
స్టీవెన్ స్మిత్ సెంచరీ
జమైకా: వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. స్టీవెన్ స్మిత్ సెంచరీ సాధించాడు. 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్ స్మిత్ అజేయ సెంచరీతో కోలుకుంది. క్లార్క్ తో కలిసి మూడో వికెట్ కు 118 జోడించాడు. స్మిత్ 278 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 135 పరుగులు చేశాడు.
మైఖేల్ క్లార్క్ 47, వోగ్స్ 37, మార్ష్ 11 పరుగులు చేశారు. ఓపెనర్ వార్నర్ డకౌట్ అయ్యాడు. స్మిత్(135), వాట్సన్(20) క్రీజ్ లో ఉన్నాడు. విండీస్ బౌలర్లలో టేలర్ 3 వికెట్లు పడగొట్టాడు. హోల్డర్ ఒక వికెట్ పడగొట్టాడు.