ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్.. ఇప్పుడు ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. మొన్నటికి మొన్న వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో విఫలమైన విండీస్ జట్టు.. ప్రస్తుతం భారత్‌తో జరగుతోన్న టెస్టు సిరీస్‌లో కూడా అదే తీరును పునరావృతం చేస్తోంది. డొమినికా వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో కరేబియన్ జట్టు ఘోర ఓటమి చవిచూసింది.
రెండు సార్లు వన్డే, టీ20 ప్రపంచకప్‌లను ముద్దాడిన విండీస్ జట్టు.. ప్రస్తుతం ఒక్క మ్యాచ్‌లోనైనా గెలుస్తే చాలు అన్న స్ధితికి దిగజారింది. విండీస్ క్రికెట్‌కు ఈ పరిస్థితి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యం కారణం వారి వార్షిక వేతనాలతో పాటు మ్యాచ్ ఫీజ్‌లు తక్కువ ఉండటమే. దీంతో చాలా మంది ఆటగాళ్లు తమ దేశం తరపున కాకుండా ఫ్రాంచైజీ లీగ్‌లకే ఎక్కువ ప్రాధన్యత ఇస్తున్నారు.
అందులో సునీల్ నరైన్, అండ్రీ రస్సెల్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ముందు వరుసలో ఉంటారు. ఇక ఇదే విషయంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వాఖ్యలు చేశారు. తమ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులు పెంచి, సెంట్రల్ కాంట్రాక్ట్‌లను తగ్గించాలని విండీస్ క్రికెట్ బోర్డుకు సునీల్ గవాస్కర్ సలహా ఇచ్చాడు.
"వెస్టిండీస్ క్రికెటర్లకు మినహా ప్రపంచంలోని మిగితా ఆటగాళ్లందరకి ఆయా క్రికెట్ బోర్డులు సెంట్రల్ కాంట్రాక్ట్‌లతో పాటు ఫీజుల రూపంలో లక్షల డాలర్లు చెల్లుస్తున్నాయి. అదే విధంగా వారి క్రికెటర్లకు అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నాయి. కానీ విండీస్ పరిస్ధితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇది కూడా వారి ప్రదర్శన సరిగా లేకపోవడానికి ప్రధాన కారణమవ్వచ్చు.
కాబట్టి విండీస్ క్రికెట్‌కు నేను ఇచ్చే సలహా ఒక్కటే. ఆటగాళ్లకు ఇచ్చే సెంట్రల్ కాంట్రక్ట్‌లను తగ్గించి మ్యాచ్ ఫీజ్‌లు పెంచండి. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో మ్యాచ్ ఫీజ్‌లు పెంచితే.. విండీస్ తమ పూర్వ వైభవాన్ని పొందే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ ఫీజులు పెంచితే ఆటగాళ్ల వ్యక్తగత ప్రదర్శనలో కూడా మార్పు రావచ్చు. లేదంటే భవిష్యత్తులో విండీస్ క్రికెట్‌కు మరిన్ని కష్టాలు ఎదురవతాయి" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs WI: టీమిండియాతో రెండో టెస్టు.. వెస్టిండీస్ జట్టు ప్రకటన! యువ సంచలనం ఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment