జూలై- ఆగస్టు నెలల్లో టీమిండియా వెస్టిండీస్‌లో పర్యటించనుంది. జూలై 22 నుంచి ఆగస్టు 7 మధ్య టీమిండియా విండీస్‌తో మూడు వన్డేలు, ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనుంది. ఈ మేరకు బుధవారం సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. వన్డే సిరీస్‌తో పాటు తొలి మూడు టి20లకు పోర్ట్ ఆఫ్ స్పెయిన్, సెంట్ కిట్స్ అండ్ నేవిస్‌లు ఆతిథ్యమివ్వనుండగా.. చివరి రెండు టి20లు యూఎస్‌ఏలోని ఫ్లోరిడా వేదికగా జరగనున్నాయి. కాగా ఈ సిరీస్‌కు సంబంధించి టీమిండియా జట్టును బీసీసీఐ త్వరలోనే ప్రకటించింది. ఇక టీమిండియా- విండీస్ పూర్తి షెడ్యూల్ వివరాలు చూద్దాం..
వన్డే సిరీస్:
తొలి వన్డే: జూలై 22 (క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్)
రెండో వన్డే: జూలై 24 (క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్)
మూడో వన్డే: జూలై 27 (క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్)
టి20 సిరీస్:
తొలి టి20: జూలై 29: (బ్రియాన్ లారా స్టేడియం, పోర్ట్ ఆఫ్ స్పెయిన్)
రెండో టి20: ఆగస్టు 1 (వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్ & నెవిస్)
మూడో టి20: ఆగస్టు 2 (వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్ & నెవిస్)
నాలుగో టి20: ఆగస్టు 6 (బ్రోవార్డ్ కౌంటీ గ్రౌండ్, ఫ్లోరిడా, అమెరికా)
ఐదో టి20: ఆగస్ట్ 7 (బ్రోవార్డ్ కౌంటీ గ్రౌండ్, ఫ్లోరిడా, అమెరికా)
ఐపీఎల్ ముగించుకున్న వెంటనే టీమిండియా రెగ్యులర్ సిరీస్‌ల్లో బిజీ అయింది. ఇప్పటికే జూన్ 9 నుంచి సౌతాఫ్రికాతో టి20 సిరీస్ ఆడనున్న నేపథ్యంలో టీమిండియా జట్టు జూన్ 5న ఢిల్లీకి చేరుకోనుంది. సౌతాఫ్రికా సిరీస్ ముగియగానే టీమిండియా ఇంగ్లండ్ బయలుదేరుతుంది. ఇంగ్లండ్‌తో జూన్ 24 నుంచి జూలై 17 వరకు ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. అటు నుంచే టీమిండియా నేరుగా వెస్టిండీస్ గడ్డపై అడుగుపెట్టనుంది. ఆ తర్వాత ఆసియా కప్, టి20 ప్రపంచకప్ 2022తో టీమిండియా ఏడాది మొత్తం బిజీబిజీగా గడపనుంది.
Maroons fans get ready!🏏 The hottest summer of cricket is coming to the Caribbean & Florida!😎 ☀️ 💃🏾 🕺🏾
— Windies Cricket (@windiescricket) June 1, 2022
Full summer schedule⬇️https://t.co/Mo0TgDvS5s
Comments
Please login to add a commentAdd a comment