2023 వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎదురీదుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన బట్లర్ సేన ఇన్నింగ్స్ ఆరంభం నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వస్తుంది. మధ్యలో (ఐదో వికెట్‌కు) కాసేపు (70 పరుగులు) రూట్, బట్లర్ జోడీ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసినప్పటికీ బట్లర్ వికెట్ పడ్డాక కథ మళ్లీ మొదటికొచ్చింది.
Watch Joe Root's reverse-scoop: https://t.co/riEnCtwreZ pic.twitter.com/RCUIh8oFUl
— CricTracker (@Cricketracker) October 5, 2023
బట్లర్ ఓటయ్యాక 33 పరుగులు జోడించిన అనంతరం లివింగ్‌స్టోన్ కూడా ఔటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ 221 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో అప్పటికే క్రీజ్‌లో పాతుకుపోయిన జో రూట్ బాధ్యతాయుతంగా ఆడాల్సింది పోయి నిర్లక్ష్యపు షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు.
Wait what 🤯!
— CricTracker (@Cricketracker) October 5, 2023
Reverse scoop to Trent Boult 🤯, Joe Root🤌
📸: Disney+Hotstar pic.twitter.com/R1JRhC2BUk
రివర్స్ స్వీప్ జో రూట్ (77) కొంపముంచింది..
ఈ ఇన్నింగ్స్‌లో ఆరంభం నుంచి క్రమం తప్పకుండా రివర్స్ స్వీప్ షాట్లు ఆడి సక్సెస్ సాధించిన రూట్.. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ మరోసారి అదే ప్రయత్నం చేయబోయి మూల్యం చెల్లించుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రూట్ అనవసరపు షాట్‌కు ప్రయత్నించి ఫిలిప్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఫలితంగా ఇంగ్లండ్ 229 పరుగుల వద్ద (41.1 ఓవర్లు) ఏడో వికెట్ కోల్పోయింది.
ఆఖర్లో కుదురుకున్న ఇంగ్లండ్.. గౌరవప్రదమైన స్కోర్
ఇంగ్లండ్ టెయిలెండర్లు ఆఖర్లో తలో చేయి వేసి ఓ మోస్తరు పరుగులు సాధించడంతో ఇంగ్లండ్ ఊహించిన దాని కంటే ఎక్కువ పరుగులు స్కోర్ చేసింది. 252 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ మరో 30 పరుగులు జోడించి 282 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది.
మార్క్ వుడ్ (13), ఆదిల్ రషీద్ (15) అజేయంగా నిలువగా.. బెయిర్‌స్టో (33), మలాన్ (14), బ్రూక్ (25), మొయిన్ అలీ (11), బట్లర్ (43), రూట్ (77), లివింగ్‌స్టోన్ (20), సామ్ కర్రన్ (14), క్రిస్ వోక్స్ (11) ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3, సాంట్నర్, ఫిలిప్స్ తలో 2, బౌల్ట్, రవీంద్ర చెరో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment