546 మంది నేతన్నలకు రూ.193.31 కోట్లను ఖాతాల్లో జమ చేయడం గొప్ప విషయమన్నారు. జిల్లాలో 15,981 మంది కార్మికులకు రూ.38.35 కోట్ల లబ్ధి చేకూరిందని చెప్పారు. చేనేతకు పూర్వ వైభవం జగనన్నతో సాధ్యమవుతోందన్నారు. ఇదీ చదవండి: Andhra Pradesh: ప్లాస్టిక్ బ్యానర్లు బ్యాన్ -
ఇది టీడీపీ పతనానికి నాంది
ఎస్కేయూ : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా వెన్నపూస గోపాల్‌రెడ్డి విజయంతో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని యువత బుధవారం సంబరాలు చేసుకుంది. ఇటుకలపల్లి నుంచి అనంతపురంలోని పార్టీ జిల్లా కార్యాలయం వరకూ వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.లింగారెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఎస్కేయూ ప్రధాన ద్వారం వద్ద బాణాసంచా కాల్చారు. ఈ గెలుపు టీడీపీ ప్రభుత్వ పతనానికి నాంది అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చకుండా నిరుద్యోగ యువతను వంచనకు గురి చేసినందుకు చంద్రబాబుకు చెంపపెట్టులాంటి తీర్పు నిచ్చారని అన్నారు. బైక్ ర్యాలీలో ఎస్కేయూ కామర్స్ విభాగం ఎమిరటర్స్ ప్రొఫెసర్ ఆచార్య రమణారెడ్డి పాల్గొని సందడి చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం కడప జిల్లా అధ్యక్షుడు రహంతుల్లా, ఎస్కేయూ అధ్యక్షుడు వై.భానుప్రకాష్ రెడ్డి, అనంతపురం రూరల్ మండల కన్వీనర్ ప్రసాద్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు కిరణ్‌రెడ్డి, కురబ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు బిల్లే మంజునాథ్, విద్యార్థి నాయకులు గెలివి నారాయణరెడ్డి, జయచంద్రా రెడ్డి, హేమంత్, అమర్నాథ్, అశోక్ నాయక్, ఛార్లెస్, రవినాయక్, రాజారెడ్డి, రాంబాబు, సునీల్ దత్తారెడ్డి, నంద మోహనరెడ్డి, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోటాపోటీగా నిరసనలు
ఆత్మకూర్ : కొందరు మహబూబ్‌నగర్‌లోనే కొనసాగుతామని రెండు రోజులుగా బంద్ నిర్వహిస్తుండగా.. మరికొందరు వనపర్తి జిల్లాలోనే ఉంటామని భారీ బైక్ ర్యాలీ తీశారు. ఇలా పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో నిరసనలు, ఆందోళనలతో ఆత్మకూర్ అట్టుడికిపోయింది. మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో ఆత్మకూర్, చిన్నచింతకుంట, అమరచింత మండలాలను పాలమూరులోనే కొనసాగించాలని రెండోరోజూ బంద్ కొనసాగింది. స్థానిక గాంధీచౌక్‌లో రాస్తారోకో నిర్వహించడంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి చిన్నచింతకుంట పోలీస్టేషన్‌కు తరలించారు. దీని నిరసిస్తూ ముగ్గురు యువకులు సెల్‌టవర్ ఎక్కి హల్చల్ చేశారు. జేఏసీ నాయకుల విడుదల అనంతరం తహసీల్దార్ ప్రేమ్‌రాజు, ఎస్ఐ సీహెచ్ రాజుసూచన మేరకు ఆ యువకులు కిందికి దిగారు. అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం‡వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించి వినతిపత్రం అందించారు. అటుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోనే ఉంటామని ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు బాలకిష్టన్న, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు నరేష్‌రెడ్డి బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎలాంటి ఉద్రిక్తలు చోటుచేసుకోకుండా గద్వాల డీఎస్పీ బాలకోటి, సీఐ ప్రభాకర్‌రెడ్డి నేతత్వంలో పోలీసు బలగాలను మోహరించారు. -
బంద్ సంపూర్ణం విజయవంతం
ధరూరు : ధరూరులో కాంగ్రెస్ నాయకులు జయసింహారెడ్డి, రాజారెడ్డి, నీలహళ్లి వెంకటేశ్వరరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డిల నేతత్వంలో బైక్ ర్యాలీ తీసి.. స్థానిక వైఎస్సార్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం జరగనున్న అఖిలపక్ష సమావేశంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఇక్కడి ప్రజల ఆకాంక్షను తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో వేమారెడ్డి, కిష్టన్న, శేఖర్‌రెడ్డి, సర్పంచ్‌లు సత్యన్న, హన్మంతరాయ, తిరుమల్‌రెడ్డి, సత్యన్న, లక్ష్మన్న, శ్రీనివాస్‌గౌడ్, సోమశేఖర్‌రెడ్డి, యువరాజ్, ధర్మారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. రేవులపల్లి పోలీస్‌స్టేషన్‌లో నాయకులు.. అఖిలపక్ష పార్టీల పిలుపు మేరకు చేపట్టిన నడిగడ్డ బంద్‌ను భగ్నం చేసేందుకు పోలీసులు గద్వాలకు చెందిన అఖిలపక్ష నాయకులు, జిల్లా సాధన సమితి ముఖ్య నేతలను తెల్లవారుజామునే అరెస్టు చేసి రేవులపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. గద్వాలలో అరెస్టు చేసిన నాయకులు కష్ణారెడ్డి, వెంకట్రాములు, నాగరాజు, రాజశేఖరరెడ్డి, అతికూర్ రెహమాన్, సుదర్శన్, తదితరులను మధ్యాహ్నం వరకు స్టేషన్లో ఉంచి.. అనంతరం విడిచిపెట్టారు. -
ద్విచక్రవాహనాల ర్యాలీ..
గద్వాల : నడిగడ్డ బంద్‌ను జయప్రదం చేయాలని అఖిలపక్ష నాయకులు పట్టణంలో ద్విచక్రవాహనాల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు వెంకట్రాములు, వాల్మీకి, హుసేన్, వినోద్‌కుమార్, బాబర్, బాలగోపాల్‌రెడ్డి, శ్రీను, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. నడిగడ్డ బంద్‌కు గద్వాల బార్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని అధ్యక్షుడు నారాయణరెడ్డి తెలిపారు. -
అచ్చంపేటను రెవెన్యూ డివిజన్ చేయడంపై హర్షం
లింగాల: కొత్తగా ఏర్పాటవుతున్న నాగర్‌కర్నూల్ జిల్లాలో నియోజకవర్గ కేంద్రంమైన అచ్చంపేటను రెవెన్యూ డివిజన్ చేయుటకు ప్రభుత్వం నిర్ణయించడంపై గురువారం ఎంపీపీ చీర్ల మంజుల హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అచ్చంపేట రెవెన్యూ డివిజన్‌గా మారితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ఎంపీపీతో పాటు వైస్ ఎంపీపీ కిషన్‌నాయక్,ఎంపీటీసీ అల్లె ప్రియాంక,టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రానోజీ, నాయకులు చీర్ల కష్ణ,అల్లె శ్రీనివాసులు ముఖ్యమంత్రికి కతజ్ఞతలు తెలిపారు. -
ప్రత్యేక హోదా కోసం నెల్లూరు జిల్లాలో బైకు ర్యాలీ
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. నాయుడు పేట లో బైకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే సంజీవయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక హోదా ఆకాంక్షను చాటారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కొవ్వూరులో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో యువత భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.