
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా లహోర్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సఫారీ బ్యాటర్లలో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. మరో ఓపెనర్ టోనీ డిజోర్జీ తొందరగా ఔటైనప్పటికి రికెల్టన్ మాత్రం మెరుపులు మెరిపించాడు.
రికెల్టన్ కేవలం 106 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 103 పరుగులు చేసి ఔటయ్యాడు. ర్యాన్ మంచి ఊపులో ఉండగా దురదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. అతడితో పాటు కెప్టెన్ టెంబా బావుమా(58), రాస్సీ వండర్ డస్సెన్(52), ఐడైన్ మార్‌క్రమ్(52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరిశారు.
అఫ్గానిస్తాన్ బౌలర్లలో మహ్మద్ నబీ రెండు వికెట్లు పడగొట్టగా.. ఫరూఖీ, ఒమర్జాయ్ తలా వికెట్ సాధించారు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఒక్క వికెట్ కూడా పడగొట్ట లేకపోయాడు. మరి 316 పరుగుల భారీ లక్ష్యాన్ని అఫ్గాన్ చేధిస్తుందో లేదో వేచి చూడాలి. ఇంతకుముందు వన్డే ప్రపంచకప్-2023లో మాత్రం సఫారీలను అఫ్గాన్ మట్టికర్పించింది.
తుది జట్లు
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఫజల్హాక్ ఫరూఖీ, నూర్ ఆహ్మద్
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), టోనీ డి జోర్జి, టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్‌గిడి
చదవండి: భారత్‌తో మ్యాచ్.. మాకు స్పెషలేమి కాదు: పాక్ స్టార్ బౌలర్
Comments
Please login to add a commentAdd a comment