బంద్‌ సంపూర్ణం విజయవంతం | Bandh Success | Sakshi
Sakshi News home page

బంద్‌ సంపూర్ణం విజయవంతం

Published Fri, Aug 19 2016 7:16 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

ధరూరులో రాస్తారోకో చేస్తున్న నాయకులు

ధరూరులో రాస్తారోకో చేస్తున్న నాయకులు

ధరూరు :  ధరూరులో కాంగ్రెస్‌ నాయకులు జయసింహారెడ్డి, రాజారెడ్డి, నీలహళ్లి వెంకటేశ్వరరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డిల నేతత్వంలో బైక్‌ ర్యాలీ తీసి.. స్థానిక వైఎస్సార్‌ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం జరగనున్న అఖిలపక్ష సమావేశంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఇక్కడి ప్రజల ఆకాంక్షను తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో వేమారెడ్డి, కిష్టన్న, శేఖర్‌రెడ్డి, సర్పంచ్‌లు సత్యన్న, హన్మంతరాయ, తిరుమల్‌రెడ్డి, సత్యన్న, లక్ష్మన్న, శ్రీనివాస్‌గౌడ్, సోమశేఖర్‌రెడ్డి, యువరాజ్, ధర్మారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
 
 
రేవులపల్లి పోలీస్‌స్టేషన్‌లో నాయకులు..
అఖిలపక్ష పార్టీల పిలుపు మేరకు చేపట్టిన నడిగడ్డ బంద్‌ను భగ్నం చేసేందుకు పోలీసులు గద్వాలకు చెందిన అఖిలపక్ష నాయకులు, జిల్లా సాధన సమితి ముఖ్య నేతలను తెల్లవారుజామునే అరెస్టు చేసి రేవులపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. గద్వాలలో అరెస్టు చేసిన నాయకులు కష్ణారెడ్డి, వెంకట్రాములు, నాగరాజు, రాజశేఖరరెడ్డి, అతికూర్‌ రెహమాన్, సుదర్శన్, తదితరులను మధ్యాహ్నం వరకు స్టేషన్‌లో ఉంచి.. అనంతరం విడిచిపెట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement