అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రేపు (అక్టోబర్ 5) జరుగబోయే వరల్డ్‌కప్ 2023 ఆరంభ మ్యాచ్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తుంది. తుంటి నొప్పి (Hip Pain) కారణంగా ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఇబ్బంది పడుతున్నాడని సమాచారం. న్యూజిలాండ్‌తో రేపు జరుగబోయే మ్యాచ్ సమయానికి స్టోక్స్ నొప్పి నుంచి తేరుకోవడం అనుమానమనని తెలుస్తుంది.
రేపటి మ్యాచ్‌కు స్టోక్స్ అందుబాటులో ఉండటం అనుమానమని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌కు స్టోక్స్ బెంచ్‌కు పరిమితం కావడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. స్టోక్స్ గాయంపై ఇంగ్లండ్ క్రికెట్ ప్రతినిధులు ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, ఈ వార్త సోషల్‌మీడియాలో వైరలవుతుంది.
ఒకవేళ స్టోక్స్ గాయం నిజమై రేపటి మ్యాచ్‌కు అతను దూరమైతే, అది ఇంగ్లండ్ విజయావకాశాలను తప్పకుండా ప్రభావితం చేస్తుంది. వార్మప్ మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించి జోరుమీదున్న న్యూజిలాండ్ ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుని, గత వరల్డ్‌కప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది. కాగా, గతంలో వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టోక్స్ ఇటీవలే ఈ ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇచ్చి, వచ్చీ రావడంతోనే న్యూజిలాండ్‌పై భారీ సెంచరీతో విరుచుకుపడిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, రేపటి నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్‌కప్ నవంబర్ 19 వరకు సాగుతుంది. మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆడుతుంది. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా.. ఆసీస్‌తో తలపడుతుంది. ఆతర్వాత భారత్ అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్తాన్‌తో (న్యూఢిల్లీ) తమ రెండో మ్యాచ్ ఆడుతుంది. దీని తర్వాత టీమిండియా.. అక్టోబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాక్‌ను ఢీకొంటుంది.
Comments
Please login to add a commentAdd a comment