New Zealand series
-
ODI WC 2023: బెన్ స్టోక్స్ వచ్చేశాడు.. ఇంగ్లండ్‌ను ఆపడం కష్టమే..!
వన్డే ప్రపంచకప్-2023కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్‌కు ఇంగ్లండ్‌కు శుభవార్త అందింది. ఆ జట్టు టెస్టు కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తన రిటైర్మెంట్ (వన్డే) నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇంగ్లండ్ మేన్‌జ్‌మెంట్ విజ్ఞప్తి మేరకు స్టోక్స్ మళ్లీ వన్డేల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇవాళ (ఆగస్ట్ 16) అధికారికంగా ప్రకటించింది. వరల్డ్‌కప్ సన్నాహకాల్లో భాగంగా ఇంగ్లండ్ సెలెక్టర్లు స్టోక్స్‌కు వన్డే జట్టులో స్థానం కల్పించారు. త్వరలో జరుగనున్న న్యూజిలాండ్ సిరీస్ కోసం స్టోక్స్‌ను వన్డే జట్టుకు ఎంపిక చేశారు. ఇంగ్లండ్ సెలెక్టర్లు న్యూజిలాండ్ సిరీస్ కోసం టీ20, వన్డే జట్లను ఇవాళే ప్రకటించారు. 4 టీ20లు, 4 వన్డే సిరీస్‌ల కోసం ఇంగ్లండ్‌లో పర్యటించే న్యూజిలాండ్ జట్టు తొలుత టీ20 సిరీస్ (ఆగస్ట్ 30 నుంచి సప్టెంబర్ 5 వరకు), ఆతర్వాత వన్డే సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో తొలి టీ20 ఆగస్ట్ 30న, రెండోది సెప్టెంబర్ 1న, మూడోది సెప్టెంబర్ 3న, నాలుగో టీ20 సెప్టెంబర్ 5న జరుగనున్నాయి. అనంతరం సెప్టెంబర్ 8న తొలి వన్డే, సెప్టెంబర్ 10న రెండో వన్డే, సెప్టెంబర్ 13న మూడో వన్డే, సెప్టెంబర్ 15న నాలుగో వన్డే జరుగనున్నాయి. న్యూజిలాండ్ పర్యటన కోసం ఇంగ్లండ్ టీ20 జట్టు.. జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, బెన్ డకెట్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్, జాన్ టర్నర్, ల్యూక్ వుడ్ న్యూజిలాండ్ పర్యటన కోసం ఇంగ్లండ్ వన్డే జట్టు.. జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లే, డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్ -
మరో సిరీస్‌కు డివిలియర్స్ దూరం
రిటైర్మెంట్ ఆలోచన లేదన్న దక్షిణాఫ్రికా స్టార్ జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ టెస్టు కెరీర్ మరోసారి సందేహంలో పడింది. వచ్చే మార్చిలో న్యూజి లాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు తాను అందుబాటులో ఉండటం లేదని అతను ప్రకటించాడు. సరిగ్గా ఏడాది క్రితం తన చివరి టెస్టు మ్యాచ్ ఆడిన ఏబీ, మోచేతి గాయం కారణంగా మూడు టెస్టు సిరీస్‌లలో పాల్గొనలేదు. గత ఏడాది ఆగస్టు నుంచి అతను పూర్తిగా ఆటకు దూరంగా ఉన్నాడు. అయితే తాను టెస్టుల నుంచి రిటైర్ కావడం లేదని కూడా అతను ధ్రువీకరించాడు. 2019 వన్డే ప్రపంచ కప్‌లో పాల్గొనడమే లక్ష్యంగా ఈ ఫార్మాట్‌కు ప్రస్తుతం దూరంగా ఉంటున్నట్లు డివిలియర్స్ చెప్పాడు. ఈ నెల 25న శ్రీలంకతో జరిగే టి20 మ్యాచ్‌తో అతను మళ్లీ మైదానంలోకి అడుగు పెడుతున్నాడు. ‘నేను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. అందువల్ల జాగ్రత్తగా మ్యాచ్‌లను ఎంచుకోవాల్సి ఉంది. కాబట్టి టెస్టులు ఆడటం లేదు. నా ప్రధాన లక్ష్యం 2019 ప్రపంచ కప్ గెలవడం’ అని అతను చెప్పాడు. -
మనోళ్లు పాక్ నుంచి లాగేసుకున్నారు
కోల్‌కతా: టీమిండియా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టింది. కోల్‌కతాలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో విరాట్ కోహ్లీ సేన 178 పరుగులతో ఘన విజయం సాధించి.. సిరీస్‌తో పాటు పాకిస్థాన్ వద్ద ఉన్న నెంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతేగాక ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న పాక్‌ను భారత్ వెనక్కునెట్టి మళ్లీ నెంబర్‌వన్‌గా నిలిచింది. సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో టీమిండియా ఈ ఘనత సాధించడం అభిమానులకు సంతోషం కలిగిస్తోంది. పాక్ చరిత్రలో తొలిసారి నంబర్‌వన్ కాగానే ఆ దేశ అభిమానులు భారత్‌ను కవ్వించేలా సోషల్ మీడియా ద్వారా రకరకాల విమర్శలు చేశారు. ఇప్పుడు విరాట్ సేన న్యూజిలాండ్‌పై గెలిచి ఆ ర్యాంక్‌ను లాగేసుకుంది. -
విరాట్ కోహ్లి సరికొత్త లుక్!
ప్రతీ ఫార్మాట్లో పరుగుల ప్రవాహం సాగిస్తూ ప్రపంచ క్రికెట్‌ను ఊపేస్తున్న భారత ఆటగాడు విరాట్ కోహ్లి.. స్టైలింగ్‌లో కూడా తనదైన ముద్రతో దూసుకుపోతున్నాడు. ఎప్పటికప్పుడు ట్రెండీ లుకింగ్ తో అదరొట్టే కోహ్లి మరోసారి కొత్త లుక్‌లో కనిపించాడు. తలకు రెండు వైపులా చిన్నగా మాత్రమే జుట్టు ఉంచి... మధ్యలో ఉన్న జుట్టుకు హెయిర్ స్టైట్నింగ్ చేయించుకున్నాడు. ఈ తాజా విరాట్ హెయిర్ స్టైల్‌కు ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అపెనీ జార్జ్ కొత్త లుకింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోను విరాట్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. గతంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ కూడా అపెనీ జార్జ్ వద్ద హెయిర్ స్టైల్ చేయించుకున్నాడు. మరికొన్ని రోజుల్లో న్యూజిలాండ్‌లో జరుగుతున్న సుదీర్ఘ క్రికెట్ సిరీస్‌లో విరాట్ ఇదే లుక్‌లో కనిపించే అవకాశం ఉంది.