రైతులు హర్షిస్తారు..ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాష
గేమేనాయక్‌తండా (తనకల్లు) : షరతుల్లేని రునణమాఫీ చేస్తేనే రైతులు హర్షిస్తారని కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాష అన్నారు. ఆదివారం గేమే నాయక్‌తండాలో నిర్వహించిన రైతు సాధికార సదస్సులో ఆయన మాట్లాడారు. రైతు, చేనేత, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు అమలుచేయడంలో విఫలమయ్యారన్నారు. పూర్తిగా రుణమాఫీ చేస్తే హర్షిస్తామని, అర్హులైన రైతులకు అన్యాయం జరిగితే వారి పక్షాన పోరాడతామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ జాబితాల్లో మండలంలో ఇంకా 3వేల మంది రైతుల పేర్లు లేవని, కొందరికి తక్కువ మొత్తంలో రుణమాఫీ అయినట్లు తన దృష్టికి వచ్చింద న్నారు. దీనిపై సమాధానం చెప్పాలని అక్కడే ఉన్న తహశీల్దార్ శివయ్యను ప్రశ్నించారు. బ్యాంకు అధికారులు చేసిన కొన్ని పొరపాట్ల వల్ల కొందరు రైతుల పేర్లు రుణమాఫీ జాబితాల్లో లేవని, ఆధార్ నంబర్లు ఇవ్వని రైతుల పేర్లు జాబితాలో లేవని సమాధానమిచ్చారు. అర్హులైన రైతులు దరఖాస్తు చేసకుంటే రుణమాఫీ వర్తింపచేస్తామని తహశీల్దార్ వివరించారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ అర్హుల పింఛన్లు, బి య్యం కార్డులు తొలగించడం అన్యామన్నారు.
షరతుల్లేని రుణమాఫీ చేపట్టాలని, అర్హులైన వారందరికీ పింఛన్లు, బి య్యం కార్డులు పునరుద్ధరించాలని డి మాండ్ చేశారు. కార్యక్రమంలో స ర్పంచ్ సరస్వతమ్మ, మైనార్టీ నాయకుడు అబ్దూల్ కలాం, కదిరి మున్సిపల్ కౌన్సిలర్లు అజ్జకుంట రాజశేఖర్‌రెడ్డి, కల్యాణ్‌కుమార్, జగన్, కేఎం.బాష, యాదవ్, సర్పంచ్ బాబురెడ్డి,ఎంపీటీసీ వెంకటరమణ, మాజీ ఎంపీటీసీ జయరాంనాయక్, నాయకులు నీలకంఠారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
షరతుల్లేని రుణమాఫీ చేయండి..
Published Mon, Dec 15 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 6:10 PM
Advertisement
Advertisement