భారత్‌లో జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 2023లో ఇంగ్లండ్ జట్టు ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తుది జట్టులోని సభ్యులందరూ (11 మంది) రెండంకెల స్కోర్లు చేసి చరిత్ర సృష్టించారు. 4658 వన్డేల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఇంగ్లండ్ జట్టు సభ్యులు జానీ బెయిర్‌స్టో (33), డేవిడ్ మలాన్ (14), హ్యారీ బ్రూక్ (25), మొయిన్ అలీ (11), జోస్ బట్లర్ (43), జో రూట్ (77), లియామ్ లివింగ్‌స్టోన్ (20), సామ్ కర్రన్ (14), క్రిస్ వోక్స్ (11), మార్క్ వుడ్ (13 నాటౌట్), ఆదిల్ రషీద్ (15 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు.
4,658 ODI matches in history so far.
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 5, 2023
First time ever all the 11 batters of a team scored runs in double digits. pic.twitter.com/UYP1oWDf0S
ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్లు రాణించినప్పటికీ జట్టులోని సభ్యులందరూ తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3, సాంట్నర్, ఫిలిప్స్ తలో 2, బౌల్ట్, రవీంద్ర చెరో వికెట్ దక్కించుకున్నారు.
283 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఏడో బంతికే వికెట్ కోల్పోయినప్పటికీ.. వన్‌డౌన్‌లో వచ్చిన రచిన్ రవీంద్ర (39), డెవాన్ కాన్వే (33) ధాటిగా ఆడుతూ తమ జట్టును లక్ష్యం దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. 9 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 73/1గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment