Ryan Rickelton
-
రికెల్టన్, వెర్రిన్ సెంచరీలు.. సౌతాఫ్రికా భారీ స్కోర్
గెబెర్హా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 103.4 ఓవర్లలో 358 పరుగులకు ఆలౌటైంది. ర్యాన్ రికెల్టన్ (101), వికెట్ కీపర్ కైల్ వెర్రిన్ (105 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కారు. కెప్టెన్ టెంబా బవుమా (78) అర్ద సెంచరీతో రాణించాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ 20, టోనీ డి జోర్జి 0, ట్రిస్టన్ స్టబ్స్ 4, బెడింగ్హమ్ 6, మార్కో జన్సెన్ 4, కేశవ్ మహారాజ్ 0, రబాడ 23, డేన్ పీటర్సన్ 9 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో లహీరు కుమార 4 వికెట్లు పడగొట్టగా.. అశిత ఫెర్నాండో 3, విశ్వ ఫెర్నాండో 2, ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం రెండో రోజు తొలి సెషన్ ఆట కొనసాగుతుంది.కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా 233 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. -
రికెల్టన్ సెంచరీ.. తొలి రోజు సఫారీలదే
దక్షిణాఫ్రికా టాపార్డర్ బ్యాటర్ రియాన్ రికెల్టన్ (101; 11 ఫోర్లు) సెంచరీతో దక్షిణాఫ్రికాను నిలబెట్టాడు. శ్రీలంకతో గురువారం మొదలైన రెండో టెస్టులో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 86.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.మిడిలార్డర్లో కెప్టెన్ తెంబా బవుమా (78; 8 ఫోర్లు, 1 సిక్స్), కైల్ వెరీన్ (48 బ్యాటింగ్; 6 ఫోర్లు) రాణించారు. ఆతిథ్య జట్టు బ్యాటింగ్‌కు దిగగానే అసిత ఫెర్నాండో... ఓపెనర్ టోని డి జోర్జి (0)ని డకౌట్ చేశాడు. కాసేపటికే లహిరు కుమార నిప్పులు చెరగడంతో మార్క్రమ్ (20; 4 ఫోర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (4) పెవిలియన్ దారి పట్టారు.44 పరుగులకే 3 కీలకమైన వికెట్లు కోల్పోగా, బవుమాతో జతకట్టిన రికెల్టన్ సఫారీని ఆదుకున్నాడు. నాలుగో వికెట్‌కు 133 పరుగులు జోడించాక 177 స్కోరు వద్ద బవుమాను ఫెర్నాండో అవుట్ చేశాడు. కాసేపటికే బెడింగ్హామ్ (6) జయసూర్య బౌలింగ్‌లో 186 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా సగం వికెట్లు కోల్పోయింది.ఈ దశలో రికెల్టన్, వెరీన్ నింపాదిగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. 250 పైచిలుకు స్కోరు నమోదయ్యాక సెంచరీ పూర్తయిన వెంటనే రికెల్టన్ వికెట్‌ను లహిరు పడగొట్టగా, ఓవర్ వ్యవధిలో యాన్సెన్ (4)ను విశ్వ ఫెర్నాండో అవుట్ చేయడంతో సఫారీ ఏడో వికెట్‌ను కోల్పోయింది. లహిరు కుమార 3, అసిత ఫెర్నాండో 2 వికెట్లు తీశారు.చదవండి: SMT 2024: అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ -
చెలరేగిన ఓపెనర్.. సౌతాఫ్రికా ఘన విజయం
ఐర్లాండ్‌తో తొలి వన్డేలో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. పాల్ స్టిర్లింగ్ బృందాన్ని ఏకంగా 139 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సౌతాఫ్రికా.. ఐర్లాండ్‌తో తొలుత రెండు టీ20లు ఆడింది.పొట్టి సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ప్రొటిస్ జట్టు గెలుపొందగా.. రెండో టీ20లో అనూహ్య రీతిలో ఐర్లాండ్ పది పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం వన్డే సిరీస్ మొదలైంది. అబుదాబి వేదికగా జరిగిన మొదటి వన్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది.చెలరేగిన ఓపెనర్ఓపెనర్ రియాన్ రికెల్టన్.. 102 బంతుల్లో 7 ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 91 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ టోనీ డి జోర్జీ(12), కెప్టెన్ తెంబా బవుమా(4), వాన్ డెర్ డసెన్(0) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో ఐదో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ రికెల్టన్‌తో కలిసి ప్రొటిస్ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. 86 బంతుల్లో 79 పరుగులు చేశాడు.మిగతా వాళ్లలో జోర్న్ ఫార్చూన్ 28, లుంగి ఎంగిడి 20(నాటౌట్) పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 271 పరుగులు చేసింది. ఐరిష్ బౌలర్లలో మార్క్ అదేర్ నాలుగు, క్రెయిగ్ యంగ్ మూడు వికెట్లు కూల్చగా.. హ్యూమ్, ఆండీ మెక్‌బ్రిన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.132 పరుగులకు ఆలౌట్ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌ను సౌతాఫ్రికా బౌలర్లు ఆది నుంచే బెంబేలెత్తించారు. ఏ దశలోనూ ఐరిష్ బ్యాటర్లను కోలుకోనివ్వలేదు. ఫలితంగా 31.5 ఓవర్లకే 132 పరుగులు చేసి ఐర్లాండ్ జట్టు కుప్పకూలింది. ప్రొటిస్ పేసర్లలో లిజాడ్ విలియమ్స్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీశాడు. ఒట్నీల్ బార్ట్‌మన్, వియాన్ ముల్దర్ ఒక్కో వికెట్ కూల్చారు. స్పిన్నర్ జోర్న్ ఫార్చున్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఐర్లాండ్ బ్యాటర్లలో జార్జ్ డాక్రెల్ 21 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన రియాన్ రెకెల్టన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం(అక్టోబరు 4) రెండో వన్డే జరుగనుంది.చదవండి: న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్సీకి సౌథీ గుడ్‌బై.. కొత్త కెప్టెన్ ఎవరంటే?