టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన ఫామ్‌ను తిరిగిపొందాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లి సూపర్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన కింగ్ కోహ్లి.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దుమ్ములేపాడు.
ఆస్ట్రేలియా గడ్డపై తనే రాజునని అని మరోసారి చాటి చెప్పాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 143 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను కోహ్లి అందుకున్నాడు. సరిగ్గా 100 పరుగులు చేసి కోహ్లి ఆజేయంగా నిలిచాడు.
కాగా ఈ ఏడాది టెస్టుల్లో కోహ్లికి ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా కోహ్లికి ఇది 30 టెస్టు సెంచరీ. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్ సాధించింది. సెకెండ్ ఇన్నింగ్స్‌ను 487/6 వద్ద భారత్ డిక్లేర్ చేసింది.
దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి 534 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ముందు భారత్ ఉంచింది. భారత బ్యాటర్లలో కోహ్లితో పాటు యశస్వి జైశ్వాల్(161) అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. అంతకుముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ కేవలం 104 పరుగులకే కుప్పకూలింది.
Comments
Please login to add a commentAdd a comment