
కోల్‌కత్తా: టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి పెను ప్రమాదం తప్పింది. తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గంగూలీ ప్రయాణిస్తున్న కారు ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదానికి గురైంది. ఇక, ఈ ప్రమాదంలో గంగూలీకి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత గంగూలీ పది నిమిషాల పాటు రోడ్డుపైనే వేచి చూశారు.
వివరాల ప్రకారం.. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గురువారం రాత్రి ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి బుర్ద్వాన్ వెళ్లారు. ఈవెంట్‌కు వెళ్తున్న సమయంలో గంగూలీ ప్రయాణిస్తున్న కారు దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదానికి గురైంది. గంగూలీ కారు ముందు ఒక ట్రక్కు అకస్మాత్తుగా రావడంతో ఆయన కారు డ్రైవర్ సడెన్‌గా బ్రేక్‌లు వేయాల్సి వచ్చింది.
దీంతో, ఆయన కారు వెనుక నుంచి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. సౌరవ్ గంగూలీ ప్రయాణిస్తున్న కారును వెనుక వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. అయితే, ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ సౌరవ్ గంగూలీ, డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ గంగూలీ కాన్వాయ్‌లోని రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదం కారణంగా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో, గంగూలీ అక్కడే కాసేపు వేచి చూశారు. అనంతరం, ఆయన అభిమానులు భారీగా అక్కడికి వచ్చారు.
Sourav Ganguly News:सौरव गांगुली की कार का एक्सीडेंट, बाल-बाल बचे दादा#SauravGanguly #Accident #LatestNews @khanduri_pooja pic.twitter.com/7ZnuBdhDYi
— Zee Delhi-NCR Haryana (@ZeeDNHNews) February 21, 2025
Comments
Please login to add a commentAdd a comment