West Indies Cricket board
-
వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం..
వెస్టిండీస్ వెటరన్ ఆటగాడు డారెన్ బ్రావో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవడం పట్ల నిరాశచెందిన బ్రావో.. వెస్టిండీస్ క్రికెట్‌తో తెగదింపులు చేసుకున్నాడు. తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా బ్రావో ఆదివారం వెల్లడించాడు. కాగా బ్రావో ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దేశీవాళీ టోర్నీల్లో కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇటీవల జరిగిన విండీస్ సూపర్-50 కప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బ్రావో నిలిచాడు. గత కొన్నేళ్లుగా దేశీవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికి.. సెలక్టర్లు తన పట్టించుకోకపోవడంపై అతడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే విండీస్ క్రికెట్‌కు బ్రావో గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కాగా వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వైన్ బ్రావో సోదరుడే ఈ డారెన్ బ్రావో. "క్రికెటర్‌గా నా తదుపరి ప్రయాణం గురించి ఆలోచించడానికి కొంత సమయం తీసుకున్నాను. అన్ని విధాలగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. విండీస్ క్రికెట్‌తో నా ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి రావడానికి అన్ని విధాల కష్టపడ్డాను. కానీ విండీస్ సెలక్షన్ కమిటీ మాత్రం నాతో ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా పక్కన పెట్టేసింది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో విండీస్ జట్టుకు ప్రాతినిథ్యం వహించడానికి 40 నుంచి 45 మంది ఆటగాళ్లు అవసరం. అందులో నేను లేనని నాకు అర్ధమైపోయింది. ప్రాంతీయ టోర్నీల్లో పరుగులు సాధించినా సెలెక్టర్లు నన్ను పక్కన పెట్టేశారు. అయితే నేను పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకోవడం లేదు. కొంతకాలం పాటు దూరండా ఉండటం ఉత్తమమని భావిస్తున్నాను. ప్రతిభావంతులైన యువ క్రికెటర్లకు అవకాశం కల్పించాలి. ప్రతీ ఒక్కరికి ఆల్‌ది బెస్ట్" అని ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రావో రాసుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్ జట్టు వన్డే, టీ20ల కోసం డిసెంబర్లో వెస్టిండీస్ పర్యటనకు రానుంది. ఈ క్రమంలో విండీస్ సెలక్టర్లు తొలుత వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించారు. విండీస్ వన్డే జట్టు : షై హోప్(కెప్టెన్), అల్జారీ జోసెఫ్(వైస్ కెప్టెన్), అలిక్ అథనజె, యన్నిక్ కరియా, కేసీ కార్టీ, రోస్టన్ ఛేజ్, షేన్ డౌరిచ్, మాథ్యూ ఫోర్డే, షిమ్రన్ హెట్‌మైర్, బ్రాండన్ కింగ్, గుడకేశ్ మోటీ, జొర్న్ ఒట్లే, షెర్ఫనే రూథర్‌ఫర్డ్, రొమరియో షెఫర్డ్, ఒషానే థామస్. -
వారి మ్యాచ్ ఫీజులు పెంచండి.. లేదంటే చాలా కష్టం: భారత మాజీ కెప్టెన్
ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్.. ఇప్పుడు ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. మొన్నటికి మొన్న వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో విఫలమైన విండీస్ జట్టు.. ప్రస్తుతం భారత్‌తో జరగుతోన్న టెస్టు సిరీస్‌లో కూడా అదే తీరును పునరావృతం చేస్తోంది. డొమినికా వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో కరేబియన్ జట్టు ఘోర ఓటమి చవిచూసింది. రెండు సార్లు వన్డే, టీ20 ప్రపంచకప్‌లను ముద్దాడిన విండీస్ జట్టు.. ప్రస్తుతం ఒక్క మ్యాచ్‌లోనైనా గెలుస్తే చాలు అన్న స్ధితికి దిగజారింది. విండీస్ క్రికెట్‌కు ఈ పరిస్థితి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యం కారణం వారి వార్షిక వేతనాలతో పాటు మ్యాచ్ ఫీజ్‌లు తక్కువ ఉండటమే. దీంతో చాలా మంది ఆటగాళ్లు తమ దేశం తరపున కాకుండా ఫ్రాంచైజీ లీగ్‌లకే ఎక్కువ ప్రాధన్యత ఇస్తున్నారు. అందులో సునీల్ నరైన్, అండ్రీ రస్సెల్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ముందు వరుసలో ఉంటారు. ఇక ఇదే విషయంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వాఖ్యలు చేశారు. తమ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులు పెంచి, సెంట్రల్ కాంట్రాక్ట్‌లను తగ్గించాలని విండీస్ క్రికెట్ బోర్డుకు సునీల్ గవాస్కర్ సలహా ఇచ్చాడు. "వెస్టిండీస్ క్రికెటర్లకు మినహా ప్రపంచంలోని మిగితా ఆటగాళ్లందరకి ఆయా క్రికెట్ బోర్డులు సెంట్రల్ కాంట్రాక్ట్‌లతో పాటు ఫీజుల రూపంలో లక్షల డాలర్లు చెల్లుస్తున్నాయి. అదే విధంగా వారి క్రికెటర్లకు అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నాయి. కానీ విండీస్ పరిస్ధితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇది కూడా వారి ప్రదర్శన సరిగా లేకపోవడానికి ప్రధాన కారణమవ్వచ్చు. కాబట్టి విండీస్ క్రికెట్‌కు నేను ఇచ్చే సలహా ఒక్కటే. ఆటగాళ్లకు ఇచ్చే సెంట్రల్ కాంట్రక్ట్లను తగ్గించి మ్యాచ్ ఫీజ్‌లు పెంచండి. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో మ్యాచ్ ఫీజ్‌లు పెంచితే.. విండీస్ తమ పూర్వ వైభవాన్ని పొందే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ ఫీజులు పెంచితే ఆటగాళ్ల వ్యక్తగత ప్రదర్శనలో కూడా మార్పు రావచ్చు. లేదంటే భవిష్యత్తులో విండీస్ క్రికెట్‌కు మరిన్ని కష్టాలు ఎదురవతాయి" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. చదవండి: IND vs WI: టీమిండియాతో రెండో టెస్టు.. వెస్టిండీస్ జట్టు ప్రకటన! యువ సంచలనం ఎంట్రీ -
విండీస్ జట్టుకు పోస్టుమార్టం జరగాల్సిందే..!
1970,80వ దశకంలో వెస్టిండీస్ జట్టు అంటేనే ప్రత్యర్థి జట్లు వణికిపోయేవి. అరవీర భయంకరంగా కనిపించే విండీస్ జట్టును చూస్తేనే ప్రత్యర్థి జట్టు మ్యాచ్‌లు ఓడిపోవాల్సిన దాఖలాలు కనిపించాయి. రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన విండీస్ విధ్వంసక ఆటగాళ్లకు పెట్టింది పేరు. వన్డేల్లో రెండు వరల్డ్‌కప్‌లు.. టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యం. ఆ తర్వాత టి20 ఫార్మాట్‌కే కొత్త వినోదాన్ని అందించిన విండీస్ జట్టు కొన్ని దశాబ్దాల కిందట రారాజుగా వెలుగొంది చివరకు పాతాళానికి పడిపోయింది. ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించకపోవడమే ఒక వైఫల్యం కాగా, ఇప్పటి ప్రదర్శన వెస్టిండీస్ క్రికెట్‌కు మరో విషాదం! 90ల్లో టెస్టు క్రికెట్ చచ్చిపోయి...2000ల్లో వన్డే క్రికెట్లో పూర్తి ఓవర్లు కూడా ఆడలేని స్థాయికి దిగజారి... ఈ రెండూ లేకపోయినా, 2010 తర్వాత టి20 దూకుడుకు చిరునామాగా మారి అద్భుతాలు చూపించిన వెస్టిండీస్ ఇప్పుడు ఈ ఫార్మాట్లో కూడా దిగజారడం క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచే విషయం. -సాక్షి, వెబ్‌డెస్క్ వెస్టిండీస్ జ్టటులో తప్పు ఎక్కడ జరిగిందనేది పక్కనబెడితే.. వారి ఓటమికి ఎన్నో కారణాలున్నాయి. ప్రపంచంలో ఎక్కడ టి20 లీగ్‌లు జరిగినా ముందుగా కనిపించేది వెస్టిండీస్ ఆటగాళ్లే. అలాంటి లీగ్స్‌లో వ్యక్తిగతంగా మెరుపులు మెరిపించే విండీస్ ఆటగాళ్లు టి20 ప్రపంచకప్ లాంటి మేజర్ టోర్నీలో ఒక జట్టు తరపున సమిష్టిగా ఆడడంలో మాత్రం విఫలమయ్యారు. జట్టుగా చూస్తే హిట్టర్లకు కొదువ లేదు. నికోలస్ పూరన్, ఎవిన్ లూయిస్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాసన్ హోల్డర్ ఇలా ఎవరికి వారే పొట్టి క్రికెట్లో మెరిపించడంలో దిట్ట. ప్రపంచకప్‌లో విండీస్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. కెప్టెన్ నికోలస్ పూరన్(5,7, 13 పరుగులు) అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఎప్పుడో జట్టుకు దూరమైన జాసన్ హోల్డర్ ఆల్‌రౌండర్ అంటూ జట్టులోకి తీసుకొచ్చారు. కానీ అతను ఏ మాత్రం ప్రభావం చూపించకపోగా జట్టుకు భారమయ్యాడు. క్వాలిఫయింగ్ దశలో విండీస్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఎవరో ఒకరు రాణించారే తప్ప సమిష్టిగా ఆడిన దాఖలాలు ఎక్కడా కనిపించవు. అసలు ఆడుతుంది వరల్డ్‌కప్ అన్న విషయం కూడా విండీస్ ఆటగాళ్లు మరిచినట్లున్నారు. సీరియస్‌గా మ్యాచ్‌ను కలిసి ఆడాల్సింది పోయి ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించారు. అసలు జట్టు కూర్పు కూడా సరిగ్గా లేదు. జట్టులో ఎంతమంది బ్యాటర్లు.. ఎంతమంది బౌలర్లు ఉండాలి.. ఏ సమయంలో ఎవరిని బ్యాటింగ్‌కు పంపాలి.. బౌలింగ్ ఎవరితో చేయించాలి అన్న కనీస పరిజ్ఞానం లేకుండా విండీస్ తమ ఆటను కొనసాగించి మూల్యం చెల్లించుకుంది. 2012, 2016 టి20 ప్రపంచకప్ విజేతలుగా నిలిచిన జట్టులో ఒక్కరంటే ఒక్కరు కూడా తుది జట్టులో లేకపోవడం పెద్ద మైనస్. రిటైర్ అయిన ఆటగాళ్ల సంగతి పక్కనబెడితే.. సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, హెట్‌మైర్, క్రిస్ గేల్ లాంటి కీలక ఆటగాళ్లను పక్కనబెట్టడం విండీస్ బోర్డు చేసిన పెద్ద తప్పు. వారు ఎలా ఆడతారన్నది ముఖ్యం కాదు. జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఉంటే సమతుల్యం దెబ్బతినకుండా ఉంటుంది. ఈ చిన్న లాజిక్‌ను విండీస్ బోర్డు ఎలా మిస్ అయిందో అర్థం కాలేదు. పైగా హెట్‌మైర్ ఆఖరి నిమిషంలో విమానం ఎక్కకపోవడం అతని బాధ్యతారాహిత్యాన్ని చూపిస్తుంది. దేశం కోసం ఒక మేజర్ టోర్నీ ఆడుతున్నామన్న కసి హెట్మైర్లో ఏ కోశానా కనిపించలేదు. ప్రైవేటు లీగ్స్ మోజులో పడి స్వంత దేశానికి ఆడడంలో నామోషీగా ఫీలవుతున్నారంటూ విండీస్ హెడ్‌కోచ్ గతంలో చేసిన వ్యాఖ్యలు అక్షరాలా నిజమయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో విండీస్ క్రికెట్ బోర్డును లేదా ఆటగాళ్లను తప్పుబట్టలేము. ఎందుకంటే బోర్డు సరిగ్గా ఉండి ఉంటే ఆటగాళ్లు ఇలా తయారయ్యేవారు కాదు. ప్రస్తుతం విండీస్ జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిందే. ఆ సమయం ఆసన్నమైంది. ఇలాగే కొనసాగితే.. కొన్నేళ్ల పాటు క్రికెట్లో కనిపించకుండా పోయిన జింబాబ్వేలాగా తయారవ్వడం గ్యారంటీ. కాగా టి20 ప్రపంచకప్‌లో విండీస్ ప్రదర్శనపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ రిక్కీ స్కెర్రిట్ సుదీర్ఘ లేఖ రాసుకొచ్చారు. జట్టు భవితవ్యంపై ఆందోళన చెందారు. ''టి20 ప్రపంచకప్‌లో మా జట్టు ప్రదర్శన నన్ను చాలా నిరుత్సాహానికి గురి చేసింది. క్రికెట్లో ఎంతో గొప్ప పేరున్న వెస్టిండీస్ ఆసీస్ గడ్డ నుంచి ఇలా అవమానకరరీతిలో వెనుదిరిగి వస్తుందని ఎవరు ఊహించలేదు. జట్టు సెలక్షన్‌లోనే పెద్ద తప్పు జరిగింది. టి20 ప్రపంచకప్ లాంటి మేజర్ టోర్నీకి ఎలాంటి జట్టును ఎంపిక చేయాలన్న విషయం పూర్తిగా విస్మరించాం. మా భవిష్యత్తుపై పునరాలోచించుకోవాల్సిన సమయం వచ్చేసింది. జట్టుకు పోస్టుమార్టం జరగాల్సిందే. వరల్డ్‌కప్‌లో మేం చేసిన తప్పులు ఏంటి.. వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అన్న విషయాలపై చర్చిస్తాం. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు మునపటి వైభవం తీసుకొచ్చేలా ఆటగాళ్లను తయారు చేస్తాం. తక్షణ కర్తవ్యం జట్టు ప్రక్షాళన. ఇది చాలా అవసరం. ఇంత చెత్త ప్రదర్శనలోనూ మాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. కచ్చితంగా మంచి కమ్‌బ్యాక్‌తో తిరిగి వస్తామని ఆశిస్తున్నా'' అంటూ ముగించాడు. 🚨 JUST IN 🚨 COMMENT BY CWI PRESIDENT RICKY SKERRITT. pic.twitter.com/fYVJSWy0mn — Windies Cricket (@windiescricket) October 21, 2022 చదవండి: 'హెట్‌మైర్ శాపం తగిలింది.. అందుకే విండీస్‌కు ఈ దుస్థితి' మా ఓటమికి ప్రధాన కారణం అదే.. ఇదో గుణపాఠం.. పూరన్ కన్నీటి పర్యంతం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'అలసత్వం తెచ్చిన తంటా'.. టి20 ప్రపంచకప్‌కు దూరం
వెస్టిండీస్ స్టార్.. హార్డ్ హిట్టర్ షిమ్రన్ హెట్‌మైర్ టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. అయితే గాయంతో దూరమయ్యాడనుకుంటే పొరపాటే. ఫ్లైట్ మిస్ అయిన కారణంగా ఆఖరి నిమిషంలో మేనేజ్మెంట్ హెట్మైర్ను జట్టు నుంచి తప్పించింది. కాగా హెట్‌మైర్ స్థానంలో షమ్రా బ్రూక్స్‌ను ఎంపిక చేసింది. కచ్చితమైన సమాచారం లేకుండా హెట్‌మైర్ రీ షెడ్యూల్ ఫ్లైట్‌ను కూడా మిస్ చేయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. విషయంలోకి వెళితే.. మొన్నటి దాకా కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2022)లో హెట్‌మైర్ గయానా అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కెప్టెన్‌గా జట్టును నడిపించాడు. అయితే టి20 ప్రపంచకప్ ఆడేందుకు మిగతా జట్టంతా కాస్త ముందుగానే ఆస్ట్రేలియాకు చేరుకుంది. సీపీఎల్‌లో ఫైనల్ చేరిన రెండు జట్లలోని ఆటగాళ్లకు(టి20 ప్రపంచకప్‌కు ఎంపికైన వాళ్లు) మాత్రం అక్టోబర్ 1న ఆస్ట్రేలియా వెళ్లేలా ఏర్పాట్లు చేసింది. టి20 ప్రపంచకప్‌కు ముందు వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 5, 7 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. హెట్‌మైర్ మాత్రం వ్యక్తిగత కారణాల రిత్యా అక్టోబర్ 1న వెళ్లలేనని విండీస్ బోర్డుకు తెలిపాడు. దీంతో విండీస్ బోర్డు అక్టోబర్ 3న హెట్‌మైర్‌కు ఫ్లైట్‌ను రీషెడ్యూల్ చేసింది. ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టి20కి కూడా హెట్‌మైర్ అందుబాటులో ఉండడని క్రికెట్ వెస్టిండీస్ డైరెక్టర్ జిమ్మీ ఆడమ్స్ పేర్కొన్నాడు. అంతేకాదు ఈసారి ఫ్లైట్ మిస్ అయితే మాత్రం టి20 ప్రపంచకప్‌కు దూరమవ్వాల్సి ఉంటుందని హెట్మైర్ను బోర్డు హెచ్చరించింది. అయితే హెట్‌మైర్ మాత్రం రీషెడ్యూల్ ఫ్లైట్ ఎక్కలేకపోయాడు. ''కొన్ని కారణాల రిత్యా ఎయిర్‌పోర్ట్‌కు రాలేకపోయాను.. సారీ ఫర్ డిలే'' అంటూ బోర్డుకు సమాచారమిచ్చాడు. కాగా హెట్‌మైర్ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బోర్డు.. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ముందుగా హెచ్చరించిన ప్రకారం రీషెడ్యూల్ ఫ్లైట్ ఎక్కకపోతే హెట్మైర్ను టి20 ప్రపంచకప్ జట్టు నుంచి తొలగించాలనే నిర్ణయానికే ప్యానెల్ కట్టుబడింది. ఇందుకు ప్యానెల్ సభ్యులు కూడా యునానిమస్‌గా ఒప్పుకోవడంతో హెట్మైర్ను జట్టు నుంచి తప్పించి అతని స్థానంలో షమ్రా బ్రూక్స్‌ను ఎంపిక చేసింది. ''హెట్‌మైర్ విషయంలో మేం క్లారిటీగా ఉన్నాం. రీషెడ్యూల్ ఫ్లైట్ కూడా మిస్ అయితే జట్టు నుంచి తప్పిస్తామని ముందే హెచ్చరించాం. వ్యక్తిగత కారణాల రిత్యా హెట్‌మైర్ మరోసారి ఫ్లైట్ మిస్ అయ్యాడు. దీంతో రూల్ ప్రకారం అతన్ని జట్టు నుంచి తప్పించాం. అతని స్థానంలో బ్రూక్స్‌ను ఆస్ట్రేలియాకు పంపించాం'' అంటూ డైరెక్టర్ జిమ్మీ ఆడమ్స్ పేర్కొన్నాడు. ఇక సీపీఎల్ 2022లో షమ్రా బ్రూక్స్ సెంచరీతో చెలరేగి తన జట్టు జమైకా తలైవాస్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత ఫైనల్లో బార్బడోస్ రాయల్స్‌ను ఓడించిన జమైకా తలైవాస్ సీపీఎల్ చాంపియన్‌గా అవతరించింది. ఇక అక్టోబర్ 17న స్కాట్లాండ్తో జరిగే మ్యాచ్‌తో వెస్టిండీస్ తమ ప్రపంచకప్ ఆటను షురూ చేయనుంది. వెస్టిండీస్ ప్రపంచకప్ జట్టు: నికోలస్ పూరన్(కెప్టెన్), రోవమన్ పోవెల్, యన్నిక్ కరై, జాన్సన్ చార్లెస్, షెల్డన్ కాట్రెల్, షమారా బ్రూక్స్, జాసన్ హోల్డర్, అకీల్ హోస్సెన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, కైల్ మేయర్స్, ఓబెడ్ మెక్‌కామ్, రేమన్ రీఫర్, ఓడియన్ స్మిత్ చదవండి: 'చదువును చంపకండి'.. రషీద్ ఖాన్ ఎమోషనల్ ట్వీట్ -
'ఆడమని ఎవరిని అడుక్కోం'.. విండీస్ కోచ్; రసెల్ స్ట్రాంగ్ కౌంటర్
వెస్టిండీస్ క్రికెటర్లు తమ దేశానికంటే బయటి దేశాలు నిర్వహించే లీగ్స్‌లోనే ఎక్కువగా కనబడుతుంటారు. కారణం డబ్బు. విండీస్‌కు ఆడితే వచ్చే డబ్బుతో పోలిస్తే.. ప్రైవేట్ లీగ్స్‌లో ఆ డబ్బు రెండింతల కంటే ఎక్కువుంటుంది. అందుకే క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్ , ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది. మొత్తంగా చెప్పాలంటే.. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న వివిధ క్రికెట్ లీగ్స్ అందరికంటే ఎక్కువగా కనబడేది కరేబియన్ క్రికెటర్లే. మన ఐపీఎల్‌తోనూ వారికి విడదీయరాని బంధం ఉంది. డబ్బులు ఎక్కువొస్తాయంటే అవసరమైతే జాతీయ జట్టుకు ఆడే విషయాన్ని పక్కకుబెట్టడం విండీస్ ఆటగాళ్ల నైజం. అందుకే టి20 ఫార్మాట్లో రెండుసార్లు చాంపియన్ అయినప్పటికి ఆ జట్టులో ఎప్పుడు నిలకడ ఉండదు. ఈ మధ్య కాలంలో అది మరోసారి నిరూపితమైంది. ఇటీవలే భారత్‌తో జరిగిన టి20 సిరీస్‌లో 4-1 తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలోనే విండీస్ జట్టు కోచ్ ఫిల్ సిమ్మన్స్ రెండు రోజుల క్రితం దేశానికంటే విదేశీ లీగ్స్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్న కొందరు క్రికెటర్లపై వ్యంగ్యంగా స్పందించాడు. ''వెస్టిండీస్ కోసం కాస్త ఆడండయ్యా అంటూ మేము ప్లేయర్లను అడుక్కోవాలని అనుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌లు ఆడుతున్న ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ తదితర స్టార్లు.. జాతీయ జట్టుకు ముఖం చాటేస్తున్నారు. అక్టోబర్‌లో జరగబోయే టీ20 ప్రపంచకప్ కోసం వెస్టిండీస్ జట్టులో అత్యుత్తమ ప్లేయర్లను బరిలోకి దించడానికి బోర్డు తీవ్రంగా కష్టపడుతున్నప్పటికీ.. చాలా మంది క్రికెటర్లు డబ్బు కోసం ఫ్రాంచైజీ లీగ్‌కే మొగ్గు చూపుతున్నారు. ఇంకొంతమంది గాయాలతో జట్టుకు అందుబాటులో ఉండట్లేదంటూ అబద్దాలు చెబుతూ తప్పించుకుంటున్నారు. దీంతో మాకు వేరే మార్గం లేకుండా పోయింది.. ఈ విషయంలో ఎవరూ ఏమీ చేయలేరు. స్టార్ ప్లేయర్లు తన జాతీయ జట్టు కోసం ఆడాలని తాపత్రాయపడితే మార్పు వస్తుందని నమ్ముతున్నా. అందుకు తగ్గట్లు వాళ్లు కొన్ని లీగ్‌లను వదులుకుంటే తప్పితే మేము ఏం చేయలేని పరిస్థితి'' అని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా విండీస కోచ్ ఫిల్ సిమ్మన్స్ చేసిన వ్యాఖ్యలపై విండీస్ సీనియర్ ప్లేయర్ ఆండ్రీ రసెల్ కాస్త ఘూటుగానే స్పందించాడు. ఫిల్ సిమ్మన్స్ ఆర్టికల్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ''ఇలాంటిది వస్తుందని నాకు ముందే తెలుసు.. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సైలెంట్‌గా ఉండడమే ఉత్తమం..'' అంటూ క్యాప్షన్ జత చేసి కోపంతో ఉన్న ఎమోజీలను షేర్ చేశాడు. రసెల్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రసెల్ వెస్టిండీస్ తరపున 67 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఆఖరిసారిగా వెస్టిండీస్ తరపున టి20 ప్రపంచకప్ 2021లో పాల్గొన్నాడు. అయితే యూఏఈ వేదికగా జరిగిన ఆ ప్రపంచకప్‌లో వెస్టిండీస్ దారుణ ప్రదర్శన కనబరిచింది. రసెల్ మాత్రమే కాదు సునీల్ నరైన్ కూడా 2019 నుంచి జాతీయ జట్టుకు రెగ్యులర్‌గా అందుబాటులో ఉండడం లేదు. గాయాల సాకు చెప్పి డబ్బులు బాగా వచ్చే ఐపీఎల్, బిగ్‌బాష్ లీగ్, కరేబియన్ లీగ్‌ల్లో ఆడుతూ బిజీగా గడుపుతున్నారు. View this post on Instagram A post shared by Andre Russell🇯🇲 Dre Russ.🏏 (@ar12russell) చదవండి: MI Emirates: 'పొలార్డ్ నుంచి బౌల్ట్ దాకా'.. ఆరంభం కాకముందే టైటిల్‌పై కన్నేశారు Dwayne Bravo: 600 వికెట్లతో ప్రపంచ రికార్డు.. టి20 క్రికెట్లో తొలి బౌలర్‌గా -
విండీస్‌లో భారత్‌కు వింత పరిస్థితి.. లగేజీ మొదలు వీసా సమస్య వరకు
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియాకు వింత పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముందు లగేజీ సమస్య రాగా.. తాజాగా ఆటగాళ్లకు వీసా సమస్య వచ్చి వచ్చింది. విషయంలోకి వెళితే.. విండీస్‌తో చివరి రెండు టి20లు అమెరికాలోని ఫ్లోరిడాలోని మియామిలో జరగనున్నాయి. కాగా మొదట అమెరికా వెళ్లేందుకు ఇరుజట్లలోని ఆటగాళ్లకు వీసాలు రాకపోవడంతో మ్యాచ్‌ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన విండీస్ క్రికెట్ బోర్డు వీసా ఎంట్రీకి సంబంధించిన కార్యచరణను పూర్తి చేయాల్సి వచ్చింది. ముందుగా బుధవారం ఇరుజట్ల ఆటగాళ్లు గయానాలోని జార్జిటౌన్‌కు చేరుకోనున్నారు. గయానాలోని అమెరికా ఎంబసీలో ఆటగాళ్లకు వీసా అపాయింట్మెంట్స్ బుక్ చేశారు. అన్ని సక్రమంగా జరిగితే గురువారం సాయంత్రం వరకు ఆటగాళ్లు ప్లోరిడాలోని మయామికి చేరుకుంటారు. క్రికెట్ వెస్టిండీస్ బోర్డు(సీడబ్ల్యూఐ) అధ్యక్షుడు రికీ స్కెరిట్ మాట్లాడుతూ.. ''ఆటగాళ్లకు వీసా సమస్య తీరిపోయినట్లేనని భావిస్తున్నాం. గయానా నుంచి ఆటగాళ్లకు వీసా అపాయింట్మెంట్ ఇప్పించాం. ముందుగా గయానాకు వెళ్లనున్న ఆటగాళ్లు అక్కడి నుంచి ఫ్లోరిడాకు చేరుకుంటారు. ఇక ఫ్లోరిడాలో మ్యాచ్‌లు జరుగడం ఇదే చివరిసారి అనుకుంటా. అంతకమించి ఎక్కువ చెప్పలేం.'' అంటూ పేర్కొన్నాడు కాగా ఇంతకముందు రెండో టి20కి ముందు టీమిండియా ఆటగాళ్లకు లగేజీ సమస్య ఎదురైంది. ట్రినిడాడ్ నుంచి సెయింట్ కింట్స్‌కు లగేజీ రాక ఆలస్యం కావడంతో మ్యాచ్ దాదాపు మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఆటగాళ్ల లగేజీ సమస్యపై విండీస్ క్రికెట్ బోర్డు క్షమాపణ కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఫ్లోరిడాలోని మియామిలో ఆగస్టు 6,7 తేదీల్లో చివరి రెండు టి20లు జరగనున్నాయి. ఇప్పటికైతే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇక మూడో టి20 మ్యాచ్‌లో వెన్నునొప్పితో కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగడంతో మిగతా టి20లు ఆడడం అనుమానంగానే ఉంది. ఒకవేళ రోహిత్ దూరమైతే.. మిగతా రెండు టి20లకు పంత్ టీమిండియా స్టాండింగ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రానున్న ఆసియా కప్ దృష్టిలో పెట్టుకొని రోహిత్ గాయం నుంచి కోలుకున్నప్పటికి ఆడించడం అనుమానంగానే ఉంది. ఈ విషయంపై బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకోనుంది. చదవండి: Suryakuamar Yadav: దంచికొట్టిన సూర్యకుమార్.. లగ్జరీ కారు ఇంటికొచ్చిన వేళ IND vs WI: కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. తొలి భారత కెప్టెన్‌గా! -
విండీస్ పర్యటనకు టీమిండియా.. పూర్తి షెడ్యూల్ ఇదే
జూలై- ఆగస్టు నెలల్లో టీమిండియా వెస్టిండీస్‌లో పర్యటించనుంది. జూలై 22 నుంచి ఆగస్టు 7 మధ్య టీమిండియా విండీస్‌తో మూడు వన్డేలు, ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనుంది. ఈ మేరకు బుధవారం సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. వన్డే సిరీస్‌తో పాటు తొలి మూడు టి20లకు పోర్ట్ ఆఫ్ స్పెయిన్, సెంట్ కిట్స్ అండ్ నేవిస్లు ఆతిథ్యమివ్వనుండగా.. చివరి రెండు టి20లు యూఎస్ఏలోని ఫ్లోరిడా వేదికగా జరగనున్నాయి. కాగా ఈ సిరీస్‌కు సంబంధించి టీమిండియా జట్టును బీసీసీఐ త్వరలోనే ప్రకటించింది. ఇక టీమిండియా- విండీస్ పూర్తి షెడ్యూల్ వివరాలు చూద్దాం.. వన్డే సిరీస్: తొలి వన్డే: జూలై 22 (క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్) రెండో వన్డే: జూలై 24 (క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్) మూడో వన్డే: జూలై 27 (క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్) టి20 సిరీస్: తొలి టి20: జూలై 29: (బ్రియాన్ లారా స్టేడియం, పోర్ట్ ఆఫ్ స్పెయిన్) రెండో టి20: ఆగస్టు 1 (వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్ & నెవిస్) మూడో టి20: ఆగస్టు 2 (వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్ & నెవిస్) నాలుగో టి20: ఆగస్టు 6 (బ్రోవార్డ్ కౌంటీ గ్రౌండ్, ఫ్లోరిడా, అమెరికా) ఐదో టి20: ఆగస్ట్ 7 (బ్రోవార్డ్ కౌంటీ గ్రౌండ్, ఫ్లోరిడా, అమెరికా) ఐపీఎల్ ముగించుకున్న వెంటనే టీమిండియా రెగ్యులర్ సిరీస్‌ల్లో బిజీ అయింది. ఇప్పటికే జూన్ 9 నుంచి సౌతాఫ్రికాతో టి20 సిరీస్ ఆడనున్న నేపథ్యంలో టీమిండియా జట్టు జూన్ 5న ఢిల్లీకి చేరుకోనుంది. సౌతాఫ్రికా సిరీస్ ముగియగానే టీమిండియా ఇంగ్లండ్ బయలుదేరుతుంది. ఇంగ్లండ్‌తో జూన్ 24 నుంచి జూలై 17 వరకు ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. అటు నుంచే టీమిండియా నేరుగా వెస్టిండీస్ గడ్డపై అడుగుపెట్టనుంది. ఆ తర్వాత ఆసియా కప్, టి20 ప్రపంచకప్ 2022తో టీమిండియా ఏడాది మొత్తం బిజీబిజీగా గడపనుంది. Maroons fans get ready!🏏 The hottest summer of cricket is coming to the Caribbean & Florida!😎 ☀️ 💃🏾 🕺🏾 Full summer schedule⬇️https://t.co/Mo0TgDvS5s — Windies Cricket (@windiescricket) June 1, 2022 -
వెస్టిండీస్ వన్డే, టి20 కొత్త కెప్టెన్‌గా నికోలస్ పూరన్
వెస్టిండీస్ వన్డే, టి20 కొత్త కెప్టెన్‌గా నికోలస్ పూరన్ ఎంపికయ్యాడు. ఈ మేరకు క్రికెట్ వెస్టిండీస్(సీడబ్ల్యూఐ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. పొలార్డ్ స్థానంలో పూరన్ విండీస్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఇటీవలే కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి కొత్త కెప్టెన్ ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై విండీస్ క్రికెట్ బోర్డు పలు దఫాలు చర్చలు జరిపింది. ఎట్టకేలకు ఆ సస్పెన్స్‌కు తెరదించుతూ పూరన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కాగా నికోలస్ పూరన్ ఐసీసీ టి20 ప్రపంచకప్ 2022తో పాటు, 2023 వన్డే ప్రపంచకప్ వరకు విండీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించునున్నాడు. ఇక షెయ్ హోప్‌ను వన్డే వైస్‌కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇక పూరన్ 2016లో విండీస్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన పూరన్ 37 వన్డేల్లో 1,121 పరుగులు, 57 టి20ల్లో 1193 పరుగులు సాధించాడు. వన్డేల్లో ఒక సెంచరీ, 8 అర్థసెంచరీలు సాధించిన పూరన్.. టి20 క్రికెట్లో 8 అర్థసెంచరీలు సాధించాడు. ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్న పూరన్ ఎస్ఆర్హెచ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పూరన్‌ను ఎస్ఆర్హెచ్ మెగావేలంలో రూ.10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తన రేటుకు న్యాయం చేస్తున్న పూరన్ ఎస్ఆర్హెచ్ తరపున కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. చదవండి: Kohli-Viv Richards: విండీస్ దిగ్గజానికి క్లిష్ట పరిస్థితి.. కోహ్లి త్యాగం! -
Ind Vs Wi: కెప్టెన్‌ను మార్చే ప్రసక్తే లేదు... అనవసరంగా విమర్శలు... ఒకవేళ..
Ind Vs Wi: ‘‘ఫిల్, పొలార్డ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెటేతర కారణాల వల్లే ఇలా జరుగుతోంది. అంతేతప్ప ఆట పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఏదేమైనా ఇప్పట్లో కోచ్, కెప్టెన్‌ను మార్చే యోచనే లేదు’’ అని క్రికెట్ వెస్టిండీస్ అధ్యక్షుడు రికీ స్కెరిట్ స్పష్టం చేశాడు. కాగా టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్, కోచ్ ఫిల్ సిమన్స్పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2021లో వెస్టిండీస్ జట్టు ఘోర వైఫల్యం, ఇటీవల స్వదేశంలో ఐర్లాండ్ చేతిలో వన్డే సిరీస్ ఓటమి తర్వాత ఇవి మరింత ఎక్కువయ్యాయి. ముఖ్యంగా జట్టులోని కొందరు ఆటగాళ్ల పట్ల పొలార్డ్ వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి స్థానిక మీడియాలో కథనాలు వెలువడగా... విండీస్ బోర్డు వాటిని ఖండించింది. ఈ క్రమంలో సీడబ్ల్యూఐ అధ్యక్షుడు రికీ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ... ‘‘ఒకవేళ వాళ్లు(ఫిల్, పొలార్డ్) తమ బాధ్యతను సరిగా నెరవేర్చలేదని నిరూపితమైతే అప్పుడు కచ్చితంగా పునరాలోచన చేస్తాం. అంతేతప్ప ఇప్పటికిప్పుడు వారిని పంపే ప్రసక్తే లేదు. కొంతమంది అకారణంగా వారిపై నిందలు వేస్తున్నారు. వారిని తక్కువ చేసి చూపించాలనుకుంటున్నారు’’ అని కెప్టెన్, కోచ్‌కు మద్దతుగా నిలిచాడు. కాగా ఐర్లాండ్ చేతిలో ఘోర ఓటమి పాలైన విండీస్.. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్(3-2 తేడాతో)ను కైవసం చేసుకుని తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. ఫిబ్రవరి 6న టీమిండియాతో ఆరంభం కానున్న వన్డే సిరీస్‌కు పొలార్డ్ బృందం సన్నద్ధమవుతోంది. చదవండి: IPL 2022 Mega Auction: అతడు వేలంలోకి వస్తే.. జట్లు పోటీ పడాల్సిందే: అశ్విన్ IND vs WI: ఇప్పుడు ఇంగ్లండ్ పని అయిపోయింది.. తరువాత టీమిండియానే: పొలార్డ్ -
టీమిండియాతో సిరీస్.. వెస్టిండీస్ జట్టులో గొడవలు.. పొలార్డ్‌పై సంచలన ఆరోపణలు!
వెస్టిండీస్ క్రికెట్ జట్టు త్వరలో భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఫిబ్రవరి 6న భారత్- వెస్టిండీస్ మధ్య తొలి వన్డే జరగనుంది. ఇప్పటికే వన్డే సిరీస్ కోసం విండీస్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన వెస్టిండీస్ జట్టులో కొంత మంది సీనియర్ ఆటగాళ్లతో కెప్టెన్ కీరన్ పొలార్డ్‌కి విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్‌రౌండర్ ఓడెన్ స్మిత్ విషయంలో అతడు వివక్షాపూరితంగా వ్యవహరించినట్లు స్థానిక మీడియాలో సంచలన కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ఈ వార్తలపై క్రికెట్ వెస్టిండీస్ స్పందించింది. వెస్టిండీస్ జట్టులో విభేదాలు చెలరేగాయి అంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. విండీస్ జట్టులో ఎటువంటి విభేదాలు లేవని, ఆటగాళ్లు అందరూ బాగానే ఉన్నారని క్రికెట్ వెస్టిండీస్ పేర్కొంది. కెప్టెన్ పొలార్డ్ విశ్వసనీయతని దెబ్బతీసేందుకు ఇటువంటి రూమర్స్ సృష్టించారని సీడబ్ల్యూఐ ప్రెసిడెంట్ రిక్కీ స్టేరిట్ తెలిపాడు.కాగా విండీస్ జట్టు స్వదేశంలో ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతోంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో విండీస్ అధిక్యంలో ఉంది. చదవండి: India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ తివారి IPL 2022 Mega Auction: వేలంలో పేరు నమోదు చేసుకున్న శ్రీశాంత్.. ధర ఎంతో తెలుసా? -
క్రిస్ గేల్‌కు ఘోర అవమానం..!
Chris Gayle: విండీస్ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌కు ఘోర అవమానం జరిగింది. సొంతగడ్డపై టీ20లకు వీడ్కోలు పలకాలనుకున్న తన ఆకాంక్షను ఆ దేశ క్రికెట్ బోర్డు బేఖాతరు చేసింది. త్వరలో ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరగనున్న టీ20 సిరీస్‌ల కోసం ఎంపిక చేసిన విండీస్ జట్టులో చోటు కల్పించకుండా అతన్ని అవమానపర్చింది. ఇప్పటికే వన్డేలు, టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పిన గేల్.. తన సొంత మైదానమైన సబీనా పార్క్‌లో తన చివరి టీ20 మ్యాచ్ ఆడి క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెబుతానని గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. విండీస్ క్రికెట్ బోర్డు తాజా నిర్ణయంతో గేల్.. తన సమీప భవిష్యత్తులో టీ20లు ఆడే అవకాశం లేదు. దీంతో అతను టీ20 రిటైర్మెంట్ అంశంపై పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విండీస్.. జనవరి 16న ఐర్లాండ్‌తో ఏకైక టీ20, ఆతర్వాత జనవరి 22 నుండి 30 వరకు ఇంగ్లండ్‌తో 5 టీ20లు ఆడనుంది. ఇదిలా ఉంటే, గేల్ తన టీ20 కెరీర్లో మొత్తం 452 మ్యాచ్‌ల్లో 145.4 స్ట్రైక్‌రేట్‌తో 14,321 పరుగులు సాధించి, ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పొట్టి క్రికెట్లో గేల్ 87 హాఫ్ సెంచరీలు, 22 సెంచరీలు బాదాడు. చదవండి: కోహ్లి-రోహిత్‌ల మధ్య విభేదాలా..? అలాంటి వార్తలు విని నవ్వుకునేవాడిని..! -
ఐపీఎల్ 2021 కోసం ముందుకు జరుగనున్న సీపీఎల్..?
ముంబై: భారత్‌లో కరోనా కేసులు అధికమవడం కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ 2021 సీజన్‌ను యూఏఈ వేదికగా సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 10 మధ్యలో నిర్వహించాలని బీసీసీఐ శత విధాల ప్రయత్నిస్తుంది. ఇందు కోసం కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) షెడ్యూల్‌ను వారం నుంచి పది రోజులు ముందుకు జరపాలని క్రికెట్ వెస్టిండీస్‌తో సంప్రదింపులకు సమాయత్తమవుతోంది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం సీపీఎల్ ఆగస్టు 28న ప్రారంభమై సెప్టెంబర్ 19న ముగుస్తుంది. ఇదే జరిగితే సీపీఎల్‌లో పాల్గొనే ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడేందుకు బయో బబుల్ ఇబ్బందులు తలెత్తడంతో పాటు లీగ్‌లోని కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో రెండు లీగ్‌ల మధ్య క్లాష్ జరగకుండా, సీపీఎల్‌ను ప్రీపోన్ చేసుకోవాలని బీసీసీఐ వెస్టిండీస్ క్రికెట్ బోర్డును కోరనుంది. ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు వివిధ కారణాల చేత ఐపీఎల్లో ఆడేది అనుమానంగా మారిన నేపథ్యంలో బీసీసీఐ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోను ఒప్పందం కుదుర్చుకున్న అందరు విదేశీ ఆటగాళ్లతో లీగ్‌ను నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఐపీఎల్ సెకండాఫ్ జరుగుతున్న సమయంలో ఏ కారణం చేత కూడా విదేశీ ఆటగాళ్లు దూరం కాకుండా ఆయా బోర్డులతో బీసీసీఐ చర్చలు ప్రారంభించింది. చదవండి: ధోని లాంటి ఫినిషర్ లేకపోతే ఎంత మేటి జట్టైనా ఏం ప్రయోజనం..? -
క్రికెట్‌కు గేల్ ‘విరామం’
జొహన్నెస్‌బర్గ్: వెస్టిండీస్ విధ్వంసక క్రికెటర్ క్రిస్ గేల్ కొంత కాలం పాటు ఆటనుంచి విరామం తీసుకోవాలని భావించాడు. ఈ విషయాన్ని విండీస్ క్రికెట్ బోర్డుకు అతను తెలియజేశాడు. దాంతో వచ్చే నెలలో జరిగే భారత పర్యటనలో గేల్ ఆడే అవకాశం లేదు. ఈ టూర్లో భాగంగా భారత్–వెస్టిండీస్ మధ్య 3 టి20లు, 3 వన్డేలు జరగనున్నాయి. ఈ ఏడాది ఇకపై తాను ఏ టోరీ్నలోనూ ఆడబోవడం లేదని అతను స్పష్టం చేశాడు. ఆ్రస్టేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లకు కూడా గేల్ దూరం కానున్నాడు. ప్రస్తుతానికి విరామం తీసుకోవడంపైనే తన ఆలోచనలు సాగుతున్నాయని అతను చెప్పాడు. శరీరాన్ని ‘రీచార్జ్’ చేసుకొని వచ్చే సంవత్సరం కెరీర్ కొనసాగించే విషయంపై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించిన గేల్... 2020 టి20 ప్రపంచ కప్‌లో ఆడటం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 40 ఏళ్ల గేల్ ఆదివారం తన చివరి మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా ఎంజాన్సీ సూపర్ లీగ్‌లో ఆడాడు. ఈ టోరీ్నలో పూర్తిగా విఫలమైన అతను 6 ఇన్నింగ్స్‌లలో కలిపి 101 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో అతను ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఫ్రాంచైజీ క్రికెట్లో నేను ఒకటి రెండు మ్యాచ్‌లలో విఫలమైతే ప్రతీ జట్టు నన్నూ భారంగా భావిస్తూ ఉంటుంది. నాకు తగిన గౌరవం దక్కదు. అప్పటి వరకు నేను జట్టుకు చేసిందంతా అందరూ మర్చిపోతారు. అయితే వీటికి అలవాటు పడటం నేర్చుకున్నాను’ అని గేల్ అన్నాడు. -
పాకిస్తాన్ అంటే ఇప్పటికీ వణుకే!
బార్బడోస్: పాకిస్తాన్ లో పర్యటించేందుకు వెస్డిండీస్ క్రికెట్ బోర్డు మరోసారి నిరాకరించింది. తమ ఆటగాళ్ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. పాక్ ఆతిథ్యాన్ని స్వీకరించాలని అంతర్జాతీయ క్రికెటర్ల సమాఖ్య(ఎఫ్ఐసీఏ) వెస్డిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ)కు ప్రతిపాదనలు పంపింది. దీనిపై స్పందించిన విండీస్ బోర్డు.. పాక్ వెళ్తే మా ఆటగాళ్లకు ఎవరు భద్రత కల్పిస్తారు. ఇంకా చెప్పాలంటే వారి ప్రాణాలకు ముప్పు ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే పీఎస్ఎల్ సందర్భంగా పాక్ లో పర్యటించాలని ఉందని ఆండ్రీ రస్సెల్ వ్యాఖ్యానించగా, సెక్యూరిటీ కల్పిస్తే తనకు ఏ అభ్యంతరం లేదని అప్పటి విండీస్ కెప్టెన్ డారెన్ సమీ ప్రకటించాడు. విండీస్ జట్టు తమ దేశంలో పర్యటించాలని టెస్ట్, వన్డే సిరీస్ లకు సంసిద్ధం కావాలంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కొన్ని రోజుల కిందట విండీస్ బోర్డుకు లేఖ రాసింది. ఇందుకు స్పందించిన విండీస్ బోర్డు అధికారులు.. తటస్థవేదిక అమెరికాలోని ఫ్లోరిడాలో అయితే తమకు ఏ సమస్య ఉండదని పీసీబీకి వెల్లడించింది. ఆటగాళ్ల భయాలు వారికి ఉన్నాయి కానీ, ముందుగా పాక్ లో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిపాలని, దీనిపై సలహా ఇవ్వాలంటూ ఎఫ్ఐసీఏను విండీస్ బోర్డు కోరింది. చివరగా మార్చి నుంచి మే మధ్య పాక్ జట్టు కరీబియన్ లో పర్యటించాలని సూచించింది. రెండు టీ20లు, మూడు వన్డేలు, మూడు టెస్టులు ఆడేందుకు రావాలని షెడ్యూలు ఖరారు చేసింది. 2009లో పాక్ లో పర్యటన సందర్భంగా శ్రీలంక ఆటగాళ్లపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. లాహార్ లో బస్సులో వెళ్తున్న లంక ఆటగాళ్లపై ఉగ్రదాడికి కుట్ర జరిగింది. దీంతో అప్పటినుంచీ ఏ క్రికెట్ బోర్డు పాకిస్తాన్ లో పర్యటించేందుకు ఆసక్తి చూపడం లేదు. తమ ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా తటస్థ వేదికలలోనే పాక్ తమ క్రికెట్ మ్యాచ్ లను నెట్టుకొస్తుంది. అయితే తమకు ఆదాయం రావాలంటే క్రికెట్ ఆడే దేశాలు కనికరం చూపాలని పాక్ బోర్డు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం కనిపించడం లేదు.