భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమైంది. సెప్టెంబర్ 19ను చెన్నై వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25లో భాగంగా జరగనున్న ఈ సిరీస్‌లో బంగ్లాను చిత్తు చేసి ముందుకు వెళ్లాలని టీమిండియా భావిస్తోంది.
ఇప్పటికే చెన్నైకు చేరుకున్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే తొలి టెస్టుకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ హెచ్చరించాడు. బంగ్లాదేశ్‌ను ఏమాత్రం తేలికగా తీసుకోవద్దని హిట్‌మ్యాన్‌ను అతడు సూచించాడు.
కాగా బంగ్లా జట్టు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. పాకిస్తాన్‌పై చారిత్రత్మక టెస్టు సిరీస్ విజయం సాధించి భారత గడ్డపై బంగ్లా జట్టు అడుగుపెట్టింది. ఇప్పటివరకు ఒక్కసారి టెస్టుల్లో టీమిండియాను బంగ్లా ఓడించనప్పటకి.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం ఓటమి రుచిని చూపించింది. 2007 వన్డే ప్రపంచ కప్, 2012 ఆసియా కప్, 2015, 2022 ద్వైపాక్షిక సిరీస్‌లలో బంగ్లా జట్టు భారత్‌కు షాకిచ్చింది.
"పాకిస్తాన్‌ను వారి సొంత గడ్డపై ఓడించి బంగ్లాదేశ్ తమ సత్తా చాటింది. వారి టెస్టు క్రికెట్ హిస్టరీలోనే పాక్‌పై తొలి సిరీస్ విజయం సాధించి ప్రపంచ క్రికెట్‌కు సవాలు విసిరింది. ఇప్పుడు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో భారత గడ్డపై అడుగుపెట్టారు.
టీమిండియాను ఓడించాలన్న లక్ష్యంతో వారు ఉన్నారు. రెండేళ్ల క్రితం భారత క్రికెట్ జట్టు టెస్టు సిరీస్ కోసం బంగ్లా పర్యటనకు వెళ్లింది. అప్పుడు కూడా వారు గట్టీ పోటీ ఇచ్చారు. ప్రస్తుతం బంగ్లా జట్టులో కొంతమంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు.
అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన వెంటనే ప్రత్యర్థిపై ఎలా ఆధిపత్యం ప్రదర్శించాలనేది త్వరగా నేర్చుకొంటున్నారు. పాక్‌పై విజయంతో బంగ్లా టీమ్‌ను ఏ ప్రత్యర్ధి కూడా తక్కువగా అంచనా వేయడం లేదు. కాబట్టి బంగ్లా-భారత్ సిరీస్ కచ్చితంగా మంచి సిరీస్ అవుతోంది" అని గవాస్కర్ తెలిపాడు.
మరో 10 మ్యాచ్‌లు..
టీమిండియా వచ్చే నాలుగైదు నెలల్లో 10 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే కనీసం ఐదు మ్యాచ్‌లోనైనా గెలవాలి. రాబోయే టెస్టు సీజన్ మొత్తం భారత్‌కు సవాల్‌తో కూడుకున్నది అని గవాస్కర్ మిడ్-డే కాలమ్‌లో రాసుకొచ్చాడు.
చదవండి: 'రోహిత్ నా బౌలింగ్ ఆడలేకపోయాడు.. బుమ్రా సైతం మెచ్చుకున్నాడు'
Comments
Please login to add a commentAdd a comment