టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా విఫలమైన జో రూట్.. రెండో టెస్టులో మాత్రం తన మార్క్‌ను చూపించాడు. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన సెకెండ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.
130 బంతులు ఎదుర్కొన్న రూట్.. 11 ఫోర్లతో 106 పరుగులు చేశాడు. రూట్‌కు ఇది 36వ టెస్టు సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ఓ అరుదైన ఘనతను రూట్ తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదో బ్యాటర్‌గా భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రికార్డును ఈ ఇంగ్లండ్ లెజెండ్ సమం చేశాడు.
ద్రవిడ్ తన అంతర్జాతీయ టెస్టు కెరీర్‌లో 36 సెంచరీలు చేశాడు. రూట్ మరో సెంచరీ సాధిస్తే ద్రవిడ్‌ను అధిగమిస్తాడు. కాగా రూట్ 2021 నుంచి ఇప్పటి వరకు రూట్ అత్యధికంగా 19 టెస్టు సెంచరీలు చేయడం విశేషం.
ఇక టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(51) అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. జాక్వెస్ కలిస్(45), రికీ పాంటింగ్(41), కుమార సంగక్కర(38), ద్రవిడ్(36), రూట్(36) తర్వాతి స్ధానాల్లో ఉన్నారు.
కాగా రెండో టెస్టులో న్యూజిలాండ్‌పై 323 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది.
చదవండి: ఆసీస్ చేతిలో ఘోర ఓటమి.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే?
Comments
Please login to add a commentAdd a comment