భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఫిబ్రవరి 6 నుంచి 20 మధ్యలో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సఫారీ టూర్ అయ్యాక స్వదేశంలో ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరగాల్సి ఉంది. అయితే భారత్‌లో కరోనా థర్డ్‌వేవ్ ఉదృతి పెరుగుతుండడంతో ఈ సిరీస్‌కు సంబంధించి వేదికలను మార్చాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం వన్డే , టీ20 సిరీస్‌లు ఆరు వేర్వేరు వేదికల్లో జరగాల్సి ఉంది.
అయితే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఆరు వేదికల్లో మ్యాచ్‌లు సురక్షితంగా కాదని, అందుకే ఆరు మ్యాచ్‌లను రెండు వేదికలకే పరిమితం చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ , కోల్‌కతా నగరాల్లో విండీస్ టూర్ ముగించేలా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. దీంతో పాటు రెండు మ్యాచ్‌ల తేదీలను కూడా ఒక రోజు తేడాతో జరుపుతారని సమాచారం. ఫిబ్రవరి 12న జరగాల్సిన మూడో వన్డేను 13కు, 15న నిర్వహించాల్సిన తొలి టీ20ని 16కు పోస్ట్ పోన్ చేస్తారని తెలుస్తోంది.
చదవండి: టీమిండియా క్రికెటర్లను దారుణంగా అవమానించిన ఐసీసీ
Comments
Please login to add a commentAdd a comment