Ben Stokes Comes Out Of ODI Retirement, Gets Picked In England Squad For New Zealand Series - Sakshi
Sakshi News home page

ODI WC 2023: బెన్‌ స్టోక్స్‌ వచ్చేశాడు.. ఇంగ్లండ్‌ను ఆపడం కష్టమే..!

Published Wed, Aug 16 2023 3:36 PM | Last Updated on Wed, Aug 16 2023 3:42 PM

Ben Stokes Officially Comes Out Of ODI Retirement, Got Placed In England ODI Squad For New Zealand Series - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023కు ముందు డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌​కు ఇంగ్లండ్‌కు శుభవార్త అందింది. ఆ జట్టు టెస్టు కెప్టెన్‌, స్టార్‌ ఆల్‌ రౌండర్‌ బెన్ స్టోక్స్ తన రిటైర్మెంట్‌ (వన్డే) నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇంగ్లండ్‌ మేన్‌జ్‌మెంట్‌ విజ్ఞప్తి మేరకు స్టోక్స్‌ మళ్లీ వన్డేల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ఇవాళ (ఆగస్ట్‌ 16) అధికారికంగా ప్రకటించింది. 

వరల్డ్‌కప్‌ సన్నాహకాల్లో భాగంగా ఇంగ్లండ్‌ సెలెక్టర్లు స్టోక్స్‌కు వన్డే జట్టులో స్థానం కల్పించారు. త్వరలో జరుగనున్న న్యూజిలాండ్‌ సిరీస్‌ కోసం స్టోక్స్‌ను వన్డే జట్టుకు ఎంపిక చేశారు. ఇంగ్లండ్‌ సెలెక్టర్లు న్యూజిలాండ్‌ సిరీస్‌ కోసం టీ20, వన్డే జట్లను ఇవాళే ప్రకటించారు. 4 టీ20లు, 4 వన్డే సిరీస్‌ల కోసం ఇంగ్లండ్‌లో పర్యటించే న్యూజిలాండ్‌ జట్టు తొలుత టీ20 సిరీస్‌ (ఆగస్ట్‌ 30 నుంచి సప్టెంబర్‌ 5 వరకు), ఆతర్వాత వన్డే సిరీస్‌ ఆడనుంది.

ఈ పర్యటనలో తొలి టీ20 ఆగస్ట్‌ 30న, రెండోది సెప్టెంబర్‌ 1న, మూడోది సెప్టెంబర్‌ 3న, నాలుగో టీ20 సెప్టెంబర్‌ 5న జరుగనున్నాయి. అనంతరం సెప్టెంబర్‌ 8న తొలి వన్డే, సెప్టెంబర్‌ 10న రెండో వన్డే, సెప్టెంబర్‌ 13న మూడో వన్డే, సెప్టెంబర్‌ 15న నాలుగో వన్డే జరుగనున్నాయి.

న్యూజిలాండ్‌ పర్యటన కోసం ఇంగ్లండ్‌ టీ20 జట్టు..
జోస్ బట్లర్ (కెప్టెన్‌), రెహాన్ అహ్మద్, మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, బెన్ డకెట్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్, జాన్ టర్నర్, ల్యూక్ వుడ్

న్యూజిలాండ్‌ పర్యటన కోసం ఇంగ్లండ్‌ వన్డే జట్టు..
జోస్ బట్లర్ (కెప్టెన్‌), మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లే, డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement