SEC Released AP Panchayat Elections 2021 Reschedule Dates | పంచాయతీ ఎన్నికలు రీ షెడ్యూల్ - Sakshi
Sakshi News home page

ఏపీ: పంచాయతీ ఎన్నికలు రీ షెడ్యూల్ 

Jan 25 2021 3:22 PM | Updated on Jan 25 2021 5:05 PM

SEC Reschedules Panchayat Elections In AP - Sakshi

సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలను ఎస్‌ఈసీ రీ షెడ్యూల్‌ చేసింది. రెండో దశ ఎన్నికలను తొలి దశగా మారుస్తూ రీ షెడ్యూల్‌ ప్రకటించింది. మూడో దశ ఎన్నికలను రెండో విడతగా, నాలుగో దశ ఎన్నికలను మూడో విడతగా ఎస్‌ఈసీ మార్పు చేసింది. మొదటి దశ ఎన్నికలను నాలుగో విడతగా మార్చింది. ఎన్నికల ఏర్పాట్లు పూర్తికానందున రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. తొలి దశకు ఈ నెల 29 నుంచి, రెండో దశకు ఫిబ్రవరి 2 నుంచి, మూడో దశకు ఫిబ్రవరి 6 నుంచి, నాలుగో దశకు ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 9న తొలి విడత, ఫిబ్రవరి 13న రెండో దశ, ఫిబ్రవరి 17న మూడో దశ, ఫిబ్రవరి 21న నాలుగో విడత ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు. చదవండి: ఎన్నికలు వాయిదా వేసిన గోవా ఎస్‌ఈసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement