
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ ఇవాళ (ఫిబ్రవరి 20) తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. దుబాయ్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా.. బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి.
ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మరో 12 పరుగులు చేస్తే.. వన్డేల్లో 11,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా, ప్రపంచంలో 10వ ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. 2007 జూన్ 23న బెల్‌ఫాస్ట్ లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్.. ఇప్పటివరకు 268 మ్యాచ్‌లు ఆడి 10,988 పరుగులు చేశాడు.
వన్డేల్లో 11000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు..
సచిన్ టెండూల్కర్ (భారత్)- 18,426
కుమార్ సంగక్కర (శ్రీలంక)- 14,234
విరాట్ కోహ్లీ (భారత్)- 13,963
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)-13,704
సనత్ జయసూర్య (శ్రీలంక)- 13,430
మహేల జయవర్ధనే (శ్రీలంక)- 12,650
ఇంజమామ్-ఉల్-హక్ (పాకిస్థాన్)- 11,739
జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా)- 11,579
సౌరవ్ గంగూలీ (భారత్)- 11,363
ఈ మ్యాచ్‌లో రోహిత్ 11000 పరుగులు పూర్తి చేస్తే మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసకుంటాడు. సహచరుడు విరాట్ కోహ్లీ తర్వాత ప్రపంచంలో అత్యంత వేగంగా 11000 వన్డే పరుగులు పూర్తి చేసిన రెండో ప్లేయర్‌గా రికార్డుకెక్కుతాడు. విరాట్ 222 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని తాకగా.. రోహిత్‌కు 260వ ఇన్నింగ్స్‌లో 11000 పరుగులు పూర్తి చేసే అవకాశం వచ్చింది.
వన్డేల్లో అత్యంత వేగంగా 11000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు..
విరాట్ కోహ్లీ (భారత్)- 222 ఇన్నింగ్స్‌లు
సచిన్ టెండూల్కర్ (భారత్)- 276
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 286
సౌరవ్ గంగూలీ (భారత్)- 288
జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా)- 293
నేటి మ్యాచ్‌లో రోహిత్ సెంచరీ చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సెంచరీలు పూర్తి చేసిన మూడో భారతీయ ఆటగాడిగా, ప్రపంచంలో 10వ క్రికటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్ ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 49 సెంచరీలు చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు..
సచిన్ టెండూల్కర్ (భారత్)- 100
విరాట్ కోహ్లీ (భారత్)- 81
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 71
కుమార్ సంగక్కర (శ్రీలంక)- 63
జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా)- 62
హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా)- 55
మహేల జయవర్ధనే (శ్రీలంక)- 54
బ్రియాన్ లారా (వెస్టిండీస్)- 53
జో రూట్ (ఇంగ్లాండ్)- 52
రోహిత్ శర్మ (భారత్)- 49
ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే.. కెప్టెన్‌గా రోహిత్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరుతుంది. నేటి మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే..రోహిత్ ఖాతాలో 100 అంతర్జాతీయ విజయాలు నమోదవుతాయి. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో భారత కెప్టెన్‌గా రోహిత్ రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్ ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో 99 విజయాలు (137 మ్యాచ్‌ల్లో) సాధించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్లు..
ఎంఎస్ ధోనీ- 179
విరాట్ కోహ్లీ- 137
మొహమ్మద్ అజారుద్దీన్- 104
రోహిత్ శర్మ- 99
సౌరవ్ గంగూలీ- 97
నేటి మ్యాచ్‌లో రోహిత్ 14 సిక్సర్లు కొడితే వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృస్టిస్తాడు. ప్రస్తుతం పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది (398 మ్యాచ్‌ల్లో 351 సిక్సర్లు) పేరిట ఈ రికార్డు ఉంది. రోహిత్ ఇప్పటివరకు 268 మ్యాచ్‌ల్లో 338 సిక్సర్లు బాదాడు.
Comments
Please login to add a commentAdd a comment