ఇది టీడీపీ పతనానికి నాంది | byke rally in sku of vennapusa won | Sakshi
Sakshi News home page

ఇది టీడీపీ పతనానికి నాంది

Published Wed, Mar 22 2017 11:23 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM

ఇది టీడీపీ పతనానికి నాంది - Sakshi

ఇది టీడీపీ పతనానికి నాంది

ఎస్కేయూ : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా వెన్నపూస గోపాల్‌రెడ్డి విజయంతో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని యువత బుధవారం సంబరాలు చేసుకుంది. ఇటుకలపల్లి నుంచి అనంతపురంలోని పార్టీ జిల్లా కార్యాలయం వరకూ వైఎస్సార్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.లింగారెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీని నిర్వహించారు. ఎస్కేయూ ప్రధాన ద్వారం వద్ద బాణాసంచా కాల్చారు. ఈ గెలుపు టీడీపీ ప్రభుత్వ పతనానికి నాంది అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చకుండా నిరుద్యోగ యువతను వంచనకు గురి చేసినందుకు చంద్రబాబుకు చెంపపెట్టులాంటి తీర్పు నిచ్చారని అన్నారు. 

బైక్‌ ర్యాలీలో ఎస్కేయూ కామర్స్‌ విభాగం ఎమిరటర్స్‌ ప్రొఫెసర్‌ ఆచార్య రమణారెడ్డి పాల్గొని సందడి చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ విద్యార్థి విభాగం కడప జిల్లా అధ్యక్షుడు రహంతుల్లా, ఎస్కేయూ అధ్యక్షుడు వై.భానుప్రకాష్‌ రెడ్డి, అనంతపురం రూరల్‌ మండల కన్వీనర్‌ ప్రసాద్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు కిరణ్‌రెడ్డి, కురబ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు బిల్లే మంజునాథ్, విద్యార్థి నాయకులు గెలివి నారాయణరెడ్డి, జయచంద్రా రెడ్డి, హేమంత్, అమర్‌నాథ్, అశోక్‌ నాయక్, ఛార్లెస్, రవినాయక్, రాజారెడ్డి, రాంబాబు, సునీల్‌ దత్తారెడ్డి, నంద మోహనరెడ్డి, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement