వరల్డ్‌కప్ నేపథ్యంలో ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చాడన్న శుభవార్త తెలిసిన నిమిషాల వ్యవధిలోనే ఇంగ్లండ్ జట్టుకు ఓ బాధాకరమైన వార్త కూడా తెలిసింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఇంగ్లండ్ వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని ఇంగ్లండ్ సెలెక్టర్ లూక్ రైట్ చెప్పకనే చెప్పాడు. మోచేతి గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆర్చర్‌ను న్యూజిలాండ్ సిరీస్‌కు కూడా ఎంపిక చేయలేదని.. ఆర్చర్‌తో తమకు ఉన్న దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా అతని విషయంలో హడావుడి నిర్ణయాలు తీసుకోలేమని రైట్ తెలిపాడు.
ఆర్చర్‌ను న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపిక చేయనప్పటికీ, అతను ట్రావెలింగ్ రిజర్వ్‌గా (రిజర్వ్ ఆటగాడి) ఇంగ్లండ్ జట్టుతో పాటు ఇండియాకు బయల్దేరతాడని పేర్కొన్నాడు. ఆర్చర్ విషయంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చాలా జాగ్రత్తగా ఉందని, ఒకవేళ అతను వరల్డ్‌కప్ సెకండాఫ్ సమయానికి ఫిట్‌నెస్ నిరూపించుకోగలిగితే జట్టుతో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టునే దాదాపుగా వరల్డ్‌కప్‌కు కూడా ఎంపిక చేయవచ్చని హింట్ ఇచ్చాడు. ఇదే వరల్డ్‌కప్‌కు తమ ప్రొవిజనల్ స్క్వాడ్ అని కూడా తెలిపాడు.
ఇదిలా ఉంటే, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ వరల్డ్‌కప్‌లో తమ తొలి మ్యాచ్‌ను అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5న గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్‌తో ఆడుతుంది. దీనికి ముందు ఆ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తోనే 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్, తదుపరి 4 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ సెలెకర్లు రెండు వేర్వేరు జట్లను కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు.
ఈ పర్యటనలో తొలి టీ20 ఆగస్ట్ 30న, రెండోది సెప్టెంబర్ 1న, మూడోది సెప్టెంబర్ 3న, నాలుగో టీ20 సెప్టెంబర్ 5న జరుగనున్నాయి. అనంతరం సెప్టెంబర్ 8న తొలి వన్డే, సెప్టెంబర్ 10న రెండో వన్డే, సెప్టెంబర్ 13న మూడో వన్డే, సెప్టెంబర్ 15న నాలుగో వన్డే జరుగనున్నాయి.
న్యూజిలాండ్ పర్యటన కోసం ఇంగ్లండ్ టీ20 జట్టు..
జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, బెన్ డకెట్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్, జాన్ టర్నర్, ల్యూక్ వుడ్
న్యూజిలాండ్ పర్యటన కోసం ఇంగ్లండ్ వన్డే జట్టు..
జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లే, డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్
వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లండ్ ప్రొవిజనల్ స్క్వాడ్..
జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లే, డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్
Comments
Please login to add a commentAdd a comment