West Indies Cricket team
-
'బలిపశువులా బస్సు కిందకు తోయాలనుకుంటున్నారు!'
వెస్టిండీస్ సీనియర్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్, విండీస్ క్రికెట్ హెడ్‌కోచ్ ఫిల్ సిమ్మన్స్ మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొంతమంది విండీస్ క్రికెటర్లు డబ్బుపై మోజుతో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం కంటే ప్రైవేట్ లీగ్‌ల్లోనే ఎక్కువగా ఆడుతున్నారంటూ ఫిల్ సిమ్మన్స్ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశాడు. ''ఇలా జరుగుతుందని ముందే ఊహించాను.. కానీ ఇప్పుడు సైలెంట్‌గా ఉండడమే బెటర్'' అని సిమ్మన్స్ వ్యాఖ్యలపై ఇన్స్టాగ్రామ్ వేదికగా రసెల్ ధీటుగా కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత రసెల్ ఆ పోస్టును డిలీట్ చేశాడు. తాజాగా తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నట్లు రసెల్ మరోసారి కుండబద్దలు కొట్టాడు. ప్రస్తుతం ది హండ్రెడ్ టోర్నమెంట్లో పాల్గొంటున్న రసెల్‌ను.. బుధవారం విండీస్ మాజీ ఆల్‌రౌండర్ డారెన్ సామీ ఇంటర్య్వూ చేశాడు. ఈ సందర్భంగా రసెల్ మాట్లాడుతూ.. '' ఈ విషయంలో నిశబ్దంగా ఉండాలని అనుకుంటున్నా. ఇంతకముందు జరిగిన చర్చల్లో ఈ విషయంపై చాలా స్పష్టంగా మాట్లాడుకున్నాం. అందుకే నన్ను చెడ్డవాడిగా సృష్టించి.. బలిపశువులా బస్సు కిందకు తోసేయాలని కొంతమంది కంకణం కట్టుకున్నారు. అందుకే నన్ను రెచ్చగొట్టేలా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడో ఊహించాను కాబట్టే సైలెంట్‌గా ఉండదలచుకున్నా. అయితే విండీస్ జట్టు నుంచి దూరమవ్వాలని నేనెప్పుడు భావించలేదు. ఏ క్రికెటర్ అయినా సొంత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కోరకుంటాడు. నాకు అవకాశం వచ్చినప్పుడు నేనేంటో నిరూపించుకున్నా. ఇప్పటికిప్పుడు విండీస్ జట్టుతో ఆడి రెండు ప్రపంచకప్‌లు గెలవాలని ఉంది. కానీ ఆ అవకాశం వస్తుందా అంటే చెప్పలేను. నిజాయితీగా చెప్పాలంటే.. ప్రైవేట్ లీగ్స్‌లో ఆడేటప్పుడే రెండు సెంచరీలు సాధించాను. కానీ అవి విండీస్ జట్టుకు చేస్తే బాగుండు అని చాలాసార్లు అనిపించింది. ఒకవేళ ఆ రెండు సెంచరీలు విండీస్ తరపున చేసి ఉంటే జట్టులో ప్రత్యేక స్థానం ఉండేది. అయితే కొన్ని షరతులు అంగీకరించలేకుండా ఉన్నాయి. అందుకే ప్రైవేట్ లీగ్స్ ఆడాల్సి వస్తోంది. ఇప్పుడు నా వయసు 34 సంవత్సరాలు. మహా అయితే మరో నాలుగేళ్లు క్రికెట్ ఆడుతానేమో. మాకు కుటుంబాలు ఉన్నాయి. వారి బాగోగులు చూసుకోవడానికి కెరీర్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అవకాశం వస్తే ఇప్పటికి విండీస్‌కు ప్రపంచకప్ అందించాలని భావిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఆండ్రీ రసెల్ వెస్టిండీస్ తరపున 56 టి20ల్లో 1034 పరుగులు, 70 వికెట్లు.. 67 టి20ల్లో 741 పరుగులు, 39 వికెట్లు తీశాడు. ఇక తన చివరి వన్డేను విండీస్ తరపున 2019లో ఆడాడు. రసెల్ ఆఖరిసారిగా వెస్టిండీస్ తరపున టి20 ప్రపంచకప్ 2021లో పాల్గొన్నాడు. అయితే యూఏఈ వేదికగా జరిగిన ఆ ప్రపంచకప్‌లో వెస్టిండీస్ దారుణ ప్రదర్శన కనబరిచింది. చదవండి: 'ఆడమని ఎవరిని అడుక్కోం'.. విండీస్ కోచ్; రసెల్ స్ట్రాంగ్ కౌంటర్ Jonny Bairstow: కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. మరోసారి నిరూపితం -
క్రిస్ గేల్‌కు ఘోర అవమానం..!
Chris Gayle: విండీస్ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌కు ఘోర అవమానం జరిగింది. సొంతగడ్డపై టీ20లకు వీడ్కోలు పలకాలనుకున్న తన ఆకాంక్షను ఆ దేశ క్రికెట్ బోర్డు బేఖాతరు చేసింది. త్వరలో ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరగనున్న టీ20 సిరీస్‌ల కోసం ఎంపిక చేసిన విండీస్ జట్టులో చోటు కల్పించకుండా అతన్ని అవమానపర్చింది. ఇప్పటికే వన్డేలు, టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పిన గేల్.. తన సొంత మైదానమైన సబీనా పార్క్‌లో తన చివరి టీ20 మ్యాచ్ ఆడి క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెబుతానని గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. విండీస్ క్రికెట్ బోర్డు తాజా నిర్ణయంతో గేల్.. తన సమీప భవిష్యత్తులో టీ20లు ఆడే అవకాశం లేదు. దీంతో అతను టీ20 రిటైర్మెంట్ అంశంపై పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విండీస్.. జనవరి 16న ఐర్లాండ్‌తో ఏకైక టీ20, ఆతర్వాత జనవరి 22 నుండి 30 వరకు ఇంగ్లండ్‌తో 5 టీ20లు ఆడనుంది. ఇదిలా ఉంటే, గేల్ తన టీ20 కెరీర్లో మొత్తం 452 మ్యాచ్‌ల్లో 145.4 స్ట్రైక్‌రేట్‌తో 14,321 పరుగులు సాధించి, ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పొట్టి క్రికెట్లో గేల్ 87 హాఫ్ సెంచరీలు, 22 సెంచరీలు బాదాడు. చదవండి: కోహ్లి-రోహిత్‌ల మధ్య విభేదాలా..? అలాంటి వార్తలు విని నవ్వుకునేవాడిని..! -
మళ్లీ క్రికెట్ కోసం...
లండన్: మళ్లీ లైవ్ క్రికెట్‌ను అస్వాదించేందుకు అభిమానులు సిద్ధంగా ఉండండి. వెస్టిండీస్ క్రికెట్ జట్టు మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ చేరుకుంది. ప్రైవేట్ విమానంలో కరీబియన్ ఆటగాళ్లు పయనమయ్యారు. ఇంగ్లండ్‌కు బయలుదేరే ముందు విండీస్ ఆటగాళ్లకు కోవిడ్–19 పరీక్షలు నిర్వహించగా... అందరికీ నెగెటివ్ వచ్చింది. ఇంగ్లండ్ చేరాక ప్రస్తుత నిబంధనల మేరకు 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి కావడంతో ఆటగాళ్లు బస చేసే హోటల్ నుంచి బయటికిరారు. క్వారంటైన్ ముగిశాక మరోసారి కరోనా పరీక్షలు చేస్తారు. టెస్టు సిరీస్ కాస్తా జూలై 8న మొదలవుతుంది. అంతర్జాతీయ క్రికెట్ షట్డౌన్కు త్వరలోనే ఈ సిరీస్ ద్వారా తెరలేవనుందని విండీస్ కెప్టెన్ హోల్డర్ చెప్పాడు. కరీబియన్ నుంచి తొలి అడుగు పడుతోందన్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మాట్లాడుతూ మొత్తం క్రికెట్ ప్రపంచం మళ్లీ ఆటను చూసేందుకు ఉత్సాహంతో ఎదురు చూస్తోందని అన్నాడు. మూడు టెస్టుల సిరీస్‌ను బయో సెక్యూర్ వాతావరణంలో గేట్లు మూసి ప్రేక్షకుల్లేకుండా ఈ పోటీలు నిర్వహిస్తారు. -
నరైన్, పొలార్డ్‌లకు పిలుపు
సెయింట్‌జాన్స్: చాలాకాలం తర్వాత ‘మిస్టరీ స్పిన్నర్’ సునీల్ నరైన్ వెస్టిండీస్ టి20 జట్టుకు ఎంపికయ్యాడు. భారత్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు గాను తొలి రెండు మ్యాచ్‌లకు మంగళవారం ప్రకటించిన జట్టులో అతడితో పాటు ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌కు చోటుదక్కింది. నరైన్ విండీస్ తరఫున రెండేళ్ల క్రితం చివరి టి20 ఆడాడు. మొత్తం 14 మంది సభ్యుల జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఆంథోని బ్రాంబెల్ ఒక్కడే కొత్తముఖం. ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్ సారథ్యం వహిస్తాడు. గాయంతో ప్రపంచ కప్ మధ్యలో తప్పుకొన్న మరో స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ అందుబాటులోకి రాగా... విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ అందుబాటులో ఉండనని ప్రకటించాడు. అతడి స్థానంలో ఎడంచేతి వాటం ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. వచ్చే ఏడాది జరుగనున్న టి20 ప్రపంచ కప్‌ను నిలబెట్టుకునే ప్రణాళికల్లో భాగంగా సమతూకమైన జట్టును ఎంపిక చేసినట్లు వెస్టిండీస్ సెలక్షన్ కమిటీ చైర్మన్ రాబర్ట్ హేన్స్ తెలిపారు. సిరీస్‌లో భాగంగా తొలి రెండు టి20లు ఆగస్ట్ 3, 4 తేదీల్లో ఫ్లోరిడా (అమెరికా)లోని లాడర్‌హిల్‌లో జరుగుతాయి. ఆగస్ట్ 6న మూడో టి20కి గయానా ఆతిథ్యం ఇవ్వనుంది. తొలి రెండు టి20లకు విండీస్ జట్టు: కార్లోస్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), సునీల్ నరైన్, కీమో పాల్, ఖారీ పియర్, కీరన్ పొలార్డ్, నికోలస్ పూరన్, అంథోని బ్రాంబెల్ (వికెట్ కీపర్లు), రోవ్‌మన్ పావెల్, ఆండ్రీ రసెల్, ఒషాన్ థామస్, జాన్ క్యాంప్‌బెల్, షెల్డన్ కాట్రెల్, షిమ్రన్ హెట్‌మైర్, ఎవిన్ లూయిస్. -
చాంపియన్... షాంపేన్
► మిన్నంటిన వెస్టిండీస్ క్రికెటర్ల సంబరాలు విజయాన్ని ఎలా వేడుకగా జరుపుకోవాలో వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు. అదే ప్రపంచకప్ గెలిస్తే ఇక వారి సంబరాలకు పట్టపగ్గాలు ఉండవు. 2012లో గంగ్నమ్ డ్యాన్స్‌తో విండీస్ హోరెత్తిస్తే ఈ సారి చాంపియన్ పాట వారితో నాట్యమాడించింది. మైదానంలో గెలుపు తర్వాత మొదలైన సంబరాలు సోమవారం తెల్లవారుజాము నాలుగు గంటల వరకు కొనసాగాయి. స్టేడియంలో ఫైనల్ ముగిసిన తర్వాతే విండీస్ క్రికెటర్లు పట్టరాని ఆనందంతో చిందులు వేశారు. అక్కడ అలసిపోయేంత వరకు ఆడిపాడిన బృందం హోటల్‌కు చేరగానే మళ్లీ కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకుంది. ఎంట్రన్స్నుంచే చాంపియన్ డ్యాన్స్ చేసుకుంటూ వారు లోపలికి వచ్చారు. అప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడికి చేరిన అభిమానులు కూడా డ్యాన్స్ చేస్తూ ఉత్సాహపరచడంతో స్యామీ, బ్రేవో చెలరేగిపోయారు. మధ్యలో సెల్ఫీల కోసం సంబరపడిన ఎవరినీ వారు నిరాశ పర్చలేదు. స్పెషల్ నైట్ వేడుకలకు విరామం ఇవ్వకుండా హోటళ్లో మళ్లీ అంతా ఒక్కచోటికి చేరారు. అక్కడ షాంపేన్ వరదలా పారింది. అప్పటికే హోటల్ ప్రతినిధులు సిద్ధం చేసిన కేక్‌ను కట్ చేయడంతో మరో రౌండ్ సంబరాలు మొదలయ్యాయి. చాంపియన్ పాటతో జోష్ మొదలైనా... తర్వాత హాలీవుడ్ సంగీతం అక్కడ హోరెత్తింది. ప్రపంచ విజేతలు ఈ ప్రపంచాన్ని మరచిపోయి డ్యాన్స్‌తో చెలరేగిపోయారు. మధ్యలో విండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ కూడా వారితో జత కలవడం ఆటగాళ్ల ఉత్సాహాన్ని మరింత పెంచింది. అభినందించేందుకు రూమ్‌కు వచ్చిన లాయిడ్ కూడా చాంపియన్ డ్యాన్స్ చేయడం విశేషం. విండీస్ ఫైనల్‌ను టీవీలో వీక్షించిన అనంతరం ఇదే డ్యాన్స్ చేసి జట్టుకు అభినందనలు పలికిన విఖ్యాత అథ్లెట్ ఉసేన్ బోల్ట్ ఆ వీడియోను జట్టు సభ్యులకు పంపించగా... వారంతా ఆసక్తిగా తిలకించారు. సోమవారం మధ్యాహ్నం విక్టోరియా ప్యాలెస్ వద్ద ఫోటో సెషన్‌కు స్యామీ, బ్రాత్‌వైట్ హాజరు కాగా, సాయంత్రంనుంచి ఆటగాళ్లు బయల్దేరి వెళ్లారు. వీరిలో కొందరు నేరుగా తమ ఐపీఎల్ జట్లతో చేరగా, ఇతర ఆటగాళ్లు విండీస్ పయనమయ్యారు. ► కోల్‌కతాలోని చారిత్రక విక్టోరియా మెమోరియల్ భవనం ముందు ప్రపంచకప్ ట్రోఫీలతో వెస్టిండీస్ మహిళల కెప్టెన్ స్టెఫానీ టేలర్, పురుషుల జట్టు కెప్టెన్ స్యామీ చూస్తున్నవాళ్లం అలసిపోయాం మామూలుగానే విండీస్ క్రికెటర్లు చిన్న చిన్న సంతోషాలను కూడా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక ఈ విజయం తర్వాత చెప్పేదేముంది. చూస్తున్నవాళ్లం అలసిపోయాం కానీ వారు మాత్రం ఆట, పాటతో అలసిపోలేదు. ప్రాక్టీస్ సమయంలో, ఆడే సమయంలో కూడా వాళ్లు తీవ్రంగా శ్రమిస్తారు. వంద శాతం కష్టపడతారు. అదే మైదానం దాటితే సంబరాలు కూడా అదే తరహాలో రెట్టింపు స్థాయిలో ఉంటాయి. హోటల్లోని టీమ్ రూమ్‌లో అడుగు పెట్టిన తర్వాత వారో కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో గేల్ అయినా, మరే జూనియర్ ఆటగాడైనా ఒక్కటే. ఇలాంటి గొప్ప జట్టుతో టోర్నీకి పని చేయడం నా అదృష్టం - విక్రమ్ మాన్సింగ్, వెస్టిండీస్ టీమ్ లైజన్ మేనేజర్ -
స్టీవెన్ స్మిత్ సెంచరీ
జమైకా: వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. స్టీవెన్ స్మిత్ సెంచరీ సాధించాడు. 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్ స్మిత్ అజేయ సెంచరీతో కోలుకుంది. క్లార్క్ తో కలిసి మూడో వికెట్ కు 118 జోడించాడు. స్మిత్ 278 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 135 పరుగులు చేశాడు. మైఖేల్ క్లార్క్ 47, వోగ్స్ 37, మార్ష్ 11 పరుగులు చేశారు. ఓపెనర్ వార్నర్ డకౌట్ అయ్యాడు. స్మిత్(135), వాట్సన్(20) క్రీజ్ లో ఉన్నాడు. విండీస్ బౌలర్లలో టేలర్ 3 వికెట్లు పడగొట్టాడు. హోల్డర్ ఒక వికెట్ పడగొట్టాడు. -
దక్షిణాఫ్రికా చేతిలో విండీస్ చిత్తు
జొహాన్నెస్‌బర్గ్: వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. విండీస్ ను 148 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 440 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది. రామదిన్(57), స్మిత్(64) అర్థ సెంచరీలు సాధించారు. శామ్యూల్స్ 40, కార్టర్ 40, స్యామీ 25, హోల్డర్ 21, గేల్ 19 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మోర్కల్, ఫిలాండర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. -
వెస్టిండీస్ క్రికెట్ జట్టు పై మండిపడ్డ బి.మోహన్
-
తిరుగుబాటు
భారత్‌లో అడుగు పెట్టినప్పటినుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న వెస్టిండీస్ క్రికెటర్ల అసంతృప్తి... ఇప్పుడు దావానలంలా మారింది. దీంతో డ్వేన్ బ్రేవో బృందం ఏకంగా భారత పర్యటన నుంచి వైదొలిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆటగాళ్లు అనూహ్య నిర్ణయం తీసుకుని... ధర్మశాల వన్డేతోనే సిరీస్‌ను ముగించారు. దీనిపై బీసీసీఐకి కూడా కోపం వచ్చింది. తక్షణమే శ్రీలంక బోర్డుతో మాట్లాడి ఐదు వన్డేల సిరీస్‌ను ఖరారు చేసుకుంది. ధర్మశాల: నాలుగో వన్డే ఆరంభానికి ముందు టాస్ వేసే సమయంలో జట్టు కెప్టెన్ బ్రేవో ఒక్కడే రాలేదు. తన జట్టు సహచరులందరినీ తోడుగా తీసుకొచ్చాడు. వ్యాఖ్యాతగా ఉన్న విండీస్ మాజీ క్రికెటర్ బిషప్తో మాట్లాడుతూ ‘నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది’ అని వెల్లడించాడు. అయితే ఈ ప్రకటనకు ముందే తాము భారత పర్యటనను తక్షణమే రద్దు చేసుకుంటున్నట్లు జట్టు మేనేజర్ రిచీ రిచర్డ్సన్, బీసీసీఐకి మెయిల్ పంపారు. దీంతో భారత పర్యటనలో ధర్మశాల వన్డేనే ఆఖరిది అయ్యింది. ఈ పర్యటనలో మిగిలిన ఒక వన్డే, ఒక టి20 మ్యాచ్, మూడు టెస్టులు జరిగే అవకాశం లేదు. ‘ఆటగాళ్ల మధ్య అంతర్గత సమస్యలే’ పర్యటన రద్దుకు కారణమని విండీస్ బోర్డు తమ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కారణమేంటి ఈ ఏడాది సెప్టెంబర్ 19న విండీస్ బోర్డు, ప్లేయర్స్ అసోసియేషన్ మధ్య ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు, ఇతర చెల్లింపులకు సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. అయితే తమతో చర్చించకుండా ప్లేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేవెల్ హైండ్స్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని, ఇది అమల్లోకి వస్తే తాము భారీగా నష్టపోతామంటూ జట్టు ఆటగాళ్లు కొచ్చిలో తొలి వన్డేకు ముందే నిరసన వ్యక్తం చేశారు. మ్యాచ్ బరిలోకి దిగినా... సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని, హైండ్స్ రాజీనామా చేయాలని బ్రేవో బృందం డిమాండ్ చేసింది. ఈ విషయంలో కలుగజేసుకోవాలని కూడా బోర్డుకు బ్రేవో లేఖ రాశాడు. అయితే సీనియర్ ఆటగాళ్లు సహకరిస్తామని అప్పట్లో మాట ఇచ్చారని, తాను రాజీమానా చేసేది లేదని హైండ్స్ స్పష్టం చేశాడు. అటు బోర్డు కూడా ఆటగాళ్లతో నేరుగా కాకుండా ప్లేయర్స్ అసోసియేషన్‌తోనే తాము చర్చిస్తామని గురువారం స్పష్టం చేసింది. దీంతో ఆగ్రహించిన ఆటగాళ్లు భారత్‌తో సిరీస్‌ను తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. మళ్లీ అదే డ్రామా నాలుగో వన్డేకు ముందే వెస్టిండీస్ మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించుకుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా మ్యాచ్ జరగడంపై అనుమానాలు ఏర్పడ్డాయి. అయితే బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ హోటల్‌కు వెళ్లి వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆటగాళ్లతో పాటు రిచర్డ్సన్, ఆంబ్రోస్‌లతో కూడా వరుసగా మాట్లాడారు. ‘మ్యాచ్ లేకపోతే మాకు అవమానం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. టికెట్లు ఎప్పుడో అమ్ముడుపోయాయి. వన్డే చూసేందుకు చాలా దూరంనుంచి అభిమానులు వస్తున్నారు. ఇంత చెప్పినా మీరు ఆడమంటే ఇక మేమేమీ చేయలేం’ అని ఠాకూర్ అన్నట్లు సమాచారం. చివరకు దీనిని మన్నిస్తూ టాస్కు గంట ముందు విండీస్ మైదానానికి చేరుకుంది. ‘విండీస్ జట్టు నా వెనకే నిలబడింది. ఇది మాకు కఠిన పర్యటన. మేమందరం కలిసికట్టుగా పోరాడాం. క్రికెట్, అభిమానులు ఇబ్బంది పడాలని మేం కోరుకోవడం లేదు. ఇక నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది’ అని మ్యాచ్‌కు ముందు బ్రేవో వ్యాఖ్యానించాడు. బీసీసీఐ ఆగ్రహం వెస్టిండీస్ క్రికెటర్ల అనూహ్య నిర్ణయాన్ని బీసీసీఐ తేలిగ్గా వదిలి పెట్టాలనుకోవడం లేదు. ఐసీసీని సంప్రదించి జరిగిన నష్టానికి పరిహారం కోరుతూ దావా వేయాలని భావిస్తోంది. ‘వెస్టిండీస్ క్రికెటర్లు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరం. సమస్యను సరిగ్గా పరిష్కరించలేని విండీస్ బోర్డు అసమర్థత కారణగా ద్వైపాక్షిక సిరీస్ రద్దయింది భవిష్యత్తులో భారత్, విండీస్ మధ్య సంబంధాలపై కూడా దీని ప్రభావం పడుతుంది’ అని బీసీసీఐ ప్రకటించింది. విండీస్ ఆటగాళ్లు ఐపీఎల్లో పాల్గొనకుండా చర్య తీసుకోవాలని బోర్డులోని సీనియర్లు భావిస్తున్నారు. కనీసం ఒక సీజన్‌కైనా వారిపై నిషేధం విధించాలని వారు గట్టిగా కోరుతున్నారు. శ్రీలంకతో ఐదు వన్డేలు వెస్టిండీస్ అర్ధాంతరంగా తప్పుకోవడంతో మరో జట్టును భారత్‌కు పిలిచి సిరీస్ ఆడించాలని బీసీసీఐ నిర్ణయించింది. అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాల ప్రకారం శ్రీలంక అందుకు సిద్ధంగా ఉంది. నవంబరు 1-15 మధ్య శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్ జరగనుంది. దీనిని లంక బోర్డు కార్యదర్శి నిషాంత రణతుంగ ప్రాథమికంగా నిర్ధారించారు. -
చివరి వన్డేలో విండీస్ పై భారత్ గెలుపు
-
విండీస్‌కు కళ్లెం; సిరీస్ ధోని సేన కైవసం
కాన్పూర్: వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో గెల్చుకుంది. బుధవారమిక్కడ జరిగిన చివరి వన్డేలో ధోని సేన 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 264 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 46.1 ఓవర్లలో 266 పరుగులు చేసింది. మరో 23 బంతులు మిగులుండగానే ధోని సేన విజయాన్ని అందుకుంది. ఓపెనర్ శిఖర్ ధావన్ అద్భుతంగా సెంచరీ సాధించాడు. 95 బంతుల్లో 20 ఫోర్లతో 119 పరుగులు చేసి అవుటయ్యాడు. యువరాజ్ సింగ్(55) అర్థ సెంచరీతో రాణించాడు. రోహిత్ శర్మ(4) మరోసారి నిరాశపరిచాడు. కోహ్లి 19 పరుగులే చేశాడు. రైనా(34) ఫర్వాలేదనిపించాడు. ధోని(23) నాటౌట్‌గా నిలిచారు. విండీస్ బౌలర్లలో రామ్‌పాల్, బ్రేవొ రెండేసి వికెట్లు పడగొట్టారు. నరైన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. సెంచరీ హీరో శిఖర్ ధావన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. విరాట్ కోహ్లి 'మ్యన్ ఆఫ్ ద సిరిస్' అవార్డు అందుకున్నాడు. కొచ్చిలో జరిగిన మొదటి వన్డేలో భారత్ విజయం సాధించగా, విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో విండీస్ నెగ్గింది. -
ధోనీ దూకుడు.. విండీస్ బేజారు
విశాఖపట్టణం: వెస్టిండీస్‌తో ఆదివారమిక్కడ జరుగుతున్న రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. విండీస్ ముందు 289 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. విరాట్ కోహ్లి మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. కోహ్లీ 99, రోహిత్ శర్మ 12, ధావన్ 35, యువరాజ్ సింగ్ 28, రైనా 23, జడేజా 10, అశ్విన్ 19 పరుగులు చేసి అవుటయ్యారు. చివర్లో ధోనీ మెరుపులు మెరిపించాడు. మొదట్లో నెమ్మదిగా ఆడిన ధోనీ తర్వాత విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 51 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో రామ్‌పాల్ 4 వికెట్లు పడగొట్టాడు. హోల్డర్, పెర్మాల్, సమీ తలో వికెట్ దక్కించుకున్నారు. -
రోచ్ అవుట్, వన్డేలకు పొలార్డ్ దూరం
భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ జట్టుపై గాయాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పేసర్ కెమర్ రోచ్ గాయంతో సిరీస్ నుంచి పూర్తిగా వైదొలగగా, ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ వన్డేలకు దూరమయ్యాడు. రోచ్ భుజంనొప్పి కారణంగా రెండో టెస్టుతో పాటు వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక పొలార్డ్‌కు వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. భారత పర్యటనలో కరీబియన్లు రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడనున్నారు. తొలి టెస్టులో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. వన్డే సిరీస్‌కు విండీస్ జట్టును ప్రకటించారు. జట్టు: డ్వెన్ బ్రావో (కెప్టెన్), టినో బెస్ట్, డారెన్ బ్రావో, చార్లెస్, డియోనరైన్, క్రిస్ గేల్, హోల్డర్, సునీల్ నరైన్, పెరుమాళ్, పావెల్, రాందిన్, రాంపాల్, డారెన్ సామీ, శామ్యూల్స్, సిమన్స్. -
453 పరుగులకు భారత్ ఆలౌట్
కోల్‌కతా: వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 453 పరుగులకు ఆలౌటయింది. దీంతో విండీస్‌పై టీమిండియాకు 219 పరుగుల ఆధిక్యం లభించింది. 354/6 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ధోని సేన మరో 99 పరుగులు జత చేసి మిగతా 4 వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్ ఆశ్విన్ సెంచరీ సాధించాడు. 159 బంతుల్లో 11 ఫోర్లతో సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో అతడికిది రెండో సెంచరీ. అరంగ్రేటం శతకం బాదిన రోహిత్ శర్మ 177 పరుగులు చేసి అవుటయ్యాడు. మిగతా ఆటగాళ్లు ఇలా వచ్చి అలా వెళ్లడంతో లంచ్ విరామానికి ముందే భారత్ ఆలౌటయింది. విండీస్ బౌలర్లలో షిల్లాంగ్ ఫోర్డ్ 6 వికెట్లు నేలకూల్చాడు. పెరుమాల్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. బెస్ట్, కొట్రీల్ చెరో వికెట్ తీశారు. -
భారత్ చేరిన విండీస్ క్రికెట్ జట్టు
కోల్‌కతా: వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్ చేరుకుంది. ధోని సేనతో ఇక్కడ రెండు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు డారెన్ స్యామీ నేతృత్వంలోని విండీస్ జట్టు సోమవారం కోల్‌కతాకు వచ్చింది. స్థానిక విమానాశ్రయం నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య విండీస్ ఆటగాళ్లు నేరుగా తాము బస చేసే హోటల్‌కు వెళ్లారు. సచిన్‌కు ఫేర్వెల్ టోర్నీ అయినా ఈ సిరీస్‌లో తొలి టెస్టు ఇక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో వచ్చే నెల 6 నుంచి 10 వరకు జరగుతుంది. ఇది సచిన్‌కు 199వ టెస్టు కాగా... 200 టెస్టు ముంబైలోని వాంఖడేలో 14 నుంచి 18 వరకు జరగుతుంది. పర్యాటక జట్టు మొదట ఉత్తరప్రదేశ్ జట్టుతో మూడు రోజుల సన్నాహక మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ జాదవ్‌పూర్ యూనివర్సిటీ గ్రౌండ్లో 31న మొదలవుతుంది. ముందనుకున్న షెడ్యూలు ప్రకారం ఈ మ్యాచ్ కటక్‌లో జరగాల్సివున్నప్పటికీ ఎడతెరిపిలేని వర్షాల వల్ల కోల్‌కతాకు మార్చారు. టెస్టు సిరీస్ తర్వాత జరిగే మూడు వన్డేల సిరీస్‌లో రెండో వన్డే నవంబర్ 24న విశాఖపట్నంలో జరగనుంది.