న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లో అతి చల్లని వాతావరణం నెలకొంది. కనిష్ట ఉష్ణోగ్రత 7.6 డిగ్రీలుగా బుధవారం నమోదైంది.ఈ సీజన్‌లో సగటు కనిష్ట ఉష్ణోగ్రతకంటే ఒక పాయింట్ అధికంగా ఉంది. ఉత్తర ప్రాంతంలో మంచు కారణంగా మొత్తం 18 రైళ్లను రద్దు చేయగా 6 రైళ్ల రాకపోకల వేళల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో ఈ ఉదయం 8.30 గంటలకు వాతావరణంలో తేమ 95 శాతంగా నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రత 23.7 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది ఈ సీజన్‌లో సగటు గరిష్ట ఉష్ణోగ్రత కంటే 3 పాయింట్లు అధికం.