ప్రణాళిక అమలులో బ్యాంకర్ల నిర్లిప్తత
- భారీ అంచనాలతో ప్రారంభం.. తుదకు కొర్రీలు
- యేటా లక్ష్యాన్ని
- సాధించలేకపోతున్న వైనం
- గత యేడాది ప్రగతి 83.86 శాతమే
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వార్షిక సంవత్సరం ప్రారంభంలో అట్టహాసంగా రూపొందించే రుణప్రణాళికలు.. గడువు ముగిసే నాటికి అబాసుపాలవుతున్నాయి. భారీతనం కోసం వేల కోట్లతో ప్రణాళికలు తయారుచేస్తున్న బ్యాంకర్లు.. ఏడాది ముగిసే నాటికి కొర్రీలు, నిబంధనలు సాకుగా చూపుతూ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడంలో విఫలమవుతున్నారు.
గతేడాది వార్షిక ప్రణాళిక లక్ష్యసాధనలో జిల్లా బ్యాంకుల పురోగతి అంతంత మాత్రం గానే ఉంది. రూ.4,558.95 కోట్ల రుణాల పంపిణీకి గాను రూ.3,823.14 కోట్లు రుణాలిచ్చినట్లు లెక్కల్లో చూపారు. మొత్తంగా 83.86శాతం పురోగతి సాధిం చినట్లు వెల్లడించారు. ఇవికాకుండా ఇతర కేటగిరీల్లో ఇచ్చిన రూ.657.51 కోట్లు కూడా లక్ష్యసాధనలో చూపి చేతులు దులుపుకున్నారు. లక్ష్యసాధన ఘనంగా ఉన్నట్లు పేర్కొంటూ.. ఈ ఏడాది ప్రణాళికలో మరో రూ.350.64 కోట్లు అదనంగా చేర్చి ఘనతను చాటారు.
తిరగరాసిన లెక్కలు
గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో రూ.714.66 కోట్ల పంటరుణాలిచ్చేలా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే కరువు నేపథ్యంలో ఆయా సీజ న్లలో రైతులను ఇబ్బంది పెట్టొందంటూ పంటరుణాలను రీషెడ్యూల్ చేయాల్సిం దిగా ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో జిల్లాలో దాదాపు రూ.550 కోట్ల మేర రుణాలను రీషెడ్యూల్ చేశారు. కానీ బ్యాంకులు మాత్రం ఈ మొత్తాన్ని లక్ష్యసాధనలో చూపాయి. అదేవిధంగా భూఅభివృద్ధి కోసం రూ.26.15 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా..
కేవలం రూ. 17.57 కోట్లు మాత్రమే ఇచ్చారు. పాడి పరిశ్రమల, కోళ్లు, గొర్రెలు, మేకల పెంపకం కోసం రూ.318.49 కోట్ల రుణాలివ్వాల్సిం దిగా ప్రణాళికలో పేర్కొన్నారు. కానీ రూ.275.11 కోట్లు రుణాలిచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇలా అన్ని కేటగిరీల్లో లక్ష్యసాధన చివరకు మిగిలి పోయింది. ఇతర అనుభంధ రుణాలు రూ.50.38 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. రూ.708.34 కోట్లు ఇచ్చినట్లు లెక్కలు చూపారు. ఈ మొత్తాన్ని లక్ష్యసాధనకు జతచేయడంతో పురోగతిలో భారీ మా ర్పులు చోటుచేసుకోవడం గమనార్హం.
‘రుణ’ లక్ష్యంపై నిర్లక్ష్యం!
Published Fri, Apr 17 2015 12:40 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement