Credit Plan
-
తెలంగాణ రాష్ట్ర రుణ ప్రణాళిక రూ.1.86 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రుణ ప్రణాళికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) ప్రకటించింది. 2021–22 సంవత్సరానికి రాష్ట్రంలో ఇచ్చే రుణాల వివరాలను వెల్లడించింది. ఈ ఏడాది మొత్తంగా రూ.1,86,035.60 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. వీటిని 79.37 లక్షల మంది లబ్ధిదారులకు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోమవారం బీఆర్కేఆర్ భవన్లో ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు సమక్షంలో జరిగిన ఎస్ఎల్బీసీ 29వ సమావేశంలో రుణ ప్రణాళికను బ్యాంకర్లు ఆమోదించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చే రుణాల్లో రూ.91,541 కోట్లు వ్యవసాయ రుణాలే కావడం గమనార్హం. మొత్తం రుణాల్లో 49.20 శాతం వ్యవసాయ రుణాలే ఇవ్వనున్నారు. అందులో రైతులకు వానాకాలం, యాసంగి సీజన్లలో కలిపి రూ.59,440.44 కోట్ల పంట రుణాలు ఇస్తారు. అందులో నిర్వహణ, మార్కెటింగ్‌కు సంబంధించినవి కూడా ఉంటాయి. ఇవికాక వ్యవసాయంలో పెట్టుబడులు, అనుబంధ రంగాల్లో ఖర్చులు, మౌలిక సదుపాయాలు తదితరాల కోసం టర్మ్ లోన్లు ఇస్తారు. మొత్తంగా వ్యవసాయ రుణాలు 63.67 లక్షల మంది రైతులకు ఇవ్వాలని నిర్ణయించారు. అందులో పంట రుణాలే 55.74 లక్షల మందికి ఇస్తారు. చిన్న, మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ కోసం, విద్య, గృహ రుణాలను కూడా ఎస్ఎల్బీసీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సకాలంలో రైతులకు రుణాలు ఇవ్వండి: హరీశ్ రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు బ్యాంకర్లను కోరారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఒక్క వారంలోనే దాదాపు 61 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో రూ.7,360 కోట్లు పైగా జమ చేశామని చెప్పారు. బ్యాంకర్లు పంట రుణాలను జాప్యం లేకుండా రైతులకు అందేలా చూడాలని కోరారు. చిన్న వ్యాపారులకు మరిన్ని ముద్రా రుణాలు అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్, తృణధాన్యాలు తదితర పంటల సాగును ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల నిర్మాణాన్ని వేగవంతం చేసిందన్నారు. సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ మిశ్రా, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ నిఖిల, నాబార్డ్ సీజీఎం వై.కృష్ణారావు పాల్గొన్నారు. -
పంట రుణ లక్ష్యం 29,101 కోట్లు
⇒ ఖరారు చేసిన తెలంగాణ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ⇒ ఖరీఫ్‌కు రూ.17,460 కోట్లు.. రబీకి రూ.11,640 కోట్లు ⇒ అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాకు రూ. 4,686 కోట్లు ⇒ మొత్తం రాష్ట్ర రుణ ప్రణాళిక లక్ష్యం రూ.90,776 కోట్లు ⇒ విద్య, గృహ రంగాలకు గతం కంటే తక్కువ రుణాలు హైదరాబాద్: 2016-17 ఖరీఫ్, రబీ సీజన్లలో రూ.29,101 కోట్ల పంట రుణాలివ్వాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) నిర్ణయించింది. అందులో ఖరీఫ్‌కు రూ.17,460 కోట్లు, రబీకి రూ.11,640 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది పంట రుణాల లక్ష్యం రూ.27,800 కోట్లు కాగా.. ఈసారి కాస్త పెంచారు. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాకు రూ. 4,686 కోట్లు కేటాయించారు. ఇక వ్యవసాయ టర్మ్ రుణాలకు రూ.9,202 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.2,708 కోట్లు కేటాయించారు. మొత్తంగా ఈ ఏడాది వ్యవసాయ రంగానికి రూ. 41,012 కోట్ల రుణాలు ఇవ్వాలని రాష్ట్ర బ్యాంకర్లు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. 2016-17 తెలంగాణ రాష్ట్ర రుణ ప్రణాళికను గురువారం జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విడుదల చేశారు. వ్యవసాయం సహా ఇతర అన్ని రంగాలకు కలిపి రాష్ట్ర రుణ ప్రణాళిక లక్ష్యం రూ.90,776 కోట్లుగా ఎస్ఎల్బీసీ ప్రకటించింది. గతేడాది రూ.78,776 కోట్లు కాగా.. ఈసారి 15.23 శాతం పెంచారు. మరోవైపు ఈసారి చిన్న మధ్యతరహా పరిశ్రమలకు, విద్య, గృహ రంగాలకు రుణాలను తగ్గించారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు గతేడాది రూ.11,020 కోట్లు కేటాయిస్తే... ఈసారి రూ.10,807 కోట్లకే పరిమితం చేశారు. గతేడాది విద్యా రుణాల లక్ష్యం రూ. 864 కోట్లు కాగా.. ఈసారి రూ.731 కోట్లకు తగ్గించారు. గతేడాది గృహ రుణాల లక్ష్యం రూ.2,306 కోట్లు కాగా.. ఈసారి రూ.2,189 కోట్లకు తగ్గించారు. వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 2,185 కోట్లు వ్యవసాయ టర్మ్ రుణాలు, సాగు అనుబంధ రంగాలకు రూ.11,911 రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న బ్యాంకర్లు వ్యవసాయానికి కూలీల కొరత కారణంగా వ్యవసాయ యాంత్రీకరణలో పెట్టుబడులు పెట్టే వారికి 2,185 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రీన్హౌస్, కూరగాయల సాగుకు రూ.2,082 కోట్లు కేటాయించారు. కోళ్ల పరిశ్రమకు రూ.788 కోట్లు కేటాయించారు. శ్వేత విప్లవానికి రూ.2,105 కోట్లు, గొర్రెలు, మేకలు, మత్స్య రంగాలకు రూ. 811 కోట్లు కేటాయించారు. కాగా, పంట రుణాల్లో అత్యధికంగా వరి సాగు చేసే రైతులకు రూ.12,740 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చిరుధాన్యాల సాగుకు రూ.1,366 కోట్లు, పప్పుధాన్యాల సాగుకు రూ.857 కోట్లు, పత్తి రైతులకు రూ.7,087 కోట్లు కేటాయించారు. -
రూ.1,050 కోట్లతో స్త్రీ ‘నిధి’
ఆమోదం తెలిపిన స్త్రీనిధి బ్యాంకు పాలకమండలి బినామీ రుణాలను అరికట్టేందుకు బయోమెట్రిక్ విధానం జీవనోపాధి ప్రాజెక్టులకు అధికంగా రుణాలివ్వాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో తక్షణ రుణాల కింద రూ.1,050 కోట్లు అందించాలని స్త్రీనిధి బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు వార్షిక రుణ ప్రణాళిక (క్రెడిట్ ప్లాన్)కు బ్యాంకు పాలకమండలి ఆమోదం తెలిపింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) కార్యాలయంలో గురువారం జరిగిన పాలకమండలి సమావేశంలో క్రెడిట్ ప్లాన్ అమలుకు సంబంధించి బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం రుణ ప్రణాళికలో రూ.950 కోట్లు సెర్ప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు, రూ.100 కోట్లు మెప్మా ద్వారా పట్టణ ప్రాంత మహిళా సంఘాలకు రుణాలుగా అందించాలని నిర్ణయించారు. జీవనోపాధికి అధిక ప్రాధాన్యం.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల మహిళలు తక్షణ అవసరాల కోసం ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) ద్వారా రుణం పొందే వీలుంది. ఒక్కో మహిళా సంఘం రూ.25 వేల వరకు రుణం పొందవచ్చు. జీవనోపాధి కోసం రూ.25 వేలకుపైగా రుణాలను అందిస్తారు. గ్రామ సమాఖ్యల పనితీరును బట్టి రుణ పరిమితిని పెంచాలని నిర్ణయించారు. పనితీరు బాగున్న సమాఖ్యలకు రూ.10 లక్షల వరకు రుణం అందించనున్నారు. ఒక్కో సంఘం రుణం పొందేందుకు ఆరుగురు మహిళలకు మాత్రమే ఉన్న పరిమితిని తాజాగా తొమ్మిది మందికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ క్షేత్రస్థాయిలో మహిళా సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సలహాలు, సూచనలను స్వీకరించేందుకు కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. కాగా, గతేడాది రుణ ప్రణాళిక రూ.753 కోట్లలో రూ.705 కోట్లు రుణాలుగా అందించామని, 99 శాతం రికవరీ కూడా జరిగిందని స్త్రీనిధి బ్యాంకు డెరైక్టర్ విద్యాసాగర్‌రెడ్డి పాలకమండలి దృష్టికి తెచ్చారు. ఇప్పటివరకు 1.62 లక్షల సంఘాలకు చెందిన 7.71 లక్షల మంది మహిళలకు రుణాలను అందించామని వివరించారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, సెర్ప్ సీఈవో మురళి, మెప్మా డెరైక్టర్ జనార్ధ్దన్‌రెడ్డి, వివిధ ప్రభుత్వ విభాగాల, జిల్లా సమాఖ్యల డెరైక్టర్లు పాల్గొన్నారు. రుణ మంజూరులో బయోమెట్రిక్ బినామీలకు చెక్ పెట్టేందుకు ఎలక్ట్రానిక్ లోన్ డాక్యుమెంటేషన్ ద్వారా మహిళలకు రుణాల మంజూరు ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. అలాగే పైల ట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన 50 మండలాల్లో బయోమెట్రిక్ బేస్డ్ లెండింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ పల్లె ప్రగతి’ కార్యక్రమం ద్వారా వివిధ జిల్లాల్లోని 2,784 గ్రామాల్లో ‘వన్ స్టాప్ షాప్’లను స్త్రీనిధి బ్యాంకు ఏర్పాటు చేయనుంది. గ్రామాల్లో ఒకేచోట అన్ని రకాల (ఈ సేవ, మీ సేవల్లో లభించే సేవలు, ప్రభుత్వ విభాగాలకు దరఖాస్తులు, ఫిర్యాదులు, ఉపాధి వేతన చెల్లిం పులు) సేవలు అందించడమే వన్ స్టాప్ షాప్ ఉద్దేశం. -
‘రుణ’ లక్ష్యంపై నిర్లక్ష్యం!
ప్రణాళిక అమలులో బ్యాంకర్ల నిర్లిప్తత - భారీ అంచనాలతో ప్రారంభం.. తుదకు కొర్రీలు - యేటా లక్ష్యాన్ని - సాధించలేకపోతున్న వైనం - గత యేడాది ప్రగతి 83.86 శాతమే సాక్షి, రంగారెడ్డి జిల్లా: వార్షిక సంవత్సరం ప్రారంభంలో అట్టహాసంగా రూపొందించే రుణప్రణాళికలు.. గడువు ముగిసే నాటికి అబాసుపాలవుతున్నాయి. భారీతనం కోసం వేల కోట్లతో ప్రణాళికలు తయారుచేస్తున్న బ్యాంకర్లు.. ఏడాది ముగిసే నాటికి కొర్రీలు, నిబంధనలు సాకుగా చూపుతూ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడంలో విఫలమవుతున్నారు. గతేడాది వార్షిక ప్రణాళిక లక్ష్యసాధనలో జిల్లా బ్యాంకుల పురోగతి అంతంత మాత్రం గానే ఉంది. రూ.4,558.95 కోట్ల రుణాల పంపిణీకి గాను రూ.3,823.14 కోట్లు రుణాలిచ్చినట్లు లెక్కల్లో చూపారు. మొత్తంగా 83.86శాతం పురోగతి సాధిం చినట్లు వెల్లడించారు. ఇవికాకుండా ఇతర కేటగిరీల్లో ఇచ్చిన రూ.657.51 కోట్లు కూడా లక్ష్యసాధనలో చూపి చేతులు దులుపుకున్నారు. లక్ష్యసాధన ఘనంగా ఉన్నట్లు పేర్కొంటూ.. ఈ ఏడాది ప్రణాళికలో మరో రూ.350.64 కోట్లు అదనంగా చేర్చి ఘనతను చాటారు. తిరగరాసిన లెక్కలు గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో రూ.714.66 కోట్ల పంటరుణాలిచ్చేలా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే కరువు నేపథ్యంలో ఆయా సీజ న్లలో రైతులను ఇబ్బంది పెట్టొందంటూ పంటరుణాలను రీషెడ్యూల్ చేయాల్సిం దిగా ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో జిల్లాలో దాదాపు రూ.550 కోట్ల మేర రుణాలను రీషెడ్యూల్ చేశారు. కానీ బ్యాంకులు మాత్రం ఈ మొత్తాన్ని లక్ష్యసాధనలో చూపాయి. అదేవిధంగా భూఅభివృద్ధి కోసం రూ.26.15 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా.. కేవలం రూ. 17.57 కోట్లు మాత్రమే ఇచ్చారు. పాడి పరిశ్రమల, కోళ్లు, గొర్రెలు, మేకల పెంపకం కోసం రూ.318.49 కోట్ల రుణాలివ్వాల్సిం దిగా ప్రణాళికలో పేర్కొన్నారు. కానీ రూ.275.11 కోట్లు రుణాలిచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇలా అన్ని కేటగిరీల్లో లక్ష్యసాధన చివరకు మిగిలి పోయింది. ఇతర అనుభంధ రుణాలు రూ.50.38 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. రూ.708.34 కోట్లు ఇచ్చినట్లు లెక్కలు చూపారు. ఈ మొత్తాన్ని లక్ష్యసాధనకు జతచేయడంతో పురోగతిలో భారీ మా ర్పులు చోటుచేసుకోవడం గమనార్హం. -
జిల్లా వార్షిక రుణ ప్రణాళిక రూ.4,909.59 కోట్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: 2015-16 వార్షిక సంవత్సర రుణ ప్రణాళిక రూ.4,909.59 కోట్లతో రూపుదిద్దుకుంది. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ఈ ప్రణాళికను ఆవిష్కరించారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రణాళిక తయారు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని బ్యాంకర్లకు సూచించారు. రుణ మంజూరులో వేగం పెంచి లబ్ధిదారుల రుణ సౌలభ్యాన్ని సులభతరం చేయాలని కోరారు. రూ.350.64 కోట్ల పెరుగుదల రుణ మంజూరులో బ్యాంకర్లు ఈ ఏడాది భారీ ప్రణాళికనే తయారు చేశారు. గతేడాది రూ.4,558.95 కోట్ల రుణ ప్రణాళిక రూపొందించగా.. తాజాగా ఈ ప్రణాళిక రూ.4,909.59 కోట్లకు పెరిగింది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం రూ.350.64 కోట్లు అదనంగా రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు వచ్చారు. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లలో కీలకమైన పంటరుణాల కింద రూ.730 కోట్లు ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్ధేశించారు. లింకేజీ రుణాల కింద రూ.281.51 కోట్లు, వ్యవసాయ యాంత్రికీకరణకు రూ.111.20 కోట్ల రుణాలిచ్చేలా ప్రణాళిక తయారు చేశారు. పాడిపరిశ్రమకు రూ.130.75 కోట్లు, పౌల్ట్రీ రంగానికి రూ.116.45 కోట్లు, గోదాములు, మార్కెట్ యార్డుల కోసం రూ.50.06 కోట్లు ఇవ్వనున్నారు. వీటితోపాటు పారిశ్రామిక రంగ అభివృద్ధికి గాను రూ.791.25 కోట్లు నిర్దేశించారు. ఈ రుణాల మంజూరు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని, వార్షిక సంవత్సరం ముగిసే నాటికి లక్ష్యాలను సాధిస్తామని బ్యాంకర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. రుణ ప్రణాళిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఎస్బీహెచ్ డీజీఎం శేషసాయి, ఆంధ్రాబ్యాంకు డీజీఎం శేషగిరిరావు, ఆర్బీఐ ఎల్డీఓ వెంకటేష్, ఎస్బీహెచ్ అగ్రీ డీజీఎం అనూరాధ, ఎల్డీఎం సుబ్రమణ్యం, డీఆర్డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ కార్పొరేషన్ రుణ ప్రణాళిక ఖరారు
విజయనగరం కంటోన్మెంట్ : ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరుకు రంగం సిద్ధమైంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణ ప్రణాళికను సంబంధింత అధికారులు ఖరారు చేశారు. జిల్లా వ్యాప్తంగా 11.91 కోట్ల రూపాయల రుణాలిచ్చేందుకు కమిటీ ఆమోదించింది. మొత్తం 1221 మంది లబ్ధిదారులకు 1060 యూనిట్లు మంజూరు చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కలెక్టర్ చైర్మన్‌గా, డీఆర్డీఏ పీడీ కన్వీనర్‌గా వ్యవహరించిన డీసీసీ కమిటీ ఈ రుణ ప్రణాళికకు ఇటీవలే ఆమోదం తెలిపింది. మొత్తం 1060 యూనిట్లలో 863 యూనిట్లు బ్యాంకు లింకేజీ యూనిట్లు కాగా మిగతా 197 యూనిట్లు నాన్ బ్యాంకు లింకేజీ యూనిట్లుగా నిర్ణయించారు. దీని ప్రకారం జిల్లాల్లో వివిధ బ్యాంకులకు లక్ష్యాలు విధించారు. అదేవిధంగా మహిళలు, నిరుద్యోగులకు వ్యక్తిగత, గ్రూపు రుణాలు మంజూరు చేసేందుకు కమిటీ అమోదించింది. మంజూరు చేసిన రుణ ప్రణాళికలను మండలాభివృద్ధి కార్యాలయాలకు పంపించి ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఇక ఆయా మండలాల్లో ఉన్న ఎంపిక కమిటీలు దరఖాస్తులను పరిశీలించి ఆన్లైన్ చేయాల్సి ఉంది. రుణాల మంజూరు, సబ్సిడీ ప్రక్రియను ఎస్సీ కార్పొరేషన్ ఈడీ హనుమంతు వెంకట ప్రసాదరావు సాక్షి కి వివరించారు. యూనిట్లు ఇవే ... రూ. 75వేలు : ఎంబ్రాయిడరీ, టైలరింగ్, తోలు సేకరణ యూనిట్లు రూ. లక్ష : ఫ్లోర్‌మిల్, కూరగాయల దుకాణాలు, టీ స్టాళ్లు రూ. 2 లక్షలు : కాంక్రీట్ మిక్స్చర్, చిన్న కిరాణా దుకాణాలు రూ. 3 లక్షలు : డీటీపీ, జిరాక్స్ యూనిట్, ఫొటో స్టూడియో గ్రూపు రుణాలు : రూ. 4 లక్షలు: టెంట్ హౌస్ రూ. 5 లక్షలు : చెప్పుల తయారీ వంటి చిన్న తరహా పరిశ్రమలు రూ. 8 లక్షలు : ట్రాక్టర్ కొనుగోలు వాహనాల యూనిట్లు: ఆటో : రూ. 1.80 లక్షలు మినీ వ్యాన్ : రూ. 2 లక్షలు టాటా ఏస్: రూ. 4 లక్షలు పశుసంవర్థక శాఖ ద్వారా 20 ఆడ, ఒక మగ గొర్రెల యూనిట్ : రూ. 2 లక్షలు 2 ముర్రా జాతి గేదెలు : రూ. లక్ష 2 జెర్సీ ఆవులు : రూ. 80 వేలు గోపాల మిత్ర కిట్ : రూ. 75 వేలు డ్వాక్రా మహిళలకు గ్రూపు రుణాల యూనిట్లు : దుస్తులు కుట్టే యూనిట్ : రూ.4 లక్షలు అడ్డాకుల తయారీ : రూ. 4 లక్షలు కారం, తెల్లఉల్లి, అల్లం, తదిరత ఫౌడర్ల తయారీకి : రూ.4 లక్షలు ఇవి కాకుండా నాన్ బ్యాంకింగ్ ద్వారా లైట్ వెహికల్ మోటార్ డ్రైవింగ్ శిక్షణ, వివిధ ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా హెచ్ఐవీ, పీహెచ్సీ, తక్కువ వయసులో విడో అయిన వారికి రూ.40వేలు మంజూరు చేయనున్నారు. సబ్సిడీ : ప్రతి యూనిట్‌కూ 60 శాతం సబ్సిడీ లేదా లక్ష రూపాయలకు మించకుండా సబ్సిడీని విడుదల చేస్తారు. అయితే గ్రూపు రుణాల్లో మాత్రం ప్రతి లబ్ధిదారునికీ 60 శాతం సబ్సిడీ ఉంటుంది. గ్రూపు రుణాలు ముగ్గురితో కూడా ప్రారంభించుకునేలా ఈ ఏడాది వెసులుబాటు కల్పించారు. దరఖాస్తు ఇలా.... మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కన్వీనర్‌గా ఒక ఎంపిక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ద్వారా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంకు విల్లింగ్తో పాటు తాను డిపాజిట్ చేసిన మొత్తంతో పాటు (వారు కోరుతున్న రుణాన్ని బట్టి ఉంటుంది) దరఖాస్తును పూర్తిగా నింపి ఆధార్ కార్డుతో సహా పొందుపరచాలి. మంజూరు చేసే పద్ధతి.... మండల కార్యాలయాల్లోని దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. సమర్పించి న దరఖాస్తును ఎంపీడీఓ, బ్యాంకర్, ఐకేపీ సభ్యుడు, ఎస్సీ సొసైటీ సభ్యుడు, మరో ముగ్గురు సోషల్‌వర్కర్లు సభ్యులుగా ఉండే కమిటీ పరిశీలించి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఈ వివరాలను కలెక్టర్ కమిటీ అప్రూవల్ చేసి ఎస్సీ కార్పొరేషన్‌కు అందజేస్తారు. అక్కడ నుంచి యూనిట్ మంజూరు ఉత్తర్వులు వస్తాయి. సబ్సీడీ సొమ్ము నేరుగా లబ్ధిదారుడి ఖాతాకు జమ అవుతుంది. మండలాలకు పంపించాం! ఎస్సీ కార్పొరేషన్ రుణ ప్రణాళిక ఖరారైంది. ఇటీవలే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బ్యాంకు ప్రతినిధులు, లీడ్‌బ్యాంకు మేనేజర్, డీఆర్డీఏ పీడీలతో సమావేశం నిర్వహించాం. జిల్లాలోని 34 మండలాలు, 4 మున్సిపాలిటీలకు లక్ష్యాలను నిర్దేశించి ఎన్ని యూనిట్లు మంజూరు చేయాలనే విషయమై రిపోర్టులు పంపించాం. ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి. పూర్తి చేసిన దరఖాస్తులను కూడా అక్కడే సమర్పించాలి. -హనుమంతు వెంకట ప్రసాదరావు, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్, విజయనగరం. -
రుణ ప్రణాళిక రూ.2,700 కోట్లు
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్ : రైతులకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు కొర్రీలు వేయకుండా పని చేయాలని కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు. డీఆర్డీఏ సమావేశ మందిరంలో శవివారం సాయంత్రం జరిగిన డీసీసీ సమీక్ష సమావేశంలో రూ. 2700 కోట్లతో 2014-15 వార్షిక రుణ ప్రణాళికను ఆయన విడుదల చేశారు. ముందుగావివిధ పథకాలపై సమీక్షించారు. ఖాతాలు తెరిచేందుకు పదేపదే తిప్పుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారని, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రైతులకు అకౌం ట్ తెరిచేలా చర్యలు తీసుకోవాలనిఆర్బీఐ ఏజీఎంను కలెక్టర్ కోరారు.ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సుమారు మూడు నెల లుగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించలేదని, ఆ లోటును త్వరగా భర్తీ చేయవలసిన అవసరం ఉందని సూచించారు. గత ఏడాది వ్యవసాయ రుణాలను అందించడంలోను, ఇతర పథకాల అమలులోను లక్ష్యం చేరుకోలేకపోయామని, ఈ ఏడాది లక్ష్యా న్ని అధిగమించేలా పని చేయాలని తెలిపారు. ఈ ఏడాది రుణ ప్రణాళిక రూ. 2,700 కోట్లలో ప్రాధాన్యతా రంగాలుగా గుర్తించిన వాటికి రూ. 2,468 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. వాటిలో పంట రుణాల కోసం రూ.1220 కోట్లు, కౌవులు రైతుల పంట రుణా ల కోసం రూ. 240 కోట్లు, టెర్మ్లోన్లకు రూ. 200 కోట్లు కలిపి వ్యవసాయ రంగానికి రూ.1,660 కోట్ల మేర రుణం ఇవ్వాలని ప్రణా ళికలో నిర్థేశించినట్టు తెలిపారు. ఇతర ప్రాధాన్యతా సెక్టారులైన గృహ నిర్మాణం, విద్య, స్వయం సహాయక లింకేజీల కోసం రూ.528 కోట్లను, చిన్న మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు రూ. 280 కోట్లను కేటాయించామన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది రుణ ప్రణా ళికలో 72.18 శాతాన్ని అదనంగా కేటాయించామని తెలిపారు. ప్రభుత్వ పథకాలు, వాటికి లభించే రాయితీలపై రైతులకు మండల స్థాయి సమావేశాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా బ్యాంకర్ల సహకారం అంతంతమాత్రంగానే ఉందని పలు శాఖల అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్ స్పందించారు. మండలాల, పథకాల వారీగా పెండింగ్ ఉన్న యూనిట్ల వివరాల తో లీడ్ బ్యాంక్ మేనేజర్‌కి బ్యాంకర్లు లేఖ పూర్వకంగా నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. బ్యాంకర్ల గైర్హాజరుపై ఆగ్రహం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమావేశానికి సగం మంది బ్యాంకు అధికారులు గైర్హాజరవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత బ్యాంకులకు లీడ్ బ్యాంక్ మేనేజర్ నోటీసులు జారీ చేయాలని సూచించారు. సమావేశానికి ప్రభుత్వ అధికారుల ంతా హాజరుకాగా, బ్యాంకు అధికారులు హాజరుకాకపోవడంపై ప్రశ్నించారు. బ్యాంకు అధికారులకు సమాచారం అందించి, అను కూలమైన సమయానికే సమావేశం నిర్వహించామని అయినప్పటికీ హాజరుకాలేదని, ఇది వారి పనితీరుకు అర్ధం పడుతుందని తెలి పారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీఓ రజిత్‌కుమార్ షైనీ, డీఆర్డీఏ పీడీ జ్యోతి, లీడ్ బ్యాంచ్ మేనేజర్ శివబాబు, నాబార్డు ఏజీఎం శ్రీనివాస్, జిల్లా అధికారులు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.