
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు (43 ఓవర్ల వరకు) తీసిన షమీ.. వన్డేల్లో 200 వికెట్ల పూర్తి చేసుకున్నాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా 200 వన్డే వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ రికార్డు నెలకొల్పాడు. షమీకి 200 వికెట్లు తీసేందుకు 5126 బంతులు అవసరమయ్యాయి. షమీకి ముందు ఈ రికార్డు మిచెల్ స్టార్క్ పేరిట ఉండింది. స్టార్క్ 5240 బంతుల్లో 200 వన్డే వికెట్ల మైలురాయిని తాకాడు.
బంతుల పరంగా అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్లు..
షమీ-5126 బంతులు
స్టార్క్- 5240
సక్లెయిన్ ముస్తాక్- 5451
బ్రెట్ లీ- 5640
ట్రెంట్ బౌల్ట్- 5783
వకార్ యూనిస్- 5883
మ్యాచ్‌ల ప్రకారం చూస్తే.. షమీ.. మిచెల్ స్టార్క్ తర్వాత అత్యంత వేగంగా 200 వికెట్ల వన్డే మైలురాయిని తాకిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
మ్యాచ్‌ల ప్రకారం అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన ఆటగాళ్లు..
స్టార్క్- 102
షమీ/సక్లెయిన్ ముస్తాక్- 104
ట్రెంట్ బౌల్ట్- 107
బ్రెట్ లీ- 112
అలన్ డొనాల్డ్- 117
ఓవరాల్‌గా చూస్తే.. వన్డేల్లో 200 వికెట్లు పూర్తి చేసిన 43 బౌలర్‌గా షమీ రికార్డుల్లోకెక్కాడు. భారత తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదో బౌలర్‌గా నిలిచాడు. షమీకి ముందు అనిల్ కుంబ్లే (334), జవగల్ శ్రీనాథ్ (315), అజిత్ అగార్కర్ (288), జహీర్ ఖాన్ (269), హర్భజన్ సింగ్ (265), కపిల్ దేవ్ (253), రవీంద్ర జడేజా (226) భారత్ తరఫున 200 వికెట్లు తీశారు. జవగల్ శ్రీనాథ్ (315), అజిత్ అగార్కర్ (288), జహీర్ ఖాన్ (269), కపిల్ దేవ్ (253) తర్వాత 200 వికెట్ల క్లబ్‌లో చేరిన ఐదో భారత పేసర్‌గా షమీ రికార్డు నెలకొల్పాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఆదిలో భారత బౌలర్లు చెలరేగడంతో 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే తౌహిద్ హృదోయ్, జాకిర్ అలీ (68) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి బంగ్లాదేశ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. 46.2 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 215/8గా ఉంది. తౌహిద్ హృదోయ్ (91 నాటౌట్), తస్కిన్ అహ్మద్ క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment