విరాట్ కోహ్లి సరికొత్త లుక్!
ప్రతీ ఫార్మాట్‌లో పరుగుల ప్రవాహం సాగిస్తూ ప్రపంచ క్రికెట్‌ను ఊపేస్తున్న భారత ఆటగాడు విరాట్ కోహ్లి.. స్టైలింగ్లో కూడా తనదైన ముద్రతో దూసుకుపోతున్నాడు. ఎప్పటికప్పుడు ట్రెండీ లుకింగ్ తో అదరొట్టే కోహ్లి మరోసారి కొత్త లుక్లో కనిపించాడు. తలకు రెండు వైపులా చిన్నగా మాత్రమే జుట్టు ఉంచి... మధ్యలో ఉన్న జుట్టుకు హెయిర్ స్టైట్నింగ్ చేయించుకున్నాడు. ఈ తాజా విరాట్ హెయిర్ స్టైల్కు ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అపెనీ జార్జ్ కొత్త లుకింగ్ ఇచ్చారు.
దీనికి సంబంధించిన ఫోటోను విరాట్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. గతంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్ కూడా అపెనీ జార్జ్ వద్ద హెయిర్ స్టైల్ చేయించుకున్నాడు. మరికొన్ని రోజుల్లో న్యూజిలాండ్లో జరుగుతున్న సుదీర్ఘ క్రికెట్ సిరీస్లో విరాట్ ఇదే లుక్లో కనిపించే అవకాశం ఉంది.