
ఫిబ్రవరి 6 నుంచి స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, సిరీస్ మొత్తానికి దూరం కానున్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. ఇటీవలే అన్నీ ఫార్మాట్లలో రెగ్యులర్ సభ్యుడిగా మారిన అశ్విన్.. సౌతాఫ్రికా పర్యటనలో తగిలిన గాయానికి చికిత్స నిమిత్తం సెలక్షన్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ.. ఈ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనున్న విషయం ఖరారైంది.
ఇదిలా ఉంటే, విండీస్‌తో సిరీస్‌కు టీమిండియా ఎంపిక ఇవాళే(మంగళవారం, జనవరి 25) జరగాల్సి ఉండింది. అయితే, జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ అందుబాటులో లేని కారణంగా ఈ తంతు వాయిదా పడింది. దీంతో సెలెక్షన్ కమిటీ రెండు రోజుల తర్వాత మరోసారి సమావేశమై జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో టీమిండియా-విండీస్ జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్న విషయం తెలిసిందే.
చదవండి: IPL 2022: ఆర్సీబీ కెప్టెన్‌గా విండీస్ ఆల్‌రౌండర్..!
Comments
Please login to add a commentAdd a comment