గెబెర్హా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 103.4 ఓవర్లలో 358 పరుగులకు ఆలౌటైంది. ర్యాన్ రికెల్టన్ (101), వికెట్ కీపర్ కైల్ వెర్రిన్ (105 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కారు. కెప్టెన్ టెంబా బవుమా (78) అర్ద సెంచరీతో రాణించాడు.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ 20, టోనీ డి జోర్జి 0, ట్రిస్టన్ స్టబ్స్ 4, బెడింగ్హమ్ 6, మార్కో జన్సెన్ 4, కేశవ్ మహారాజ్ 0, రబాడ 23, డేన్ పీటర్సన్ 9 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో లహీరు కుమార 4 వికెట్లు పడగొట్టగా.. అశిత ఫెర్నాండో 3, విశ్వ ఫెర్నాండో 2, ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం రెండో రోజు తొలి సెషన్ ఆట కొనసాగుతుంది.
కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా 233 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment