భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా ప్రారంభమైందని బాధపడుతున్న క్రికెట్ అభిమానులకు ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో అదిరిపోయే కిక్ ఇచ్చాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 5) ప్రారంభమైన టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ రెండో బంతికే సిక్సర్ బాదిన బెయిర్‌స్టో, మెగా టోర్నీకి ఓపెనింగ్ సెర్మనీ జరగకపోయినా అంతకుమించిన మజాను అందించాడు.
First runs of the #icccricketworldcup2023 & that too with a SIX 6⃣ ...
— SRKxVIJAY (@Srkxvijay) October 5, 2023
England started the Bazball way 🔥🔥#ENGvsNZ #ICCCricketWorldCup #Ahmedabad #NarendraModiStadium pic.twitter.com/ddyNAfYHyL
ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్‌లో రెండో బంతినే సిక్సర్‌కు తరలించడం ద్వారా బెయిర్‌స్టోతో పాటు ఇంగ్లండ్ జట్టు రికార్డుపుటల్లోకెక్కింది. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. టోర్నీలో తొలి పరుగులు సిక్సర్ రూపంలో రావడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఈ షాట్‌తో బెయిర్‌స్టోతో పాటు ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ చరిత్రపుటల్లోకెక్కింది. తొలి ఓవర్‌లో బెయిర్‌స్టో సిక్సర్‌తో పాటు మరో బౌండరీ కూడా బాదాడు. తద్వారా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో 12 పరుగులు సాధించింది.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ 23 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (33), డేవిడ్ మలాన్ (14), హ్యారీ బ్రూక్ (25), మొయిన్ అలీ (11) ఔట్ కాగా.. జో రూట్ (35), జోస్ బట్లర్ (4) క్రీజ్‌లో ఉన్నారు. మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment