Chris Gayle: విండీస్ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌కు ఘోర అవమానం జరిగింది. సొంతగడ్డపై టీ20లకు వీడ్కోలు పలకాలనుకున్న తన ఆకాంక్షను ఆ దేశ క్రికెట్ బోర్డు బేఖాతరు చేసింది. త్వరలో ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరగనున్న టీ20 సిరీస్‌ల కోసం ఎంపిక చేసిన విండీస్ జట్టులో చోటు కల్పించకుండా అతన్ని అవమానపర్చింది. ఇప్పటికే వన్డేలు, టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పిన గేల్.. తన సొంత మైదానమైన సబీనా పార్క్‌లో తన చివరి టీ20 మ్యాచ్ ఆడి క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెబుతానని గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.
విండీస్ క్రికెట్ బోర్డు తాజా నిర్ణయంతో గేల్.. తన సమీప భవిష్యత్తులో టీ20లు ఆడే అవకాశం లేదు. దీంతో అతను టీ20 రిటైర్మెంట్ అంశంపై పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విండీస్.. జనవరి 16న ఐర్లాండ్‌తో ఏకైక టీ20, ఆతర్వాత జనవరి 22 నుండి 30 వరకు ఇంగ్లండ్‌తో 5 టీ20లు ఆడనుంది. ఇదిలా ఉంటే, గేల్ తన టీ20 కెరీర్‌లో మొత్తం 452 మ్యాచ్‌ల్లో 145.4 స్ట్రైక్‌రేట్‌తో 14,321 పరుగులు సాధించి, ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పొట్టి క్రికెట్‌లో గేల్ 87 హాఫ్ సెంచరీలు, 22 సెంచరీలు బాదాడు.
చదవండి: కోహ్లి-రోహిత్‌ల మధ్య విభేదాలా..? అలాంటి వార్తలు విని నవ్వుకునేవాడిని..!
Comments
Please login to add a commentAdd a comment