అనుకున్నదొక్కటి.. అవుతోందొక్కటి! | Everything is confusion! Debt waiver | Sakshi
Sakshi News home page

అనుకున్నదొక్కటి.. అవుతోందొక్కటి!

Published Tue, Jul 15 2014 2:03 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

అనుకున్నదొక్కటి.. అవుతోందొక్కటి! - Sakshi

అనుకున్నదొక్కటి.. అవుతోందొక్కటి!

అంతా గందరగోళం!
రుణమాఫీ, రీషెడ్యూల్, కొత్త రుణాలపై కొరవడిన స్పష్టత
రైతు జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం

 
 అనంతపురం అగ్రికల్చర్ :  ఆర్థికంగా చితికిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది. రుణమాఫీ.. రీషెడ్యూల్, కొత్త రుణాల అనంతపురం అర్బన్ :

మంజూరుపై స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధికారంలోకి వస్తే తమ వ్యవసాయ రుణాలు రద్దవుతాయని రైతులు ఆశించారు. అయితే రుణమాఫీపై ప్రభుత్వం నుంచి రోజుకోమాట వెలువడుతుండటంతో ‘అనంత’ రైతులకు దిక్కుతోచడం లేదు. రుణమాఫీపై నెలరోజులుగా కసరత్తు కొనసాగిస్తున్నా కొలిక్కి రాకపోవడంతో సీఎం చంద్రబాబునాయుడు ఇప్పుడు రీషెడ్యూల్‌పై దృష్టి సారించారు. రీషెడ్యూల్ చేసినా దానికి కూడా పరిమితులు విధించి అమలు చేసే పరిస్థితి ఉందనే ప్రచారం జరుగుతోంది. మొండిబకాయిలతో పాటు గతేడాది రెన్యూవల్ చేసుకున్న రుణాలు, కొత్త రుణాలు అన్నింటినీ చేస్తారా...? లేదంటే గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారా అనేది తేలడం లేదు. ఇక బంగారు నగలు కుదువ పెట్టి తీసుకున్న రుణాలు, టర్మ్‌లోన్లు గురించి ప్రస్తావనే లేకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. రీషెడ్యూల్ కు జవాబుదారీ వహించాల్సి ఉండటంతో భవిష్యత్తులో పరిస్థితి ఏమిటనే ప్రశ్న రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. రీషెడ్యూల్ చేయడం వల్ల ఏడాది తరువాత పంట రుణాల నుంచి టర్మ్‌లోన్లుగా మార్పు చేస్తారు. దాని వల్ల రైతులపై అదనపు వడ్డీ భారం తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద ప్రభుత్వం వద్ద స్పష్టమైన విధానం లేకపోవడంతో అటు రైతులు ఇటు బ్యాంకర్లలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

రుణమాఫీ చేసి ఉంటే 10,24,577 మందికి లబ్ధి

చంద్రబాబునాయుడు బేషరతుగా రుణమాఫీ చేసి ఉంటే జిల్లాలో 10,24,577 మందికి ప్రయోజనం కలిగి ఉండేది. ఏకంగా రూ.6,817.61 కోట్ల రుణాలు రద్దు అయ్యే పరిస్థితి ఉండేది. అందులో పంట రుణాల కింద 6,08,874 మంది రైతులకు సంబంధించి రూ.3,093.06 కోట్లు, బంగారు నగలు కుదవ పెట్టి 2,12,057 మంది తీసుకున్న రూ.1,851.18 కోట్లు, వ్యవసాయానుబంధ రుణాలు, టర్మ్‌లోన్లు కింద 2,03,646 మందికి చెందిన రూ.1,873.61 కోట్ల రుణాలు మాఫీ కావాల్సి ఉండేది. అది జరిగివుంటే జిల్లాలోని రైతు కుటుంబాలు రుణ విముక్తులయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు.

రీ షెడ్యూల్ చేస్తే 5,33,841 మందికి ప్రయోజనం

గత ఏడాది (2013-14) రుణాలు రెన్యువల్ చేసుకున్న వారికి, కొత్త రుణాలకు రీ షెడ్యూల్ చేస్తే 5,33,841 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. రూ.2,289.33 కోట్ల రుణాలకు రీషెడ్యూల్ వర్తించే అవకాశం ఉందని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 2,12,057 మంది రైతులు బంగారు నగలు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు రూ.1,851.18 కోట్లు ఉండగా... అందులో కేవలం గతేడాది 1,39,595 మంది రైతులు రూ.986.42 కోట్లు రుణాలు తీసుకున్నారు. రీషెడ్యూల్ చేస్తే బంగారు నగలకు తీసుకున్న రుణాల పరిస్థితి అయోమయంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జిల్లాలోని 63 మండలాలను కరువు జాబితాలో ప్రకటించిన ఫలితంగా పూర్తిస్థాయిలో రీషెడ్యూల్ జరిగే పరిస్థితి నెలకొంది.

బోసిపోయిన బ్యాంకులు

 ఖరీఫ్ ప్రారంభమై నెలన్నర అవుతున్నా రుణమాఫీ లేక, రీషెడ్యూల్ చేయక, రెన్యువల్, కొత్త రుణాలు అందక, వాతావరణ బీమా ప్రీమియం చెల్లించలేని పరిస్థితులో ‘అనంత’ రైతులు దర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు. ఈ సమయంలో రైతులతో కిక్కిరిసివుండాల్సిన బ్యాంకులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఆర్‌బీఐ నుంచి ఉత్తర్వులు విడుదల అయితే కొంతవరకు స్పష్టత వచ్చే అవకాశం ఉందని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement