రుణ ప్రణాళిక రూ.2,700 కోట్లు | Credit Plan Rs 2,700 crore | Sakshi
Sakshi News home page

రుణ ప్రణాళిక రూ.2,700 కోట్లు

Published Sun, Jun 8 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 8:27 AM

రుణ ప్రణాళిక రూ.2,700 కోట్లు

రుణ ప్రణాళిక రూ.2,700 కోట్లు

విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్ : రైతులకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు కొర్రీలు వేయకుండా పని చేయాలని కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు. డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో శవివారం సాయంత్రం జరిగిన డీసీసీ సమీక్ష సమావేశంలో రూ. 2700 కోట్లతో 2014-15 వార్షిక రుణ ప్రణాళికను ఆయన విడుదల చేశారు. ముందుగావివిధ పథకాలపై సమీక్షించారు.  ఖాతాలు తెరిచేందుకు పదేపదే తిప్పుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారని, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రైతులకు అకౌం ట్ తెరిచేలా చర్యలు తీసుకోవాలనిఆర్‌బీఐ ఏజీఎంను కలెక్టర్ కోరారు.ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సుమారు మూడు నెల లుగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించలేదని,
 
 ఆ లోటును త్వరగా భర్తీ చేయవలసిన అవసరం ఉందని సూచించారు. గత ఏడాది వ్యవసాయ రుణాలను అందించడంలోను, ఇతర పథకాల అమలులోను లక్ష్యం చేరుకోలేకపోయామని, ఈ ఏడాది లక్ష్యా న్ని అధిగమించేలా పని చేయాలని తెలిపారు. ఈ ఏడాది రుణ ప్రణాళిక రూ. 2,700 కోట్లలో ప్రాధాన్యతా రంగాలుగా గుర్తించిన వాటికి రూ. 2,468 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. వాటిలో పంట రుణాల కోసం రూ.1220 కోట్లు, కౌవులు రైతుల పంట రుణా  ల కోసం రూ. 240 కోట్లు, టెర్మ్‌లోన్‌లకు రూ. 200 కోట్లు కలిపి వ్యవసాయ రంగానికి రూ.1,660 కోట్ల మేర రుణం ఇవ్వాలని ప్రణా ళికలో నిర్థేశించినట్టు తెలిపారు. ఇతర ప్రాధాన్యతా సెక్టారులైన గృహ నిర్మాణం,
 
 విద్య, స్వయం సహాయక లింకేజీల కోసం రూ.528 కోట్లను, చిన్న మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు రూ. 280 కోట్లను కేటాయించామన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది రుణ ప్రణా ళికలో 72.18 శాతాన్ని అదనంగా కేటాయించామని తెలిపారు. ప్రభుత్వ పథకాలు, వాటికి లభించే రాయితీలపై రైతులకు మండల స్థాయి సమావేశాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా బ్యాంకర్ల సహకారం అంతంతమాత్రంగానే ఉందని పలు శాఖల అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్ స్పందించారు. మండలాల, పథకాల వారీగా పెండింగ్ ఉన్న యూనిట్ల వివరాల తో లీడ్ బ్యాంక్ మేనేజర్‌కి బ్యాంకర్లు లేఖ పూర్వకంగా నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.  
 
 బ్యాంకర్ల గైర్హాజరుపై  ఆగ్రహం
 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమావేశానికి సగం మంది బ్యాంకు అధికారులు గైర్హాజరవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత బ్యాంకులకు లీడ్ బ్యాంక్ మేనేజర్ నోటీసులు జారీ చేయాలని సూచించారు. సమావేశానికి ప్రభుత్వ అధికారుల ంతా హాజరుకాగా, బ్యాంకు అధికారులు హాజరుకాకపోవడంపై ప్రశ్నించారు. బ్యాంకు అధికారులకు సమాచారం అందించి, అను కూలమైన సమయానికే సమావేశం నిర్వహించామని అయినప్పటికీ హాజరుకాలేదని, ఇది వారి పనితీరుకు అర్ధం పడుతుందని తెలి పారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీఓ రజిత్‌కుమార్ షైనీ, డీఆర్‌డీఏ పీడీ జ్యోతి, లీడ్ బ్యాంచ్ మేనేజర్ శివబాబు, నాబార్డు ఏజీఎం శ్రీనివాస్, జిల్లా అధికారులు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement