ఓపెనింగ్‌ సెర్మనీ లేదు.. ఖాళీ కుర్చీలు.. ఊహించిన విధంగా ప్రారంభం కాని క్రికెట్‌ వరల్డ్‌కప్‌ | CWC 2023 Has No Opening Ceremony, Stadium Looks Empty For Opening Match, Fans Get Disappointed | Sakshi
Sakshi News home page

ఓపెనింగ్‌ సెర్మనీ లేదు.. ఖాళీ కుర్చీలు.. ఊహించిన విధంగా ప్రారంభం కాని క్రికెట్‌ వరల్డ్‌కప్‌

Published Thu, Oct 5 2023 3:07 PM | Last Updated on Thu, Oct 5 2023 4:44 PM

CWC 2023 Has No Opening Ceremony, Stadium Looks Empty For Opening Match, Fans Get Disappointed - Sakshi

మహా క్రికెట్‌ సంగ్రామం వన్డే వరల్డ్‌కప్‌ 2023 ఊహించిన విధంగా ఆరంభానికి నోచుకోలేదని క్రికెట్‌ అభిమానులు బాధపడుతున్నారు. ప్రతిష్టాత్మకమైన నరేంద్ర మోదీ స్టేడియంలో టోర్నీ ఆరంభ మ్యాచ్‌కు ముందు  భారీ తారాగణంతో ఓపెనింగ్‌ సెర్మనీ ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ మెగా టోర్నీని తూతూమంత్రంగా ప్రారంభించారు నిర్వహకులు. 

అలాగే టోర్నీ ఆరంభ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలివస్తారని అంతా ఊహించారు. అయితే ఇది కూడా జరగలేదు. మ్యాచ్‌ ప్రారంభమై గంట గడుస్తున్నా స్టేడియం మొత్తం ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. ఈ సీన్‌ను చూసి అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. అసలు ఇది వరల్డ్‌కప్‌ టోర్నీనేనా.. ఈ మ్యాచ్‌ జరుగున్నది భారత దేశంలోనే అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  

ఐసీసీ వరల్డ్‌కప్‌ గ్లోబల్‌  అంబాసిడర్‌ హోదాలో సచిన్‌ టెండూల్కర్‌ టోర్నీని అధికారికంగా ప్రారంభించాడనే మాట తప్పించి మెగా టోర్నీ ప్రారంభమంతా నామమాత్రంగా సాగడంతో అభిమానులు పెదవి విరుస్తున్నారు. జనాలు స్టేడియంకు రాలేదంటే ఇవాళ పని దినం అనుకునే సర్దిచెప్పుకోవచ్చు.. మరి కనీసం ఓపెనింగ్‌ సెర్మనీ కూడా నిర్వహించలేని దుస్థితిలో బీసీసీఐ ఉందా అంటే..? ఈ ప్రశ్నకు ఏలికలే సమాధానం చెప్పాలి.

ఏదిఏమైనప్పటికీ వరల్డ్‌కప్‌ 2023 మాత్రం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 13 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 64/2గా ఉంది. ఓపెనర్లు బెయిర్‌స్టో (33), మలాన్‌ (14) ఔట్‌ కాగా.. జో రూట్‌ (16), హ్యారీ బ్రూక్‌ క్రీజ్‌లో ఉన్నారు. మ్యాట్‌ హెన్రీ, మిచెల్‌ సాంట్నర్‌కు తలో వికెట్‌ దక్కింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement