453 పరుగులకు భారత్ ఆలౌట్ | India all out for 453 in Kolkata Test | Sakshi
Sakshi News home page

453 పరుగులకు భారత్ ఆలౌట్

Published Fri, Nov 8 2013 11:06 AM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM

453 పరుగులకు భారత్ ఆలౌట్

453 పరుగులకు భారత్ ఆలౌట్

కోల్కతా: వెస్టిండీస్తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 453 పరుగులకు ఆలౌటయింది. దీంతో విండీస్పై టీమిండియాకు 219 పరుగుల ఆధిక్యం లభించింది. 354/6 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ధోని సేన మరో 99 పరుగులు జత చేసి మిగతా 4 వికెట్లు కోల్పోయింది.

స్పిన్నర్ ఆశ్విన్ సెంచరీ సాధించాడు. 159 బంతుల్లో 11 ఫోర్లతో సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో అతడికిది రెండో సెంచరీ. అరంగ్రేటం శతకం బాదిన రోహిత్ శర్మ 177 పరుగులు చేసి అవుటయ్యాడు. మిగతా ఆటగాళ్లు ఇలా వచ్చి అలా వెళ్లడంతో లంచ్ విరామానికి ముందే భారత్ ఆలౌటయింది. విండీస్ బౌలర్లలో షిల్లాంగ్ ఫోర్డ్ 6 వికెట్లు నేలకూల్చాడు. పెరుమాల్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. బెస్ట్, కొట్రీల్ చెరో వికెట్ తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement