దక్షిణాఫ్రికా టాపార్డర్ బ్యాటర్ రియాన్ రికెల్టన్ (101; 11 ఫోర్లు) సెంచరీతో దక్షిణాఫ్రికాను నిలబెట్టాడు. శ్రీలంకతో గురువారం మొదలైన రెండో టెస్టులో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 86.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.
మిడిలార్డర్‌లో కెప్టెన్ తెంబా బవుమా (78; 8 ఫోర్లు, 1 సిక్స్), కైల్ వెరీన్ (48 బ్యాటింగ్; 6 ఫోర్లు) రాణించారు. ఆతిథ్య జట్టు బ్యాటింగ్‌కు దిగగానే అసిత ఫెర్నాండో... ఓపెనర్ టోని డి జోర్జి (0)ని డకౌట్ చేశాడు. కాసేపటికే లహిరు కుమార నిప్పులు చెరగడంతో మార్క్‌రమ్ (20; 4 ఫోర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (4) పెవిలియన్ దారి పట్టారు.
44 పరుగులకే 3 కీలకమైన వికెట్లు కోల్పోగా, బవుమాతో జతకట్టిన రికెల్టన్ సఫారీని ఆదుకున్నాడు. నాలుగో వికెట్‌కు 133 పరుగులు జోడించాక 177 స్కోరు వద్ద బవుమాను ఫెర్నాండో అవుట్ చేశాడు. కాసేపటికే బెడింగ్‌హామ్ (6) జయసూర్య బౌలింగ్‌లో 186 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా సగం వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో రికెల్టన్, వెరీన్ నింపాదిగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. 250 పైచిలుకు స్కోరు నమోదయ్యాక సెంచరీ పూర్తయిన వెంటనే రికెల్టన్ వికెట్‌ను లహిరు పడగొట్టగా, ఓవర్ వ్యవధిలో యాన్సెన్ (4)ను విశ్వ ఫెర్నాండో అవుట్ చేయడంతో సఫారీ ఏడో వికెట్‌ను కోల్పోయింది. లహిరు కుమార 3, అసిత ఫెర్నాండో 2 వికెట్లు తీశారు.
చదవండి: SMT 2024: అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ
Comments
Please login to add a commentAdd a comment